పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సి.పి.కుమార్‌ 93965 14554

_అమ్మనుడి

తెలుగు భాషాబోధన - ఒక పరిశీలన

నేనాక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుని. పాతికేళ్ళ కిందట ప్రాథమిక ఉన్నత పాఠశాల చదువుల్ని నా మాతృభాష తెలుగు మీడియంలోనే పూర్తిచేశాను. ఒక విషయాన్ని అర్ధం చేసుకోవడంలోను, పరభాషలను నేర్చుకోవడంలోను మాతృభాషకున్న సౌలభ్యం ఎలాంటిదో స్వయంగా అనుభవం ఉంది. నా పిల్లల్ని కూడా కనీసం ప్రాథమిక విద్యనైనా మాతృభాష మాధ్యమంలో చదివించాలనుకున్నాను.

నేను ఉద్యోగం చేస్తున్నది బెంగళూరులో. అక్కడ తెలుగు మీడియం స్మూళ్లు లేవు. ఒకటి రెండు చోట్ల ప్రభుత్వ స్మూళ్లు ఉన్నా ఉపాధ్యాయుల కొరతా, అరకొర వసతులు ఉన్నందు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చాలనుకున్నాను. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్సు వదులుకొని ఇంటి నుండి పని చేయడానికి కంపెనీ దగ్గర అనుమతి తీసుకొని విజయవాదకు కుటుంబాన్ని మార్చాను. పోరంకి వికాస విద్యావనం పాఠశాలలో పిల్లల్ని చేర్చించాను. ఇది ఐదేళ్ళ కిందటి సంగతి. తెలుగు మీడియంలో ఆడుతూ, పాడుతూ ఐదవ తరగతి పూర్తి చేశారు. గత సంవత్సరం ఆరో తరగతిలో ఒక (ఫ్రైవేటు ఇంగ్రీషుమీడియం స్మూల్లో చేర్చించాను. ఐదవ తరగతి వరకు ఒక భాషగా ఇంగ్రీషును కూడా బాగా నేర్చించారు గనుక ఆరవ తరగతి ఇంగ్రీషు మీడియం అయినప్పటికీ ఇబ్బంది పడలేదు. అంతా బాగానే ఉంది. మరి సమస్య ఏమిటి? ఇప్పుడు సమస్యంతా తెలుగు పాఠాలతోనే. ప్రస్తుతం ఆన్‌ లైన్‌ క్లాసులు కదా! తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం. నేను అన్ని సబ్బక్టుల్లో సహకరించ గలుగుతున్నాను. కానీ

తెలుగులో మాత్రం పిల్లవాడు అడిగిన విషయాలు చెప్పలేక, నాకు అర్ధం కాక తెల్లమొఖం వేస్తున్నాను.

హైస్మూలు వరకు తెలుగు మీడియంలో చదివిన నేను ఒక ఆరవ తరగతి విద్యార్థికి తెలుగులో సహకరించలేకపోవడానికి కారణం ఏమిటి? పుస్తకం కఠినంగా ఉందా, లేదా టీచర్‌ బోధనే కఠినంగా ఉందా? ఒకసారి ఆరవ తరగతి తెలుగు పాఠ్యవుస్తకాన్ని పరిశీలించాలనుకొన్నాను. బోధనలో నాకేమీ అనుభవం లేదు. నేను విమర్శకుడినీ కాదు. మాతృభాషపై మమకారంగల వ్యక్తిగా, ఒక విద్యార్థి తండ్రిగా తెలుసుకోవాలనే కుతూహలం కొద్దీ ఆరవ తరగతి పాఠ్యపుస్తకాన్ని క్షుణంగా పరిశీలించాను. నాకొచ్చిన సందేహాలను కొద్దిమంది మిత్రులతో పంచుకొన్నాను. కొంతమంది విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను అడిగాను. అందరి అభిప్రాయాలను తీసుకొని నా పరిశీలనాంశాలను తెలియజేస్తున్నాను.

తెలుగు బాట 6 -ఇది పాఠ్యపుస్తకం పేరు. పుస్తకంలో వంద పేజీలున్నాయి. మొత్తం పాఠాలు 12. రెండు ఉపవాచకాల పాఠాలను తూడా పాఠ్యపుస్తకంలోనే ఇచ్చారు. ప్రతీపాఠానీకి అనుబంధంగా చదవండి, ఆనందించండి అనీ చిన్న చిన్న కథనో గేయాన్నో ఇచ్చారు. 3వ పాఠం ధర్మనీర్ణయం. పాఠం పరిచయం చేయదానికి ముందుగా ఒక ఛిన్న చిత్ర కథనీచ్చారు. ఇది అంత బాగాలేదు.

అందరికీ పరిచయమైన ఆవు పులి కథ. ఎంతో కరుణారసాత్మకమైనది. సత్య సంధతకు సంబంధించినది. దీన్ని అతి పేలవంగా 4 బొమ్మల్లో చూపించారు. అందులో కూడా ఆవు స్థానంలో జింకను చేర్చారు. ప్రసిద్ధమైన గొప్ప కవుల కథలను ఇలా మార్చడం బాగాలేదు. ఇదొక్కటి మినహా పాఠాలతో సమస్యలేదు- సమస్య అంతా వ్యాకరణంతోనే.

అభ్యాసాలు: అభ్యాసాలు రకరకాలు ఉన్నాయి. విల్లలు ఆలోభించాల్సినవి, అడిగి తెలుసుకొని రాయాల్సినవి ఉన్నాయి. వీటితో కూడా సమస్యలేదు. సమస్యంతా వ్వాకరణాంశాలతోనే. ఇన్ని బాగుండి ఒక్క వ్యాకరణాంశాలతో వచ్చే నష్టమేముంది అనుకోవచ్చు.

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

ఇవి ఎంతకఠినంగా ఉన్నాయంటే తెలుగు పాఠాలలో ఉన్న మంచిని, తెలుగుపై ఉన్న అభిమానాన్ని తుడిచిపెట్టేంతగా ఉన్నాయి. నేను విద్యార్థులను, టీచర్లను కూదా అడిగిచూసాను. అంతా పెదవి విరిచేవాచే. ఇవి అనవసరమనేవాదే. ఏవో నాలుగు సంధులు, ప్రకృతి వికృతులు వంటి నాలుగు రకాలు కాదు. మేము చదివే రోజుల్లో పదో తరగతిలో కూడా ఇవి లేవు. ఎన్ని రకాల వ్యాకరణాంశాలున్నాయో చూడండి.

1.అచ్చులు 2హల్లులు 8.హ్రస్వాలు 4. దీర్ధాలు 5. పరుషాలు, 6.సరళాలు 7. ద్విత్వాక్షరాలు 8.సంయుక్తాక్షరాలు 9. పర్టాయపదాలు 10. వ్యతిరేకార్థపదాలు 11. అనునాసికాలు 12.వర్ణ యుక్కులు 13.వర్షాక్షరాలు 14. అంతస్థాలు 15. ఊష్మాలు 16.న్టీరాలు 17.స్పర్శాలు 18.కంఠవ్యాలు 19.తాలవ్వాలు 20.మూర్దన్యాలు 21. దంత్యాలు 22. ఓష్టాలు 23.కంఠతాలవ్యాలు 24 కంఠోష్ట్రాలు 25. దంతోష్ట్యాలు 28.ప్రకృతులు 27. వికృతులు 28. తెలుగు సంధులు 29.సంస్కృత సంధులు 30. ఉత్వసంధి 31. అత్వసంధి 382 ఇత్వసంధి 88. సవర్ణదీర్హసంధి ౩4&గుణసంధి 35. భాషాభాగాలు 36. నామవాచకం 37. సర్వనామం 38. విశేషణం 39. అవ్యయం శ0.సంధి 41. వైకల్సికం త2.యడాగమం 43.సమాసం 44 ఉత్తరపదం 45. పూర్వపదం 46. ద్వంద్వసమాసం 47. విగ్రహవాత్యం 48. అన్ని విభక్తులు 49. సామాన్యవాక్యం 50.సంయుక్తవాక్యం 51. సంశ్లిష్టవాక్యం.

ఇన్ని అంశాలున్నాయనీ చాలా మందికి తెలియకపోవచ్చు. వీటిలో టీచర్లు, పండితులు ఎన్ని చెప్పగలరో ఆలోచించండి. పిల్లలకు అవి అవసరమా? ఖాషాశాస్త్రవేత్తలకు అవసరమైన విషయాలు ఇవన్నీ టీచర్‌ అవగాహనను బట్టి ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ వ్యాకరణాంశాలను వళ్మనబెట్టవచ్చు. కానీ అలాంటిదేమీ