పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలిగి చేయగలిగిందేముంది ,- కట్టే కొట్టే తెచ్చే పద్ధతిలో ఇదీ కధ .

ఈ కథ మథ్యలో గిరిజనజీవితంలో పోడు, వేట, పండుగలు, తగవులు, నమ్మకాలు,. చుక్కలు చూసి యోగం తెలుసుకునే దిసారి, దేవతలు పూనే బెబ్బుణి, ఫారెస్ట్‌ అధికారుల మామూళ్ళు, దౌర్జన్యాలు, సాహుకార్ల బేరాలు రచయిత జోప్పిస్తాడు. అన్నీ నిస్సహాయంగా భరించే జనం. వాళ్ళ సరదాలు సంతోషాలు, ఆట పాటలు... ఇటువంటి జీవిజాన్ని చిత్రించే సామెతలెన్నో మన గిరిజనుల వాడుకలో ఉన్నాయి..

కాండచేను కోమటివాడిదుకాణం.

కోదోడి పోడు కామటోడి సంచి...

అన్ని డిపార్టెమెంట్లు అనుకూలమే గాని ఫారెస్ట్‌ డిపాట్మెంట్‌ పరమశ'్రు.

అడిగిన పిల్ల కడిగిన మొహం.

“ఒక్క తల్లి పిల్లవైతే కో..కోడలమ్మా ,జొక్కలోని తట్టలవైములా”

జాకరి దేవత(శాంకరి,భూదేవత)కు మొక్కుతూ చేసే మొదటి వంటల పండుగ కొ(ర్రకొత్తనుండి పిండి పండుగ దాకా సాగే పంటకొత్తలు.,

కల్గు పండుగ, అదవి రాజుల పండుగ, మామిడి పండుగ వైత్రంలో వేటల(ఇటికల)-ఇలా అంతులేని పండుగలలో “అమ్మలతోడి ఆటలు, గోవులతో గొట్టి, గుబ్బట్లతో గుమ్మళ్ళతో తుళ్ళిపదే ఆట బసలు, వేట బసలు, పండుగ బసలు. గొట్టి బస, - ఈ పండుగలు, పబ్బాలు, తగువులు చర్చించి జరిపించే పెద్దల “గోస్టై

“అందమైన నందపురము నంది ఆటలె ఆడి వద్దాం, తీయగుమ్మడి తీసి వద్దాం, మళ్ళు గుమ్మడి మరలి వద్దాం్యి

“చక్కెర దేవికోటలోన (చక్రకూటం) చేదందాలు పట్టి -రండో చేరి పాండవులు లార భోంచేయ రందో” అని పాడుతూ ఒకనాటి చరిత్ర అడుగు జాడలను గుర్తు చేస్తాయి.

ఇటువంటి నానుడులు, కోదులకు ఉంటాయి. అవి రచయిత ఎంతగా వాదాడో అనువాదంలో తెలియదు.. అవి ఒడియా సాహిత్యంలోకి ఎంత చొచ్చుకు పోయాయో |!

చూస్తే గిరిజన జీవితం ఇలాగే కనీపిస్తుంది. ఇంతేనా! వాళ్ళకు ఇంతకంటే

మించిన ఆశయాలు ఆదర్శాలు, వాటికోసం ఆరాటపడిన చరిత్ర ఎమన్నా ఉన్నాయా అవి కొంతైనా చదివి తెలుసుకుని ఈ రచయిత గోపీనాధ మొహంతి, రాశాదా అంటే తెలుసు కోలేదు సరికదా వక్రీకరించాడు అని కూగా చెప్పొచ్చు .

సోనావేయి కులం దొంబులు, వీళ్ళది, విశాఖ మన్యం మత్స్య గుండం పక్కన ఒంధ్రుగడ్డ నుంచి వచ్చారని రచయిత చెపుతాడు. అది నిజమే అక్కడ వాళ్ళను కాంతమాలలు / కోలగాళ్ళు, వాల్ళీకులు అనీ పిలుస్తారు... గ్రామ నౌకర్లు కాబట్టి ఊరి పనులతో పాటు, మన్నానికి -పల్లానీకి షాహుకార్లకు, అధికార్లకు వాళ్ళే సంధానతర్తలు..

కాందకింద వడ్డాది మత్స్వరాజ్యంలో పిట్టగడ్డ నుంచి వాళ్ళు వచ్చినట్లు 'పిట్టగడ్డ జాలంపల్లి పట్టపు కోలన్న అంటూ అరణ్య అజ్ఞాత వాసాలు గడుపుతున్న పాండవుల గూర్చి పారుతూ విశాఖ మన్యంలో నంది, కొలువు పండుగలు చేస్తారు. వీళ్ళ ఆడపడుచు మాలగంగును కోడలును చేసుకున్న మన్యం ఇలవేలుపు వడ్డాది రాకుమారి, నందపురం కోడలు మోదకొండమ్మ గేయగాధను, గిరిజనులు భక్తి ప్రపత్తులతో పాడుకుంటారు. ప్రతి ఉళ్ళో గంగ పూజారి, వాళ్ళు పాడుకునే గంగావెల్లి పాటలను 1961 సెన్సస్‌, విలేజ్‌ మోనో[గ్రాఫ్‌లలో కనిపిస్తాయి... పురాణ ఇతిహాసాలే కాదు, ఒడియా మహాకావ్యం సరళాదాస్‌ జగ్‌ మోహన రామాయణం మొదలైనవి ఈ తెగల జీవితాన్ని వర్ణిస్తాయి... మహేంద్రగిరి, పూరీ జగన్నాధం, కళింగం రాజధాని ముఖలింగం గిరిజన మూలాలను చాటివెపుతాయి.

స్వతంత్రం వచ్చినప్పుడు విలీనమ్టైనవి, ఎక్కువగా, గణరాజ్యాలుగా పేరు మోసిన ఈ గిరిజన సంస్తానాలే. ఈ రచయిత ఉద్యోగం చేసే రోజులలో ఒరిస్సా మొదటి ముఖ్యమంత్రి కాండదొారతెగకు చెందిన పర్లాకిమిడి పాలకుడు... జయపురం పాలకుడు, విశాఖ నగర నీర్మాత విక్రమదేవ వర్మ లిఖిత సాహిత్యం ఇటువంటి వారసత్వం, ఎంతవరకు ఉపయోగించుకోగలిగింది ఉభయ భాషల ఆదివాసీ సాహిత్యంతో పరిచయమున్నవారు చెప్పాలి.

నాటి దిగువ రాజులతో నేస్తం”

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

సంబంధాలుగల ఈ తెగలు, రాజులతో కలిసి తెల్లవాళ్ళను ఎదిరిస్తారు. రాజులు లొంగారు కాని ఈ తెగలు లొంగలేదు. వారిలో ఉన్నట్టు చెప్పుకునే నరబలి మానిపించే సాకుతో తెల్లవాళ్ళు తమ బలగాలతో ఈ కొండలలోకి ప్రవేశించారు. ఈ సాయుధ సంస్కరణలకు రాజ్యాలలోనీ శిష్ట వర్షాల మద్దతు సంపాదించుకున్నారు. బలగాల తరలింపుకు రోర్లు వేసారు. గిరిజనుల తిరుగుబాట్లు/ పితూరీలను అణిచి వేసారు. రెవెన్యూ, ఫారెస్ట్‌, పోలీసు పాలన కోసం దిగువనుంచి వచ్చి ఉద్యోగులు వచ్చి తిష్టవేసారు. ఆ ఒరవడి, ఉద్యోగుల పెత్తనం, నేటికి కొనసాగుతున్నది.

ఈ రచయిత అటువంటి రివిన్యు అధికారులలో ఒకడు. అధికారి రచయిత కూదా అయితే, అక్కడా ఇక్కదా కొంత భజన బృందం ఉంటుంది.. వ్‌ చెట్టూ లేనిచోట ఆముదమే మహావ్చక్షమైనట్లు, పుస్తకాలపురుగులు, సాహిత్య గాళ్ళు ఇటువంటి రచనలద్వారా ప్రపంచాన్ని చూపిస్టారు, రసం ధ్వని, పాత్ర చిత్రణ “వ్రతానాం ఉత్తమం (వ్రతం? అంటూ ఆశ్రయించిన వారినీ ఆకాశానీకేత్తేస్తారు. సాహిత్య విమర్శను రక్తి కట్టిస్తారు. ఆ సాహిత్యం చూరులోంచి మనకు సమాజాన్నీ చూడటం అలవాటు చేస్తారు. 1956లో ఒడియాలో అవ్చైన ఈ రచనకు, పురిపందా అప్పలస్వామి అనువాదం 1966లో 2018లో కేంద్ర సాహిత్య అకాదెమీ ప్రచురించింది. ఇది కాక ఈ రచయిత గిరిజన జీవితం మీద చాలా కథలు నవలలు రాసారు. ఆంగ్లంలోకి అనువావం అయినాయి. జ్ఞానపీఠ్‌ అవార్డు అందుకున్నారు.

'వెన్నెలకోసం ఏద్చే రాత్రినీ, చుక్కలు ఓదార్చినట్లు, కర్తవ్యం బోధపదని వాళ్ళను కవి ఓదారుస్తాడు” “అన్నట్లు ఇటువంటివి ఆలోచింప చేయలేని ఓదార్పు రచనలు.

ఇక మన దగ్గర భద్రిరాజు కృష్ణమూర్తి 1960లోనే కువి భాషను అధ్యయనం చేసారు. తెలుగుగిరిజన మాండలికం అర్ధమైతేన్నే పొరుగునున్న కొందు, గోండు వంటి భాషలు అర్ధమౌతాయి. అనితెలుసుకున్నారు. వారి శిష్య (ప్రశిష్యులు వ్యాకరణానికి పరిమితమైనారు. సాహిత్యం జోలికి పోలేదు.

అయితే. 1982లో ప్రారంభమైన