పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న్‌ా 'ిు.

భారత ప్రధాన న్యాయమూర్తి మూలా న!

ప్రా. గారపాటి ఉమామహేశ్వరరావు 98661 28846

అమ్మనుడిలో చదివి అత్యున్నత పదవికి ... భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ నూతలవాటి వెంకట రమణ


మహర్షులు పుట్టరు, తయారవుతారు. సుఖాల్ని బంధించి, నంతోషాలను త్యజించి, నిరంతర శ్రమతో చెమటలు చిందించినపుడు మాత్రమే తయారవుతారు. తాము ఎంచుకున్న రంగంలో చేసే కృషినే తపస్సుగా భావించి శ్రమించినప్పుడు మాత్రమే తపస్వులు సిద్దులవుతారు.

అలాంటివారి జీవితం ఎప్పుడూ పూలబాట కాదు. కంటికీ రెప్పకీ దూరంగా నీద్రను నీలదీసి, ఒక జీవితకాలంపాటు వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యానీకి పణంగా పెడితేనే పర్వతశిఖరాగ్రాలు అందుతాయి. ఈ మాటలకు ముమ్మూర్తులా నిదర్శనంగా నిలిచే పదహారణాల తెలుగు పేరు- నూతలపాటి వెంకట రమణ. తెలుగుతనాన్నీ పేరులోనే కాదు, మాటలో నదతలో ఆలోచనల్లో ఆచరణల్లో నింపుకున్న ఓ అరుదైన వ్యక్తిత్వం ఆయనది.

అమ్మనుడిలో కమ్మగా చదివితే ఎంత సమున్నత స్టానాన్నైనా చాలా సులభంగా సాధించవచ్చు అని నిరూపించిన మాతృభాషాశ్రేమికుడు. మనిషి మనీషిగా ఎలా మారాలో తెలుసుకోవాలంటే రమణగారి జీవితాన్నీ ఒక్కసారి పలకరించాల్సిందే.

రైకు దేశానికి వెన్నెముక. కాబట్టే ఆ నేపథ్యం నుంచి వచ్చినవాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అన్నది అపోహేననీ ఆశయాల నిచ్చెన గట్టిగా ఉంటే ఆకాశం అందుతుందనీ, లక్ష్యం గట్టిగా ఉంటే పర్వతమైనా లొంగితీరుతుందనీ నిరూపించిన రైతుబిడ్డ. ఖారతదేశ అత్యున్నత న్యాయనస్సానానికి పథాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి తెలుగువారి వెలుగు పతాకను సగర్వంగా ఎగురవేశారు జస్టిస్‌ రమణ. ఆయన పేరుముందు న్యాయవాది అనే విశేషణంతో మొదలై భారత 'ప్రధాన న్యాయమూర్తి అనే ఉపనామం అలంకరించడానికి అచంచల దీక్ష పట్టుదలలే కారణం.

| తెలుగుజాతి పత్రిక జువ్సునుడి ఈ ఆగస్టు-2021

2021 ఏప్రిల్‌ 6న జస్టిస్‌ రమణను 48వ భారత (ప్రధాన న్యాయమూర్తిగా ఖారత రా్యషష్ట్రవతి నియమించారు. 2021 ఏప్రిల్‌ 24 న రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ జస్టిస్‌ రమణ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

జస్టిస్‌ వెంకట రమణ, మొదట అందరిలాగే ఒక సాధారణ న్యాయవాది. నల్లకోటును వృత్తికి అలంకారంగా కాక బాధ్యతకు గుర్తుగా స్వీకరించారు. అయితే వారికి ఉన్న బలం, ఆత్మబలమే. తాను ఎందులోనూ తక్కువ కాదనీ అలాగే తనకంటే ఇతరులు ఏమీ ఎక్కువ కాదనీ, సంకల్పం దృథంగా ఉంటే కన్న కల అందకుండా పోదనీ నమ్మీ, అందుకోసం శ్రమించారు కూదా. ఆయన ఎప్పుడూ వ్యక్తిగా పని చెయ్యలేదు. తానే ఒక సైన్యంగా తనగురించి తాను పూర్తిగా తెలుసుకున్నాడు. పట్టుదలనే స్ఫూర్తిగా మలుచుకున్నాడు. అందుకే తాను ఎంచుకున్న రంగమే అతడికి వశమై అత్యున్నత స్థానానికి చేర్చింది.

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నది సామెత. అవును, ముందు ఎవరి ప్రాంతాలను వాళ్ళు క్షుణంగా తెలుసుకోవాలి. జస్టిస్‌ రమణ చేసిందీ అదే. ఒక ప్రాంతీయ న్యాయవాదిగా ఉంటూ ఆ ప్రాంతంపై పట్టు పెంచుకున్నారు. నైపుణ్యాలను తెచ్చుకున్నాడు. కొన్నీ ప్రాంతాలు కలిస్తేనే ఒక దేశం. ఒక ప్రాంతంపై అవగాహన ఉన్నవాడికి దేశంపై అవగాహన పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. ఆ ప్రాంతంలో కూడా మట్టిలో నానిన జీవితాలు వ్యవసాయంతో పెనవేసుకున్న వరిచయాలే ఆయన్ని నమున్నతుడిగా నిలబెట్టాయి. ఆయన తల్లిదండ్రులు (కీ.శే. గణపతిరావు, కీ.శే. సరోజినీదేవి) ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లాలోని సామాన్య రైతు కుటుంబానికి చెందినవాళ్ళు.

లోళంలో వ్యవసాయాన్ని మించిన ఉత్కృష్టమైన ఫీ సాహసోపేతమైన పనీ మరొకటి లేదంటారు. రైతు వడే కష్టంకంటే 'హూనన్వాయమూర్తి పే కష్ట ఎంతమాత్రమూ ఎక్కువ కాదంటారాయన. ఇంతటిలోతైన దృష్టీ దానినుంచి అలవడిన నిశిత పరిశీలనే ఆయనకు న్యాయవాదం అంటే సమన్యాయాన్ని అందించటమేననీ అది ఒక