పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నమ్మకం మాత్రమే కాదు, ఒక బాధ్యత కూడానని చెబుతుంటారు. ఇదే నేటికీ ఒక సాధారణ మనిషిగా రైతువీడ్డగా ఉండేలా అలోచించేలా మాట్లాదేలా ఆచరించేలా చేసింది అంటారు. ఇనుము నిప్పులో కాలినప్పుడే మెత్తనవుతుంది, అప్పుడే కోరుకున్న పనిముట్టుగా సాగుతుంది. అలాగే జీవితంలో అనుభవించిన కష్టాలూ అనుసరించిన సాధారణమైన జీవితమే ఆయనకు సరళతను నేర్పాయి. దేన్నైనా ఇట్టే ఆకళింపు చేసుకోవడం చేసుకున్నదాన్ని సోపపత్తికంగా విశ్లేషించడం, విశ్లేషించినదాన్ని విశదం చెయ్యడం ఆయనకు మాతృభాషాధ్యయనం వల్లనే అలవడ్డాయి. అవే ఆయున న్యాయమూర్తిగా నిలదొక్కుకోడానీకీ ఇచ్చిన తీర్చులకు కూడా సరళతనూ స్పష్టతనూ సంపాదించిపెట్టాయి.

పల్లెటూరి జీవితం సమకుల్యతకు పెట్టింది పేరు. ఒకరిపై ఒకరు ఆధారవదడదం, అన్నింటినీ సమానంగా చూడడం, ఇచ్చిషుచ్చుకోవడం పల్లె జీవితానికి పట్టుగొమ్మలు. అదే, న్యాయవిధానంలో సమతుల్యతను ఎలా సాధించాలో నేర్చింది అనేది ఆయన మాటల్లో వినబడుతుంది. ఇక పుట్టిన నేల మాత్రమే కాదు తెలుగు భాష అన్నా తెలుగు సాహిత్యమన్నా ఆయనకు అంతులేని అభిమానం. ఆ అభిమానమే విషయాన్ని వేగంగా నమ్యగ్రంగా సంపూర్ణంగా ఎలా నేర్చుకోవాలో బోధించింది. చెరువులోని చేపపిల్లకి ఈత నేర్చడం ఎంత సులువో అమ్మభాషలో చదువుకున్నవారికి విజ్ఞానం నేర్పడం అంత సులువని నీరూపిస్తూ, తనలోనే అంతులేనీ శక్తి ఉందనీ తెలుసుకానీ ఆ శక్తిని వెలికి తీసి దానీకి పుస్తకాలతో మెరుగులు దిద్దుకున్నాడు. తాను వెలుగులోనికి వెళ్ళడమే కాదు తనతోపాటు ఉన్న ఎందరికో వెలుగు వాకిళ్లు తెరిచాడు. ఆ వెలుగు వెంట వడివడిగా నడిచి ఈ రోజు ఇంతటి అత్యున్నత శిఖరానికి చేరుకున్నాడు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ జుడీషియల్‌ అకాడెమీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దిగువ న్యాయస్థానాలలో తెలుగును అమలుపరిచేందుకు వీలుగా న్యాయవాదులనూ తెలుగు భాషావేత్తలనూ, విలేఖరులనూ కలిపి సదస్సులను ఎన్నీంటినో నిర్వహించడం, ఇంగ్లీషు -తెలుగు డిజిటల్‌ న్యాయపదకోశాన్ని తయారుచేయించి ప్రజాస్వామ్యంలో ప్రజలభాషలో పనులు జరగాలనే న్యాయసూత్రానికి మెరుగులద్దే ప్రయత్నం చేశారు.

అందరికీ అన్నీ సమకూదాలి, బతకదానికి కావలసినవన్నీ అందుకోవడం అందరి హక్కు ఆ హక్కు అందరికీ గౌరవప్రదంగా అనుభవంలోకి రావాలి అనే ఆలోచనా పరంపరలే ఆయనను న్యాయ విద్యా శిక్షణకు పురికొల్పాయి. న్యాయవాద వృత్తిని భుక్తికి గాక తాను వొచ్చిన నవుతావాదానీకి వెన్నెముకగా మార్చుకొని బడుగువర్జాలకు చేరాల్సిన సామాజిక న్యాయంకోసం పాటుపడడం మొదలుపెట్టాడు. న్యాయవాది రమణ తనను తానే సమన్వాయానికి చిరునామాగా మలుచుకున్నాడు. చిన్ననాటినుండే రైతుల ఇబ్బందుల్నీ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఈ ఆగస్టు-2021 |

కార్మికుల కష్టాలనూ, సామాజిక సమస్యలనూ అర్థంచేసుకుని ఎప్పటికప్పుడు స్పందిస్తూ విద్యార్ధి నాయకుడై ఎవ్వరూ వెయ్య లేని కొత్త అడుగును సంక్షేమం దిశగా వేని సమన్యల మలుపుల్లో పరిష్కారాల మ్హైలురాళ్ళను పాతుతూ సాగారు. అందుకనే న్యాయకోవిదులు కాంపరు ఆయనను (క్రియాశీలుడైన ఖావుకుదని కొనీయాదారు.

ఉలి దెబ్బకు బెదిరిపోతే శిల- గుడి మెల్లై కాలికింద నలిగిపోతుంది. కానీ, ఎన్నీ ఉలి దెబ్బలనైనా ఓర్చుకోగలిగితే అది గుడిలో దేవతగా నీరాజనాలను అందుకుంటుంది. అందుకే అత్యవసర సమయంలో అంతటి గడ్డు పరిస్థితుల్నే ఎదుర్మొన్నాడు. అన్నింటినీ భరించి తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు తన చుట్టూతా ఉన్న బెదదలను ఓర్భ్చుకాంటూ ముందుకు సాగాడు. (ప్రభాత సమయానికి భూమిని పెగిల్చుకౌని వచ్చే మొలకలా తలయెత్తి నిలిచాడు.

కొంతకాలం వ్రముఖ తెలుగు వార్తాపత్రికకు విలేఖరిగా పనిచేనిన అనుభవమే న్యాయరంగంలోనూ ఆయన నిరంతర చైతన్యంతో పరిగెత్తే సెలయేరై సాగిపోయేలా చేసింది. అదే, చేసిన సంకల్పాలన్నింటినీ చిగురించే వరకూ విజయం సాధించేవరకూ నిలబడి పోరాడే తత్వాన్ని నేర్చింది. అందుకే ఆయనకు విజయమే ఆమనిగా స్వాగతించింది. అక్కణ్డుంచి తిరిగి చూసుకోలేదు. న్యాయవాదిగా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ష్రానీకి అదనపు అద్వకేట్‌ జనరల్‌గా పనిచేశారు. అప్పుడూ సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనే చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. ఒక సైన్యంలా ఆయన సాగించిన వతి పోరాటంలోనూ రణరంగవే ఎదురొచ్చి తలవంభచింది.

హైకోర్టు న్యాయమూర్తిగానూ, (వధాన న్యాయమూర్తిగానూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానూ ఆయన వెలువరించిన తీర్పులు ఎప్పుడూ ఊహాతీత పరిష్కారాల ఆవిష్కరణకు అద్దం పడుతుంటాయి. వ్రగతిశీల నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చూపించిన ధైర్యసాహసాలు చిరస్మరణీయాలు. రాజ్యాంగం మరియు వాణిజ్య చట్టాల పరిధిలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు న్యాయకోవిదుల మన్ననల్ని పొందాయి.

అనురాధ భాసిన్‌ వర్సెస్‌ యూనీయన్‌ ఆఫ్‌ ఇండియా తీర్చూ, కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాళ్ళ్మీర్‌లో ఏడాది పొడవునా అంతర్జాల నిషేధంపై జస్టిస్‌ రమణ ఇచ్చిన తీర్పులు ప్రగతిశీలమైనవి. అంతేగాక, అంతర్జాల స్వేచ్చను (ప్రాథమిక హక్సుగా ప్రకటించడం, ఆధునిక అవసరాలను గుర్తిస్తూ తీర్పులకు సమగ్రతను జోడించటం ఆయన ప్రత్యేకత. సుప్రీంకోర్టు వర్సెస్‌ సుభాష్‌చంద్‌ అగర్వాలా తీర్పులో భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. శివసేన వర్సెస్‌ మహారాష్ట్రలో, చట్టనభా పరీక్షను నిర్వహించడానికి ఆయన ఇచ్చిన తీర్పు చట్టసభ్యుల కొనుగోళ్లనూ