పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“రిడుగు' ప్రత్యేకం

ప్రా.వెలమల సిమ్మన్న 9440641617

గిడుగు సూర్యరాయాంధ్ర నిఘంటువు విమర్శ - పరామర్శ


సవర భాషకు వీరు తయారు చేసిన నిఘంటువు పలువురి ప్రశంసల్ని అందుకుంది. నిఫఘుంటువులోనీ పదాలకు, ప్రయోగ పూర్వకమైన అర్ధవివరణ కూడా ఇచ్చారు. రామమూర్తిగారు సవర భాషలోని పర్యాయపదాల్ని జాతీయాల్చి కూడా సేకరించారు. వాటినీ నిఘంటువులో చేర్చలేదు. వీరు చేసిన తులనాత్మక అధ్యయనం తెలుగుజుతి ఎన్నటికి మరువలేనిది. తన నిఘంటువులో పదాలకు అర్ధాల్ని చూపదంతోపాటు చెట్టు, ఊళ్ళు, మనుషుల పేర్లను తెలియజేసే చిన్నపట్టికల్ని కూడా జతచేశారు. చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఇది.

“శబ్బరత్నాకరం” బహుజనవల్సి నీతారామచార్యులు తయారుచేశారు. ఈ నిఘంటువును పండితలోకం మెచ్చుకుంది. ఎంతో కష్టపడి ఎన్నో ప్రయోగాల్ని సేకరించి, నిర్మించారు శాస్త్రిగారు. 1912లో అచ్చయిన * శబ్దరత్నాకరం” ఆధారంగా గిడుగు నిశితంగా పరిశీలించారు.

ఈ నీఘంటువులో తాను చేసిన మార్పుల్ని గిడుగు కాంతమందికి ఉత్తరాల ద్వారా తెలియజేశారు. కొంతమంది పెద్దలతో చర్చలు కూదా చేశారు. “శబ్బరత్నాకరం” నీఘంటువుకు ఎన్నో సవరణల్ని చేశారు. “ఇంచుమించుగా రెండు వేల సవరణలను నేను దానిలో (శబ్ద రత్నాకరం) చేసినాను” అని కటారి ప్రభాకర శాస్త్రి గారికి రాసిన లేఖలో గిడుగు 'పేర్మొన్నారు.

శీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు “శబ్బరత్నాకరం” గూర్చి గిడుగుతో చర్చించారు. శీపాద వారి వ్యాసాన్ని బట్టి గిడుగు మరొక శబ్దరత్నాకరాన్ని కొన్సీ దాన్నీ రెండు భాగాలుగా చేసి రెండింటిలోను మభ్య మథ్య తెల్లకాగితాలు కలివి, ఖైందు చేయించారు.

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ ఆగస్టు-2021 |

“శబ్దరత్న్చాకరం”, “సూర్యరాయాంధ్ర నిఘంటువుోల గూర్చి గిడుగు చేసిన విమర్శలు వారి నైఘంటిక విజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. రామమూర్తిగారి చూపు వ్యాకరణాలపైనే కాక, నిఘంటువులపై కూదా పడింది. వీరు సవర- తెలుగు, తెలుగు- నవర, ఇంగ్లీషు- నవర, సవర-ఇంగ్లీషు నిఘంటువుల్ని తయారు చేశారు. నిఘంటువుల నిర్మాణానికి పండిత ప్రతిభతో పాటు, భాషా శాస్త్రజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం కూడా తప్పనిసరిగా వుండాలని గిడుగువారి అభిప్రాయం. మన ఆధునిక నిఘంటువుల్లో పసలేదనీ, ఎక్కువదోషాలతో వున్నాయనీ, రామమూర్తిగారు తీవ్ర పదజాలంతో విమర్శించారు.

“శబ్దరచ్చాకరం” విఘంటువులో చాలా దోషాలు వున్నాయని ఎత్తి చూపారు. బహుజనపల్లి సీత్రారామాచార్యులకు పాండిత్య (ప్రతిభతప్ప, భాషా జ్ఞానం, శాస్త్రీయ దృక్సథం, లేకపోవడం వల్ల, “శబ్దరత్చాకరంగలో 2000వేలకు పైగా దోషాలు వున్నాయని పరిశోధనలో నిర్ధారించారు. గిడుగువారి నిఘంటు నిర్మాణ కృషి ఎనలేనిది. వీరి నిఘంటు నిర్మాణ అధ్యాయం ఎంతో మందికి ఆదర్శం. నిఘంటు నిర్మాణంలో లోతుల్ని చూసిన మహామేధావి గిడుగు.

“శబ్దరత్నాకరం”లో వారు రాసినదాన్ని మరల నీటుగా రాయాలన్నదే వారి సంకల్పం. అయితే వారి జీవిత కాలంలో ఆ పనిని చేయలేక పోయారు. గిడుగు మనుమడు జి.వి. రామమూర్తి గారు తాతగారి (గ్రంథసూచిక వరకు గిడుగు బైండు చేయించిన “శబ్దరత్నాకరం” లోని తెల్ల కాగితాలపై ఎక్కించారు. అది కూడా అసంపూర్ణంగానే మిగిలిపోయింది.

“ఆది (సూర్యరాయాంధ్ర నిఘంటువు) “శబ్దరత్నాకరం” మీద ఇంటప్రూవ్‌మెంటు తప్ప, స్వతంత్ర [గ్రంథం కాదు, సమగ్రం అంతకంటే కాదు. నీర్జుష్టం కానే కాదు. కావడానికి తగిన సన్నివేశాలు ఎక్కడా లేనేలేవు. అది అచ్చులో వుందని తెలుస్తుంది. నేను దానీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చీరావడం తోనే, దాన్నీ నేను ముక్క చెక్కా కింద చితక్కొట్టేస్తాను. అందుకోసం ఈ శబ్దరత్నాకరాన్ని ఇంత జాగ్రత్తగా వుంచాను. దీన్ని అనునరించి వెలువడుతుంది కనుక, దాన్ని విమర్శించాలంటే దీనిమీద రాసి వుంచిన నోట్సు చాలా అవసరం. తర్వాత దీని పని తీరిపోతుంది. ఇంత పనిచేస్తే గాని, కృతకాంధ్రం యొక్క దౌర్భల్యమూ, దౌర్భాగ్యమూ, విదేశీయులకు పూర్తిగా జోధదవపడవు. నివుంటువును రాయడానికి ఎలాంటి వారు పూనుకోవాలో, వారిహ్బదయం ఎంత విశాలమయింది కావాలో, నంకుచిత భావాలతో పూనుకుంటే అది ఎలాగు నీరర్ణృకం అయిపోతుందో, జీవద్భాషను విడిచిపెట్టి, నిఘంటువు రాయడం ఎంత శవాలంకరణమో, దేశీయులకు బోధపదదంచాలా అవసరం. ఏది జరిగినా, జరగక పోయినా, నేనీది మాత్రం చేసి తీరుతాను. మీరు చూస్తారు” అని గిడుగు మాటలసందర్భంగా శ్రీపాదవారితో అన్నట్లు (శీపాదవారు తెలియచేశారు.

గిడుగు తాను అనుకున్న లోపాల్ని గానీ, తాను చేసిన సవరణల్ని