పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బడి చదువులో తొలి మెట్టుగా ఆయా ప్రాంతాల “ఇంటి భాషలను, మలి మెట్టుగా ఆయా ప్రాంతాలలోని మాండలికాలను, తుది మెట్టుగా ఆయా ప్రాంతాల లోని ప్రమాణ భాషను అంటే శిష్ట వ్యవహార భాషను, దానితోబాటుగా కావ్య భాషను వాడాలి.


(గాంధికం, ఇందులో శిష్ట వ్యావహారికం చెల్లుబాటు అవుతూ వచ్చినై. దక్షిణాంధ్ర యుగం సాహిత్యంలో శిష్ట వ్యావహారికపు పాలు ఎక్కువై జనానీకి మరింత దగ్గర అయింది. ఆ తరువాత భాష యొక్క వాడుక రంగాలు పెరిగినై. కావ్యాల ఊపు తగ్గి, వచన వాజ్మయం పెంపొందింది. అచ్చు యంత్రం, పత్రికలు వచ్చేసరికి వ్నాయ వ్యాప్తిలో వేగం, విస్తృతి పెరిగినై. ఇప్పటి వరకు శిష్ట వ్యవహార భాష సముచిత స్థానంలో కొనసాగుతుండగా 1948 తర్వాత చిన్నయసూరి (ప్రభావంతో పండితులు గ్రాంథిక వాదాన్నీ ముందుకు తెచ్చారు. అది అట్లా సుమారు 60 ఏళ్ళు కొనసాగింది. అప్పుడు (1915 ప్రాంతాలలో) జరిగింది గిడుగు ప్రవేశం. ఆయన ఏ ప్రయోజనాన్ని ఆశించి ఉద్యమించారు అనేది ఈ కింది మాటలలో చూడవచ్చు.

“మేము ఉద్దేశించిన ప్రయోజనము: ఇంగ్లండులో ఇంగ్లీషు, ఫ్రాన్సులో ్రెంచి ఎట్లున్నవో - అట్లే తెలుగు దేశములో పెద్దలు నోటను వాడే నేటి తెలుగు భాషకు సాధ్యమయినంత దగ్గరగా తెలుగువ్రాత తెచ్చి నోటిమాటా చేతివ్రాతా ఒకదానీ కౌకటి పోషకములుగా చేసి, రెండింటికీ సమముగా ప్రవృత్తి కలిగించి, వాత సార్ధ్థకముగాను సులభముగాను చేసి, తెలుగువారు వ్రాసేదేకాక మాట్లాదేదికూడా (క్రీగీటు నాది.) సభ్యభఖాషే అనే గౌరవము దేశమునకు సంపాదించడము.” (గిడుగు రచనా సర్వస్వం, పు. 43)

ఇక్కద “మాట్లాదేది కూడా సభ్యభాషే అనే మాటలు జూగ్రత్తగా గమనించాలి. (దీనిలోని 'సభ్య' శబ్బానికి పెదర్భాలు తీయకూడదు.) పాఠ్య పుస్తకాలలోని రాతలు అర్ధమయ్యే శిష్ట వ్యావహారికంలో ఉండి, బడి చదువుతో వాటి ప్రభావం వ్యక్తుల మీద ఏర్పడి, వారి మాటలో శిష్టత్వం కలగటాన్ని ఇక్కడ “సభ్యత అని చెప్పుకోవచ్చు.

దీన్ని సాధించటానికి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం జరిపారు. వ్యావహారిక ఖాషా వాదాన్నీ ప్రభుత్వం ఒప్పుకునేలా చేశారు. గిడుగువారి ఉద్యమం గురించి, దానీ ఫలితాలను గురించి గిడుగు తర్వాతి తరం భాషాశాస్త్రవేత్తలలో ఒకరైన గంటి జోగిసోమయాజిగారి మాటలలో చూద్దాం: “వీరు (గిడుగువారు) గొప్ప పండితులు. ఖాషాఖథీమానము గలిగి ఆత్మలాభమును గణింపక గొప్ప ప్రచారము సలిపిరి. వారి గ్రంథములను నవ్యసాహిత్య పరిషత్తువారు ్రచురించిరి. ఖాషక్షు గొప్ప యుపకృతిని చేసిరి. వీరి వాదము వలనను, ప్రయత్నము వలనను నేటి జెలుగున రెండు మార్పులు గలిగినవి. 1. పుస్తకములు వ్రాయువారికి పండితుల వలని భయమును, జంకుకొంకులును పోయినవి. నిర్భయముగా దోషము లుండు నేమో యను నంశయము వీడి గ్రంథములు వ్రాయుచున్నారు.. ఇది గొప్ప విషయమనుట నిర్వివాదము. 2. గ్రంథకర్తలు ప్రామాణిక భావమును వీడి తల కొక రీతిని వ్రాయుచున్నారు.. ఇది భాష కంత మంచి మార్సు గాదు. కాని ఇట్టి స్థితికి కేవలము రామమూర్తి పంతులుగారి సిద్దాంతము మాత్రమే హేతువు గాదు. దేశము నందలి స్వాతంత్ర్య ఖావము, విప్లవ వాతావరణము గూడ సహకారు అయినవి (జోగిసోమయాజి, గంటి. 1968: 244) దానితో, రాసేవారికి ఆటవిడుపు ఏర్పడింది. ఎట్లా పడితే అట్లా రాయవచ్చు అనేవారు బయల్దేరారు.

| తెలుగుజాతి పత్రిక జువ్మునుడి ఈ ఆగస్టు-2021 |

పైన ఉట్టంకించిన “గిడుగువారు ఉద్దేశించిన ప్రయోజనంలోని “నోటి మాటా చేతి వ్రాతా ఒకదానీకొకటి పోషకముగా” ఉండటం అనే మాటలను కొంచెం ఆలోచించి చూస్తే ఇట్లా అనిపిస్తుంది: నోటి మాట అంటే అన్ని రకాల మాండలికాలతో కూడిన వాడుక ఖాష చేతి వ్రాత అంటే అన్ని విధాలయిన రాతలతో కూడిన వాజ్మయ భాష. వాజ్మయ భాషలో కాలానుగుణమ్రైన మార్పులు రావటానికి వాడుక భాష తోదృ్చడుతుంది. వాడుక భాషలో (వ్యవహర్తలకు విద్య కారణంగా వాజ్మయ భాషతో పరిచయం పెరిగి) వైవిధ్యం పెచ్చుపెరగకుండా వాజ్మయ భాష తోద్బ్చడుతుంది. అట్లా జరిగి, గిడుగువారన్నట్లుగా, “వ్రాసేదే కాక మాట్లాదేది కూడా సభ్యభాషే” అవుతుంది.

గిడుగువారు. ఆశించినట్లుగానూ, ఆయనే రాని చూపించినట్లుగానూ కావ్యభాషకు పూర్తిగా ఖిన్నం కానిది, ప్రాంత ముద్ర లేనీదీ అయిన శిష్ట వ్యావహారికం కాకుందా, “రెండు మూడు జిల్లాలవారి భాష అనీ ముద్రపడే విధంగా రాసే భాష వాడుకలోకి తేబడింది. అదే ప్రామాణిక భాషగా 'పెత్తనం చెలాయిస్తున్నది అనిపించే విధానం ముందుకు వచ్చింది. దీనీ వల్ల క్రమంగా ఇతర (ప్రాంతాలవారిలో వైమనస్యాలు చోటు చేసుకున్నై

ఇప్పటి తెలుగు భాష స్థితిని బట్టి మనం ఏం చెయ్యాలి? తెలుగు రెండు రాష్ట్రాలలో ముఖ్య భాష సరిహద్దు రాష్ట్రాలలో కూడా బాగా వ్యాపించి ఉంది. ఒక పొరుగు రాష్ట్రంలో కూదా కొంత కాలం క్రితం ముఖ్య భాషే! కాని ప్రభుత్వాల కుతంత్రాల వల్ల దాని న్థానం జారి పోయింది, లేదా పోతున్నది. అయినప్పటికీ తెలుగుకు భౌగోళిక వ్యాప్తి చాలా ఉంది. ఆ కారణంగా వైవిధ్యం కూడా చాలా ఉంది. ఆ కారణంగానే పలు ప్రాంతాలలో పలు “శిష్ట” వ్యావహారికాలు ఉన్నై అదే కారణంగా (అంత భౌగోళిక వ్యాప్తి, ఇంత వైవిధ్యం కల భాషకు) ఒకే ఒక ప్రమాణ భాష సరిపోదు. అందువల్ల అన్ని ప్రాంతాల శిష్ణ్టవ్యావహారికాలను కలుపుకుంటూ కనీసం మూడు ప్రాంతీయ ప్రామాణిక భాషలను ప్రోత్సహించవచ్చు. ఈ విషయం మీద ఇటీవల తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక వారి వెభీనార్‌ లో చేను సమర్పించిన ప్రసంగ వ్యాసం “మాత్చభాషలు - విద్యాబోధన” లో వివులంగా చర్చించాను. దాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఇంటి భాషల విషయానికి వస్తే, బడి చదువులో తొలి మెట్టుగా ఆయా (ప్రాంతాల 'ఇంటి భాషలను, మలి మెట్టుగా ఆయా (ప్రాంతాలలోని మాండలికాలను, తుది మెట్టుగా ఆయా ప్రాంతాల లోని ప్రమాణ ఖాషను అంటే శిష్ట వ్యవహార భాషను, దానితోబాటుగా కావ్య భాషను వాడాలి. దీన్నీ గురించి కూడా ఆ ప్రసంగ వ్యాసంలో చర్చించాను.

చివరకు మళ్ళీ గిడుగువారి గురించి. ఎన్‌.ఎస్‌. రాజుగారు ఉట్టంకించిన విశ్వనాథవారి మాటల ప్రకారం “మన భాషలో ఇద్దరే వాగనుశాసనులు. నన్నయభట్టుగారు, గిడుగు రామమూర్తిభట్టు గారు" (రాజ్లు ఎన్‌. ఎస్‌. 2012 88) అటువంటి గిడుగును మళ్ళీ జాగ్రత్తగా చదువుకుంటే ఒక ప్రశ్న కలుగుతుంది: గిడుగు

అవసరం మనకు ఇప్పటికీ ఉందా? అని. ఉందనే అనిపిస్తుంది.

19