తెలుగు భాషోద్యమ సమాఖ్య యయా ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ | [||| 21-02-2021 సందర్భంగా చో
తెలుగుభాష ఆశయప్రకటన
తెలుగువారందరూ తమ రోజువాదీ వ్యవహారాలను తెలుగులో జరుపుకోగలగాలి. ఈ అందమైన కలను నీజం చేసుకోవడానికి 5 సూత్రాలు! ఆధునిక స్థాయిని సాధించేందుకు దారిదీపాలు!!
ఈ నేల మీద ప్రతి జీవి తన సొంతభాషలో జీవనం సాగిస్తుంది. మానవులు కూడా ఎవరి భాషలో వారు తాము కోరుకున్నంత ఆనందకరమైన, సౌకర్యవంతమైన జీవనాన్ని సాగించగలగాలి. అందుకు మొదటి మెట్టు అమ్మనుడిలో చదువులు. ఆపై అమ్మనుడిలో సమాచార అందుబాటు, రోజువారీ వ్యవహారాల జరుగుబాటు అనేవి మలిమెట్లు.
తెలుగువారందరూ తమ రోజువారీ వ్యవహారాలను తెలుగులో జరుపుకోగలగాలి.
మనకు తెలిసిన మాటలతో ఉన్న ఈ స్వప్నం తేలికగా కనబడవచ్చు కానీ దీనీకి లోతూ వెడల్పూ ఎక్కువ! ఈ స్వప్నం లోనీ మాటలను వివరంగా చూస్తే:
తెలుగువారు: నివసిస్తున్న ప్రాంతం ఏదైనా, తెలుగు ఇంట్లో పుట్టినవారు తెలుగువారు. (భార్యాభర్తల్లో ఒక్కరైనా తెలుగువారైతే అది తెలుగు ఇల్లే.) పుట్టుకతో సంబంధం లేకపోయినా, నేను తెలుగబ్బాయిని/తెలుగమ్మాయిని అనుకునేవారు కూడా తెలుగువారే!
అందరూ: ఏ కొద్దిమందో, వ్ కొన్నిచోట్లో తెలుగులో వ్యవహారాలు జరుపుకునే వెసులుబాటు ఉంటే సరిపోదు. ఈ సౌలభ్యం తెలుగువారందరికీ ఉందాలి. (కృతిమ మేధ-ఎ.ఐ. మెరుగైతే, నీవసిస్తున్న ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగువారందరూ కూడా ఈ వెసులుబాటు పొందగలుగుతారు.)
రోజువారీ వ్యవహారాలు: బడికెళ్ళే పిల్లవాడికీ, వాడికి చదువుచెప్పే గురువుకీ చదువు రోజువారీ వ్యవహారం. ఉద్యోగం చేసేవారికి ఆఫీసు పని రోజువారీ వ్యవహారం. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు రోజువారీ వ్యవహారం. అందరికీ వినోదం తదితర సమాచార అవసరాలు రోజువారీ వ్యవహారం.
తెలుగులో: అంటే, ఆయా ప్రాంతాల్లో ఆయా కాలాల్లో వాడుకలో ఉన్న మాటలతో తెలుగు లిపిలో ఉందాలి. వారి సొంత యాసలో బాసలో వారికీ, వారి చుట్టుపక్కలవారికీ అలవాటైన, సౌకర్యవంతమైన రీతిలో అని.
జరుపుకోగలగాలి: 'కలగాలీ” అంటే రెండు అర్థాలు: ఒకటి, తెలుగులో జరుపుకోవాలి అనీ ఎవరూ శాసించకుందానే, స్వచ్చందంగా ప్రజలు అనుకొని జరుపుకోవడం. రెండు, అందుకు తగ్గ పరిస్థితులు, సదుపాయాలు మనకు మనం కల్చ్పించుకోవడం.
ఈ కల నిజమవదానికి 5 సూత్రాలు: ఠి అమ్మనుడిలో చదువులు: పసి చదువుల నుండి పట్టా చదువుల వరకు. ప్రభుత్వ ప్రయివేటు బడులలోనూ. అ తెలుగులో పరిపాలన, న్యాయం: ప్రజలే 'ప్రభువులైన ప్రజాస్వామ్యంలో ప్రజల భాషలో పరిపాలన, న్యాయపాలన జరగాలి. 98 తెలుగులో వస్తు సేవలు వ్యాపార వ్యవహారాలు: మనం దబ్బు పోసి, కాంటున్న వస్తూత్పత్తులు, పొందుతున్న సేవలు మన భాషలో ఆశించడం తప్పు కాదు. అది మన హక్కు
9 తెలుగులో వినోద, విజ్ఞాన, వికాస సమాచారం: ఆటపాటలే కాదు, మానవులుగా మనం ఎవగదానీకి కావలసినదంతా తెలుగులోనూ ఉందాలి. లేకపోతే, తెచ్చుకోవాలి.
6 తెలుగులో సంపాదన అవకాశాలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికోట్లు పైనున్న తెలుగువారికి కావలసినవన్నీ (ఫైవన్నీ) తెలుగులో అందించడంలో తెలుగువారు మాత్రమే అందుకోగలిగే అంతులేని అవకాశాలు ఉన్నాయి.
| తెలుగుజాతి పత్రిక జువ్సునుడి. ఈ మార్చి-2021. |