బాధ్యులు-బాధ్యతలు
ప్రజలు
“ర్చేశ్రవుంటే మట్ళి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అవే నీనాదంతోపాటు మనం “భాషంటే దాన్ని మాట్లాడే ప్రజలోయ్” అనీ కూడా చెప్పుకోవాలి. ఇదంతా మన కోసమే. మన భాష మన బాధ్యత. ఏదైనా మనం సంపాదించుకున్నది, తయారుచేసినది అయితే వదిలేసుకునే, పాడుచేసుకునే స్వేచ్చ మనకు ఉంటుంది. కానీ మన భాష అలా కాదు. ఇది మనకు తరతరాలుగా వారసత్వంగా వచ్చింది. మనకు అందించబడింది. దాన్నీ పెంచి, పోషించి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. లేదా కనీసం మనం అందుకున్న స్థితి లోనే ముందు తరాలకు అందించాలి.
ఠి తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుదాం. అసలు ఎవరితోనైనా సంభాషణ తెలుగులో మొదలుపెడదాం. ఎదుటివారికి తెలుగు రాదు అనీ ముందే ఊహించేసుకునీ రాని ఖాషలో ఇబ్బంది వదొద్చు. తెలుగు నేలలో తెలుగులో వ్యవహరించడం సహజం. మనం మరీ వంగిపోనవసరం లేదు.
96 సామాజిక మాధ్యమాలలోనూ విరివిగా తెలుగులో రాద్దాం. వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి వాటిల్లోనూ తెలుగులో రాద్దాం. కాలక్షేపం కబుర్హూ సినిమా రాజకీయ తదితర సమకాలీన అంశాలు మాత్రమే కాక మరికొంచెం గంభీరమైన విషయాలపై కూడా తెలుగులో రాద్దాం. వచనం, పాటలు, పద్యాలు, కవితలు, వ్యాసాలు ఏవైనా!
అ వ్యాపార సంస్థలను వారి ఉత్పత్తులను, సేవలను తెలుగులో అందించమనీ అడుగుదాం. ఇప్పటికే తెలుగులో ఉన్న ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం . సేవలను తెలుగులో వాడుకుందాం. ఆయా సంస్థల వినియోగదారుల సహాయ కేంద్రాల ద్వారా తెలుగు కావాలని మన ప్రతిస్పందనలలో తెలియజేద్దాం.
9 _ నేటికీ కంప్యూటర్లలోనూ, చరవాణుల్లోనూ తెలుగు ఎలా రాయాలో తెలియనివారు చాలా మంది ఉన్నారు. మన చుట్టుపక్కల వారికి మనం సాంకేతిక సహాయం అందిద్దాం. మనం నిపుణులం అయివుందాల్సిన పనిలేదు. మనం తెలుగు ఎలా టైపుచేస్తున్నామో, చిన్నచిన్న సమస్యలను ఎలా అధిగమిస్తున్నామో చెప్తే సరిపోతుంది.
6 _ పిల్లలకు, యువతరానికి తెలుగును చేరువచేసేందుకు వారికి ఉపయోగపడే బాల సాహిత్యం, కథలతో పాటు వారు ఎదుర్శొనే సమస్యలపై, సవాళ్ళపై చర్చలు, వ్యాసాలు, తదితరాలు రాద్దాం. వాటిని యువతతం మాధ్యమాలలో (వలగూళ్ళు, యూట్యూబు, ఇన్‌స్టాగ్రామ్, మున్నగువాటిలో) ప్రసారం, ప్రచారం చెద్దాం.
- సంస్థాగతంగా తెలుగు కోసం పనిచేయాల్సిన సంస్థలను
వారినీ పనీ చేయమని ముల్గుగ్యరతో పొదవడం కూడా మన బాధ్యతలో భాగమే. ఆయా వ్యవస్థలు కాడి వదిలేనినప్పుడు అవసరమ్సైతే మనం భుజం కాయాలి, ఆ వ్యవస్థలను గాడిలో పెట్టుకోవాలి.
| తెలుగుజాతి పత్రిక జుమ్మనుడి ఈ మార్చి-2021 |
ప్రభుత్వం - శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు
ప్రజల తర్వాత వారిపై అత్యంత ప్రభావాన్ని చూపించే వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలు తెలుగు భాషలో నడుస్తూ, వాటి విధానాలు తెలుగు భాషకు అనుగుణంగా ఉన్నప్పుడే మన లక్ష్యం నెరవేరినట్టు.
ఠి చట్టసభల్లో చర్చలూ, చట్టాల రూపకల్పనా తెలుగులో జరగాలి.
ఠి ప్రభుత్వ ఉత్తర్వులు, నీయమ నిబంధనలు, విధాన ప్రకటనలు, సంక్షేమ పథకాలు, తాఖీదులు, రశీదులు, ఇతరత్రా సమాచారం అంతా ప్రధానంగా తెలుగులోనే ఉందాలి.
న! పరిపాలన, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, పద్దులు, రికార్డులు అన్నీ తెలుగులోనే జరగాలి.
ఠి న్యాయస్థానాల్లో వాదప్రతివాదనలు తెలుగులో జరగాలి. తీర్చులను తెలుగులో వెలువరించాలి.
ఠి ప్రభుత్వం, దాని విభాగాలు ప్రజలకు అందించే సమాచారం, ప్రజాసంబంధాల నీమిత్తం నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలు (రేడియో టీవీ ప్రోగ్రాములు, వార్తా లేఖలు, సామాజిక మాధ్యమాలలో ప్రచారం మొదలైనవి) అన్నీ తెలుగులో ఉందాలి.
ముద్రణ, ప్రసార వలగూడు(వెబ్) మాధ్యమాలు
ప్రజల మధ్య, సమాజంలోని తతిమా వ్యవస్థల మద్య అంతరాల్ని పూడ్చి సంఖాషణా వారభులుగా వ్యవహరించేవే మాధ్యమాలు. వీటికి ఉన్న (ప్రాధాన్యత లేదా అవి పోషించే పాత్ర మూలంగా వీటిని “ఫోర్త్ ఎస్టేటొగా వ్యవహరించారు. తెలుగు భాషకు ఆధునిక _ స్థాయిని సాధించడంలో కూడా వీటిదే కీలక పాత్ర.
ఠి వినోదం: సినీమాలు, టీవీ కార్యక్రమాలు, నాటకాలు, స్వతంత్ర మాధ్యమాలలో తక్కువ నిడివి సినిమాలు, కథలు, కవితలు, కార్టూనులు వంటివి అన్నీ తెలుగులో ఉండాలి. ఇప్పుటికే ఇవన్నీ తెలుగు లోనే ఉన్నా వీటి సృష్టి ఇతర భాషలతో సోలిస్తే తెలుగులో చాలా తక్కువ. తెలుగు వారి “తలసరి సాంస్కృతిక దిగుబడి” చాలా పెరగాల్సి ఉంది.
9 విజ్ఞానం: విద్యారంగంలో చూస్తే అన్ని స్థాయిల్లోనూ చదువులు (వృత్తి విద్యలు, దూర విద్యలతో సహా) పూర్తిగా తెలుగులో చదువుకునే అవకాశం ఉందాలి. పరిశోధనలు, పత్ర సమర్పణలు, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో పురోగతీ, దానిపై చర్చలూ, సదస్సులూ కూడా తెలుగులో జరగాలి. విద్యేతర రంగాల్లో వివిధ నైపుణ్యాలపై శిక్షణలు, సరికొత్త సాంకేతికతలపై సదస్సులు, చర్చలూ, అనేక అంశాలపై 'సెమినార్లూ మొదలైనవి తెలుగులో జరగాలి.
86 సమాచారం: స్థానీక, ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వార్తలూ విశేషాలూ అన్నీ తెలుగులోనూ అఖించాలి. కేవలం దినవత్రికలు, వలగూటి వథత్రికలే కాకుందా, స్వతంత్ర మాధ్యమాలుగా బ్లాగులు, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెళ్లు, పోడ్‌కాస్టులు తెలుగులో విరాజిల్లాలి.
ఇ నికాసం: ఆధ్యాత్మికత, తత్వభింతన, నైతిక ధర్మ చింతనలు,