పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్‌0గ్ర లోయోల ఇ0జినీరి౦0గ్‌ నురియు సా౦కేతిక గా

నురియు తెలుగు భాషోద్యమ సమాఖ్య (సంయుక్త ఆధ్యగ్య౦లో జరువుకొనుచున్న

వల్ల గాడని - అపు ఖం ఏందీ!

తేది: 21-02-2021, సాయంత్రం 5.30 ని॥లకు వేదిక్‌ : న్యూ హస్టల్‌, ఆంధ్ర లొయోల రళాశాల

అంధ్ర లొయోల ర్‌ ననన్‌ మరియు సాంకేతిక విద్యాసంస్థ, తెలుగు భాషోద్యమ కా ఆధ్వర్యంలో కళాశాలలోని న్యూహాస్టల్‌ ప్రాంగణంలో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్మరించుకొని '*ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. స్వాగతోపన్యాసం రె.ఫా. చిరంజీవి ఇవ్వగా రె.ఫా. రాయప్ప “మా తెలుగు తల్లి గీతాన్సి ఆలపించగా, తెలుగుశాఖ విభాగాధిపతి డా.కోలా శేఖర్‌ సభ ఉద్దేశాన్ని వివరించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన భారతీయభాషా సంఘం జాతీయ అధ్యక్షులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మాతృభాషా పరిరక్షణ అంశం జన్యుపరమైన, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక పరమైన అంశమని,తల్లి గర్భం నుండే జన్యుసంబంధంగా మాతృభాషా సంబంధం ఉంటుందని, భౌతిక శరీరనిర్మాణం లాగానే, మనిషికి తన మాతృభాషకు సాంకేతికమైన సంబంధం ఉంటుందని అయన చెప్పారు. మందుల సీసాలపైనా, బీల్లులపైనా వాటి పేర్లు ప్రాంతీయ భాషలో ఉంటేనే వాటిపట్ల ప్రజలకు అవగాహన ఉంటుందని గుర్తుచేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య వయ అధ్యక్షులు, అమ్మనుడి పత్రిక సంపాదకులు డా.సామల రమేష్‌బాబు ప్రసంగించారు. సభాధ్యక్షులైన ఆంధ్ర లొయోల కళాశాల 'ప్రాచార్యులైన రె.ఫా.జి.ఎ.పి. కిషోర్‌ మాట్లాదుతూ ఆనాటి తూర్పు పాకిస్తాన్‌లో జరిగిన భాషోద్యమాలను గురించి వివరించారు. కళాశాల కరస్పాండెంట్‌ ర.ఫా. సగసయరాజు మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల మధ్యనున్న సోదర భావాన్ని గుర్తుచేశారు. ఆంధ్ర లొయోల ఇంజనీరింగ్‌ మరియు సాంకతిక విద్యాసంస్థ ప్రాచార్యులైన ఓబిరెడ్డి మాష రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ఇంజనీరింగ్‌ చదువు తెలుగు మాధ్యమంలో వస్తుందని సూచించారు. ముఖ్య వక్తలుగా విచ్చేసిన భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఆచార్య తుమ్మల (శ్రీకుమార్‌ చరిత్ర విభాగాధిపతి ఆచార్య మొవ్వ శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు తగు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు విభాగ అధ్యాపకులు ష్‌ గోపాలరెడ్డి, నేతాజీ యువ కేంద్రం వ్యవన్థాపకులు లలితకుమారి గారు, కళాశాల యాజమాన్యం, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని సభను విజయవంతం చేసారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించింది. ఉత్సాహంగా స్పందించారు.