పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళా

డా॥ మధురాంతకం నరేంద్ర 98662 438659

రవీంద్రనాధ టాగూరు 'ముక్తధారి

సమకాలీన సాంఘిక రాజకీయ సాంస్కృతిక కల్లోలాల్ని గమనీంచినప్పుడల్లా వెంటనే గుర్తుకువచ్చే రచన రవీంద్రనాథ్‌టాగూర్‌ నాటకం ముక్తధార. ఇటీవలి కోవిడ్‌ విపత్మర పరిస్థితి మళ్ళీ మళ్ళీ “'ముక్తధారాను జ్ఞాపళం చేస్తోది.

1922 రవీంద్రుడు రాసిన నాటకం ముక్తధార. అప్పటికి భారతదేశ స్వాతంత్రోద్యమం పుంజుకోలేదు. అప్పటి విదేశీయ పాలన నేపథ్యంలో వుత్తరకోట, శివతరాయి అనే రెండు రాజ్యాల మధ్య రగిలిన సంభథుర్నణను రవీంద్రుడు గొప్ప అన్వార్థ రచన (4||9800౧గా తీర్చిదిద్దాడు.

వుత్తరకోట పర్వతాల్లోంచి పుట్టిన ముక్తధార నది శివతరాయి పంటలకు జీవదాయినిగా వుంటోంది. అయితే వుత్తరకోట రాజు రంజిత్‌ శివతరాయినెప్పుడో తన పాలనలోకి తెచ్చేశాడు. శివతరాయినుంచీ విదేశాలకు వ్యాపారం చేయడానికి వెళ్ళే నందికొండ మార్దాన్నీ మూసేసి, శివతరాయి ప్రజలు తాము పండించిన పంటల్ని ముడి పదార్ధాల్ని కేవలం వుత్తరకోటకు అమ్ముకునే పరిన్ఫితి తెచ్చాడు. తక్కువ భధరలకవి కొనుక్కొని, వాటినుంచీ తయారు చేసిన వస్తువులను వాళ్ళకే అధిక ధరలకు అమ్మి, వాళ్ళను తన చెప్పుచేతల్లో వుంచుకున్నాడు. అంతటితో సంతృప్తిపదడక ముక్తధార నదికి ఆనకట్ట కట్టి నదినీళ్ళను తన అదుపులో వుంచుకోవడం ద్వారా శివతరాయినీ మరింతగా అణగతాక్కాలని నిర్ణయించుకున్నాడు.

అయితే ముక్తధారకు ఆనకట్ట కట్టడం అంత సులభమైన పనేమిగాదు. యెందరో ప్రయత్నించారు. ఆనకట్ట సగంలోనే విరిగి నదివేగానికి తట్టుకోలేక, కొట్టుకుపోయింది. చివరకు విబూతి అనే రాజయంత్ర నిపుణుడు ముక్తధారకు ఆనకట్ట కట్టేశాడు. మొత్తం వుత్తరకోట రాజ్యమంతా, రాజుతో సహా విబూతిని ఖైరవస్వామి ఆలయంలో సన్మానం చేయడానికి పూనుకుంది. మొత్తం 'ముక్ష్తధార" అనే నాటకం విబూతికి సన్మానం జరుగుతున్న రోజులో జరుగుతుంది.

రవీం్యద్రుడి నాటకాల్లో రాజులు, నాయకులవంటి ముఖ్య పాత్రలకంటే బిచ్చగాళ్ళూ, యాత్రికులూ, పాటలు పాదేవాళ్లు, దీపాలు అమ్మేవాళ్ళు, 'పెరుగమ్మే పడతులు మొదలైన సామాన్వులే యెక్కువ సేపు కనబడతారు. వాళ్ళు వాళ్ళ నాయకులకంటే యెొక్కవగా వుద్రేక పదుతూవుంటారు. శివతరాయి ప్రజలను చూస్తే వుత్తరకోట (ప్రజలకు చులకన కంటగింపూ.

రంజిత్‌కు అభిజిత్‌ అనే పెంపుడు కొడుకున్నాడు. శివతరాయి ప్రజలంతా థనుంజయుడదనే బైరాగిని నాయకుడుగా గౌరవిస్తూ, వుత్తరకోటపైన తిరిగబడ్డానీకి ఆయన అనుమతి కోనం వేచి చూస్తున్నారు. ముక్తధార నదిలో ఆగకుందా పడిలేచే తరంగాల్లా ఆ రెండు దేశాల్లోని ప్రసిద్దులూ, అప్రసిద్దులూ, వరసగా యెొదురై ఖేటీ పడతారు. యొప్పుడో అనాదిలో మొదలై నీరంతరంగా సాగుతూ, భవిష్యత్తులోనూ ఆగకుండా సాగే యీ మానవతరంగాల సమూహాలు వొళదినంలో చేసిన భఖేటీలతో రవీంద్రుడు మొత్తం సమకాలీన

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |

'ప్రపంచానికంతా నీలువెత్తు ప్రతివీంబాన్ని నాటకంలో అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. చాలా ముక్తసరిగా చెప్పిన యీ కథనీంతవరకూ చదివిన వాళ్లకు శివతరాయి నాటి భారతదేశానికీ, వుత్తరకోట నాటి యింగ్లీషు ప్రభుత్వానికీ ప్రతీకలని స్పష్టంగానే అర్ధమయిపోతుంది. అయితే దాన్నీ రెండు సంస్కృతులకు జరిగిన సంఘర్షణగా మాత్రమే గాకుండా సార్వకాలికవ్టాన వూనవ జీవన గమునంగా రూపొందించడంలోని రవీం[ద్రుడి ప్రతిభ విస్మయుల్ని చేస్తుంది.

“ముక్తధార” నాటకం అఖిజిత్‌, ధనంజయుడు అనే రెండు యిరసుల పైన సాగే రథం. అఖిజిత్‌ రంజిత్‌ కన్నకొడుకు కాదు. దాదాపు రెండున్నర దశాబ్దాల [క్రితం రంజిత్‌ వాకనాడు వావ్యోళికోసం ముక్తధార నదీ తీరానికెళ్ళాడు. అప్పుడక్క్మడ నతీ తసిగాల దోలల్లో వూగుతున్నాదేమో కనీవించేలా తీరంలో వో పని బాలుడు కనీపించాడు. ఆ బాలుడు భవిష్యత్తులో రాజాధిరాజు అవుతాడనీ ఆస్థాన జ్యోతిష్యుడు చెప్తాడు. రాజు ఆ బాలుర్ని అఖిజిత్‌ అని పేరు పెట్టీ పెంచుకుంటాడు. యువకుదయ్యాక అతడ్ని శివతరాయి రాజ్యానీకి పంపి తన ప్రతినిధిగా పాలించమంటాడు.

అయితే శివతరాయికి వెల్లిన అభిజిత్‌ ఆ దేశవజలను పీడించదానికి బదులుగా డ్రేమించదం మొదలు పెడతాడు. కరువు వచ్చిందని పన్నుల్ని వసూలు చేయడు. పైగా ముక్తధార నదిపైన ఆనకట్ట పూర్తవగానే తానో చెరసాలలో పడ్డట్టుగా విలవిల్లాడిపోతాడు. అతనిలోని ౦వా ఆందోళనను గమనించిన అతని ఆత్మీయ స్నేహితుడు, సంజయుడనే మరో యువరాజు, అతడ్ని వీలయినంతగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన జీవితపు ఆలంబన యేమిటో క్రమంగా యిప్పుడే తెలిసివచ్చిందని - అభిజిత్‌ మిత్రుడికి చెప్తాడు. అతడికి పుట్టుకతోనే ముక్తధార నదితో మానసిక బంధం పడిపోయివుంది. ఆ నదినీ బంధించినప్పుడు అతడి మనన్నూ పంజరంలో కట్టుబడిపోయినట్టయి పోయింది. అతనికి మన్లీ 'స్వేచ్చకావాలంటే ఆ పంజరాన్నీ పగలగొట్టక తప్పుదు. అది అతడి మానసిక అవసరం. తప్పదు.

మనిషి ప్రకృతిలో వేరుగా వుండడానికి వీల్లేని భాగం. ప్రకృతిలోని వాటినీ వాడుకునీ మాత్రమే మనీషి జీవిస్తున్నాడన్నదే అందుకు నిదర్శనం. మనీషి మనస్సుకూ, వళృతికీ అవినాభావష్టాన నంబంధవుంది. మనిషీ, వ్రకృతీ నుఖదు:ఖాల్ని పరస్పరం పంచుకోక తప్పదు. ప్రతి మనిషి మనసూ ప్రకృతిలో యేదోవాక దానీతో విదదీయరానంతగా ముడివడి వుంటుంది. అది గుర్తించగలిగిన వాళ్లకు స్వాంతనముంటుంది. ఆయా ప్రాకృతిక భాగానికి దెబ్బతగలడం వల్లనే తమలో అశాంతి పెరుగుతుందని గుర్తించిన వాళ్ళు ప్రకృతిలో సమన్వయంకోసం తమ వంతుపని తాము చేస్తారు. అలా గుర్తించుకున్నవాళ్ళ శాతం బాగా తగ్గిపోయినప్పుడు విపత్తులు తప్పవు.

తన జీవనానందం ముక్తథార నదితో ముడిబడివుందని గుర్తించిన అపురూపమైన మానవుడు అఖిజిత్‌. ఆ నది పాదాల్ని