పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనం సాధించుకోవచ్చు. అంతేగాని, ఇంగ్షీష్‌ అంతర్జాతీయ భాష అనే మోసపూరిత కుట్రకు బలికావడం వల్లనో, జాతీయ భాష అనే తప్పుడు అవగాహనతో హిందీ జాతీయవాదుల ఎత్తుగడలకు తలవంచడం వల్లనో భాషాపరమైన సమస్యలను వ్‌ స్థాయిలోనూ పరిష్కరించుకోవడం జరగడు. దీనిని అతివాదంగానో, మరోకటిగానో తోసి వేయవచ్చుగాని, నిజంగా జరుగవలసిందీ, జరుబోయేదీ ఇదే. సమాజాల సంఘటనకు, అభివృద్ధికీ ఇదే దారి.

భాషా సమస్యలతో మొదలుపెట్టి ఎక్కడెక్కడో సుదూర సమస్యల గురించి మాట్లాడుతున్నామని అనుకోనక్కరలేదు. సుదూరంగా, లోతుగా ఆలోచించినప్పుడిదే సరైన ఆలోచన. మానవుడికి అన్ని విధాలా పరిపుర్ణ న్యాయం జరగాలంటే అతని భాషను గుర్తించాలి. ఆ భాషా సమూహాల / జాతుల వికాసాన్ని మనం కోరుతుంటే సమస్యల పరిష్మారానికి ఇదే 6. ఇందుకోసం ఆయా భాషలవారికి వారి భాషల్లోనే చదువులు చెప్పాలి. తమ సొంత భాషలోనే సర్వవిజ్ఞానాన్ని పొందడానికి అతనికి అవకాశముండాలి. తమ భాషను ఆథునిక జ్ఞాన సాధనకు, జీవనావసరాలకు వినియోగించుకోగల కాశం ఉంటే క్రమంగా అవసరమైన ఇతర భాషలను నేర్చుకోవడమూ, వాటిద్వారా పొందగల జ్ఞానాన్ని పాందడమూ నికి. ఓక సమస్వేకాడు. ఇందుకు వీరుద్ధంగా ఇంగ్లీషుతోనే న్స్‌ ఆభివృద్ధి అని చెప్పడం, నీ భాషచాలా చిన్నదనో, సమర్థవంతమైనది కాదనో చెప్పడం పెద్ద అబద్ధం, అశాప్రీయం, దగా, కుట్ర! భాషాజాతులనూ ఆవిధంగా సమస్త నవాళినీ మోసగించడం!

మరి- ఇప్పుడు చెప్పండి. భారతదేశానికి ఒకే ఒక జాతీయభాష ఉండాలా? ఇంగ్రీషును చదవకపోతే అభివృద్ధి

ఉండదా? ఆ భాషే గొప్పదా? మీ భాష, నా భాష మనం ఎదగడానికి పనికిరావా? మనదేశ స్వాతంత్ర్యం అన్ని భాషాసమూహాల అభివృద్ధికోసం కాదా? ఇలా ఆలోచించాలనీ ఇలా మనల్ని మనమే ప్రశ్చించుకోవాలనీ ప్రజల బుర్రల్లోకెక్కిస్తే తప్ప మన సమాజాలు కళ్లు తెరువవు.

ఇదే సమయంలో - మన ప్రభుత్వాల్ని వాటి నేతలనూ ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా దోబూచులాడుతూ అవకాశవాదంతో విర్రవీగుతున్న మన రాజకీయపార్టీలనూ నిలదియ్యాలి. ఈ దిశగా భాషోద్యమాలు సాగాలి.

భాషోద్యమాలంటే సాహిత్యోద్యమాలనేది తప్పుడు అవగాహన. తెలుగుతల్లిని కీర్తిస్తూ పాడుకుంటే, ఉపన్యాసాలు దంచితే తాము భాషాసేవకులమని గుర్తించబడతామనుకోవడం ఊహాలోకంలో తేలిపోవడం మాత్రమే. భాషోదధ్యమాల పేరుతో పండిత సత్మారాలతో కాలక్షేపం చేస్తే అది అమాయకత్వమో, గడుసుతనమో అవుతుంది!

మాతృభాష అనే మాట ఎక్కువగా వినబడుతోంది. ఆ మాటనే “అమ్మనుడి అని కూడా అంటాం. అమ్మ లేకుండా మన పుట్టుక ఉండనట్లే, భాషలేకుండా మన మనుగడా ఉండదు, మనుషులుగా మన భవితా ఉండదు.

ఇప్పుడు తెలుగుభాషోద్యమ సమాఖ్య ఏర్పడి ఫిబ్రవరి 21 నాటికి 19 ఏళ్లు పూర్తిచేసుకొని, 20వ పడిలోకి అడుగు పెట్టబోతున్నది. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఇంతకాలంగా చేసిన కృషి చరిత్రాత్మకమైనడే. అయితే జరిగింది కొంతే. జరుగవలసింది ఎంతైనా ఉంది. ఇప్పుడు తెలుగుజాతి జనులు ఆలోచిస్తున్నారు. యువతరం నిద్రపోతున్నదని అనుకోకూడడు. వారిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగడమే మన కర్తవ్యం.

మాతృభాషల్ని రక్షించుకోవాలనే తపన ప్రపంచంలోని అన్ని భాషాజాతుల్లో క్రమక్రమంగా వికసిస్తున్నది. ఇందులో మన దేశం, మన తెలుగుభాషాజాతి వెనుకపడాట్సిన అగత్యం ఏమీలేదు. ఎవరి అమ్మనుడితో వారు ఎదగడానికి అన్ని అవకాశాలను సమకూర్చడమే ప్రభుత్వాల, వ్యవస్థల బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించినవారిని పాలనావ్యవస్థలో కొనసాగనీయరాదు. అటువంటి వారిని పాలనావ్యవస్థల్లోకి పంపకూడదడు. ఈ దిశగా ౦౦డు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృత (ప్రచారం జరగాలి. పరిపాలన, బోధన తెలుగులోకి తేవడమనే తక్షణ లక్ష్యంతో పనిచెయ్యడమే భాషోద్యమకారుల కార్యక్రమం కావాలి.

అమ్మనుడితోనే చైతన్యం, అమ్మనుడితోనే అభివృద్ది, అమ్మనుడితోనే అందలం. విద్యారంగంలో తొలి చదువుల నుంచి మలి చదువుల వరకు అమ్మనుడిడే ఆగ్రపీఠం అయితేనే ఇది సాధ్యం అవుతుంది.

అంతేకారు, పరిపాలన ప్రజల భాషలో జరిపితేనే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అలా కానప్పుడు అది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అవుతుంది.

ద్గ్షి

ట్ర

యై ర్‌ ర

ర్ధ్‌

మ స్మ.

ప చనాతక హృదయం

గో

నా

స క్ష నష;

తేదీ : 30-12-2021 షాళుల ₹మేమోలు

| తెలుగుజాతి పత్రిక జువ్సునుడి. ఈ ఖనవరి-2022 ర,