పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"అమ్మనుడి-* 'అర్షికాభివృద్సి క్‌ యత

గారపాటి ఉమామహేశ్వరరావు 98661 28846

సంపద సృష్టిలో జనభాషలు 'రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాతృభాషను విద్యామాధ్యమం నుంచి తొలగించి ఆ స్థానంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రక తప్పిదం.

ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన-= అక్షరాస్యతకు అడ్జ్డుగోడ

1986 నుంచే ఇంగ్లీషు మాధ్యమం మొదలై అంచెలంచెలుగా తెలుగు మాధ్యమాన్ని కబళిస్తూ ఈ రోజుకు ఇలా పూర్తిగా మింగివేసే స్థాయికి చేరింది. తెలుగువారికి అందరికీ ఇది అంతులేని అవమానాన్నీ ఆక్రోశాన్నీ ఆవేదననూ మిగిల్చింది. అయితే అందరికీ అర్థం అవ్వాల్సింది ఒకటి ఉంది. దీనికి కావాల్సింది ప్రజా ఉద్యమం. దీనిగురించి మనందరికీ కనీస అవగాహన ఉందాలి. అందరికీ ఆ అవగాహన కలిగించాలి. ఏమిటి ఈ అవగాహన.

ఇంగ్లీషు మాధ్యమంతో మన ఉద్యోగ ఉపాధి సమస్య తీరదు. మాతృభాషా మాధ్యమం లక్షలాది మందికి ఉపాధి కలిగిన్తుంది. ఆర్ధికంగా అభివృద్ది చెందిన దేశాల్లో మాతృ భాషా మాధ్యమమే నడుస్తోంది. ఆంగ్ల భాషా మాధ్యమంతో మనం మళ్ళీ బహుళజాతి సంస్థల అధికారం కిందికి తలవంచుకాని ఉండిపోయే పరిస్థితి కల్పిస్తుంది.

మన కనీస కార్యాచరణ

1. మనకు ఈ సమస్యపై కనీసం అవగాహన ఉందాలి.

2. ఉపాధ్యాయులకూ, విద్యార్థులకూ మాతృ ఖాష్లా మాధ్యమంపై అవగాహన కలిగించాలి.

3. ఉద్యోగస్తులకూ, తల్లిదండ్రులకూ తెలుగు మాధ్యమంలో చదువులు ఉండవలసిన అవసరాన్ని వివరించాలి.

4 ఇంగ్లీషు మాధ్యమంతో మన సమాజం నాశనం అవుతుంది అని తెలియజెప్పాలి.

ఎందుకంటే కోట్లాది మందిగా ఉన్న భారతీయులకు ఇంగ్లీష్‌ ద్వారా వచ్చే వేలాది ఉద్యోగాలు ఏ మూలకూ సరిఫోవు. ఇప్పటికీ లక్షలాదిమంది జనం భారతీయ. భాషల ద్వారానే ఉపాది పొందుతున్నారు. 2011-12 ఆర్థిక గణాంకాల ప్రకారం తెలుగు ర్యామ్టాల స్ఫ్ఫూల జాతీయోత్పత్తి 464,184 కోట్ల రూపాయలు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ర్రాలలో ఉన్న మొత్తం శ్రామిక శక్తి 1,07,77,950 మంది. వీరిలో అన్నిరకాల ఉద్యోగులూ, వ్యాపారులూ, రైతులూ, కూలీలూ ఉన్నారు. వీరందరూ 464 184 కోట్ల రూపాయల సంపదను సృష్టించారు. ఇంత సంపద నృత్చించినవారిలో 32.50% మంది నీరక్షరాన్యులే. ఇక మిగిలినవారిలో 52. 02% మంది అక్షరాస్యులేగానీ ఇంటర్మీడియట్‌ దాటనీవారు. ఇకపోతే, చివరకు మిగిలిన 15.48 శాతంమంది మాత్రమే (గ్రాడ్యుయేట్లు. మన (గ్రాద్యుయేట్లందరికీ ఇంగ్లీష్‌ వచ్చనుకుంటే, _ కొద్దోగొప్పో తాము చేసే పనిలో ఇంగ్లీషును. వాడి సంపద సృష్టించగలిగినవాళ్ళు 15 శాతం మాత్రమే. అంటే తెలుగు రాష్ట్రాలలో సంపదను సృష్టించేవారిలో 85% మంది. తెలుగూ తదితర మాతృభాషల వాడకం ద్వారా జరుపుతున్నవారే. ఇంగ్లీషును ఒక భాషగా నేర్చుకోవడం వేరు దానిని విద్యామాధ్యమంగా

| తెలుగుజాతి పత్రిక జువ్నునుడి ఆ జనవరి-2022 |

అమలుపరచటంవేరు.

ఇంగ్లీషు మాధ్యమంతో దేశీయ స్థానిక భాషల ఆధారంగా నడిచే వందలాది పరితమలూ మూలబడతాయి. దాంతో లక్షలాది ఉద్యోగాలు పోయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోతారు. ఒకటి రెందు తరాలలో తెలుగు రాయగలిగినవాళ్ళూ చదవగలిగినవాళ్ళూ మిగలరు. తెలుగు సినిమాలూ తెలుగు టీవీ చానెళ్ళూ ఉండవు. దేశంలోనే అత్వధిక సినిమాహాళ్లున్న రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు ప్రసిద్ది. పదిలక్షలకు పైగా జనానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సినీ పర్మికమ దానీ అనుబంధ పరిశమలూ మూలబదతాయి. తెలుగు రచనలూ ఉందవు రచయితలూ ఉందరు. లక్షల్లో ఉన్న తెలుగు రచయితలూ, ([గ్రంథకర్తలూ, పాత్రికేయులూ, కథకులూ, గేయరచయితలూ, గాయకులూ వీరిపై ఆధారపడ్డ తెలుగు పత్రికలూ తెలుగు ప్రచురణలూ ఇంకెక్కడ ఉంటాయి. లక్షలమందికి జీవనాధారమైన తెలుగు ముద్రణా వర్మిశమ కుదేలవుతుంది. లక్షల్లో ఉన్న తెలుగు భాషాబోధకులూ ఉపాధ్యాయులూ ఇంగ్లీషు బోధకులుగా అవతరిస్తారా. అప్పుడు వేల యేండ్ల అస్థిత్వం గలిగిన తెలుగు ఎక్కడ ఉంటుందో తెలుగు చదవగలిగినవాళ్ళు ఎక్కడ ఉంటారో వెతుక్కోవాలి. ఈ పరిస్థితుల్లో మనం వేల యేండ్లుగా సృష్టించిన సాహిత్యం ఏమవుతుంది? ఎవరు చదువుతారు?

ఈ నేలమీద పుట్టిన ఏ మాత్రం తెలివిగలవాక్షైనా ఈ నేల తల్లి భాషలో చదువుకోవాలనే అనుకుంటారు. దాన్నే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్మర్‌ చెప్పారు. అందుకనే భారత రాజ్యాంగంలో భారతీయ భాషలకు ఒక అధికరణాన్నే ప్రత్వేకించారు. ఐనా అది కాదనీ పరాయి భాషను ప్రజలమీద రుద్దటం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే. రాజ్యాంగ నీర్మాతలనూ వారు నిర్మించిన (ప్రజాస్వామ్య వ్యవస్థలనూ పరిహసించటమే. ఈ నేలతల్లినీ కన్నతల్లినీ అవమానించడమే.

ఇంగ్లీషు మనకు ఒక సమస్య కావచ్చు. కానీ మాధ్యమం సమస్య కారాదు. ఇంగ్రీషు ఒక విషయంగా నేర్చుకోవద్దని ఎవరూ చెప్పటం లేదు. ఇంగ్లీషు కౌశలం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలి. అదికూడా జరగక, ఇక మాధ్యమమే ఇంగ్లీషు అయితే ఏమవుతుందో ఆలోచించగలమా.

పోతే మనకు చదువుకోవటానికి ఈ నేలతల్లి భాష ఎందుకు పనికిరాదు అనే అడుగుతున్నాం. అర్ధం కాని ఇంగ్లీషులో చెబుతున్న ఉపాధ్యాయులూ ఇంగ్లీషు అర్ధం కాకుంచా వింటున్న విద్యార్థులూ ఇలా ఎంతకాలం. ఇంకా ఎన్నీ వందలూ వేల ఆత్మహత్యలు జరగాలి. మన పరిశోధనలు మన జన భాషలలో ఉందడొదడ్దా?

పన్నెండు కోట్లమంది ఉన్న తెలుగువాళ్ళు వాళ్ళ భాషలో చదువుకొనకూడదా? ఇంగ్లీషులోనే చదివితే ఉద్యోగాలు వస్తాయనే ఈ తప్పుడు ఆలోచన మనలో ఎలా కలిగిందో కలిగింది. దీన్ని వ్‌