పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపుటి : 7 సంచిక: 8 అత్మునుడె

జనవరి 2022

అమ్మనుడులతోనె మానవ వికాసం

కనీసం ప్రాథమిక విద్య వరకు మాతృభాషామాధ్యమంలో బోధన ఉండేట్లు చట్టం జెమ్మంటూ 2003లోనే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఒక ప్రయివేట్‌ బిల్లును నాటి శాసనసభ ప్రతిపక్ష సభ్యులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య స్థాపకుల్లో ఒకరైన మండలి బుద్ధప్రసాద్‌ ప్రవేశపెట్టారు. 2 రోజుల చర్చ తర్వాత, ఆది తమవల్ల కాని పని అని నాటి విద్యాశాఖా మంత్రి తేల్చిచెప్పారు. బిల్లును ఉపసంహరించుకొంటే, తెలుగును ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా(ఒక సబ్జెక్టుగా) ప్రభుత్వ ఉత్తర్వులిస్తామని, లేకుంటే ఓటింగుకు పెట్టి ఓడిపోవడానికి సిద్ధం కావచ్చునని సూచించారు కూడా. దానితో ఇస్తామన్నదానికి ఒప్పుకొని, బిల్లును వెనక్కు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత, నాలుగైదేళ్లకు ఈ అంశంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేసింది తెలుగు భాషోద్యమ సమాఖ్య. ఇది విధానపరమైన నిర్ణయం “ గనుక తాము జోక్యంచేసుకోజాలమని చెబుతూ వ్యాజ్యాన్ని న్యాయస్థానం అనుమతించలేదు. ఈ విషయంపై నడుస్తున్న చరిత్ర / అమ్మనుడి పత్రికలో ఎన్నోసార్లు మనం చర్చించుకొన్నాం. ఆ తర్వాత ఇది మెల్లమెల్లగా దేశంలో వివిధ రాష్టశ్రాసన సభల్లో, మాతృభాషలో ప్రాథమిక విద్య అనే అంశం న్యాయస్థానాల్లో నానుతూనే ఉంది. రాజ్యాంగంలో ఉన్న అస్పష్టత వల్లా ప్రాథమిక హక్కుల అంశాలు ఇమిడినున్నందు వల్లా ఇదంతా ఒక అపరిష్కృత సమస్యగా మిగిలిపోయింది. రా్షాలకూ కేంద్రానికీ మధ్య పాలనాంశాల విభజనలో విద్య ఉమ్మడి అంశంగా ఉండటం వల్లా, భాషారాష్ట్రాల ఏర్పాటుతోపాటు, స్పష్టమైన భాషావిధానాన్ని కేంద్రం రూపొంధించుకోవడంలో విఫలమైనందువల్లా ఈ పరిస్థితి ఏర్చడింది. రాజ్యాంగం ఏర్చడకముందు రాజ్యాంగ నిర్ణయ సభలో విస్త ఫతంగా చర్చించిన అంశం భాషా సమస్య. ఐనా ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని చేపట్టడంలో విఫలం అయ్యారు. కొత్తగా స్వతంత్ర రాజ్యం ఏర్పడిన పరిస్థితుల్లో భాషాసమస్య దేశంలో అనైక్యతను తెచ్చి విభజనకు దారి తీస్తుందేమోనన్న శంకతో, అండుకు అవకాశమివ్వకూడదన్న జాగ్రతలో సమస్యను 15 ఏళ్ల తర్వాత చూద్దామన్నట్లు తీర్మానించారు. ఈ లోపుగా పరిపాలనతో విద్యలో, కోర్టుల్లో ఆంగ్లం బాగా కుదురుకొంది. హింది అధిపత్యవాదుల నేతృత్వంలోని పాలక, ప్రతిపక్ష పార్టీల విధానాలు ఇందుకు దోహదపడ్డాయి. 75 ఏళ్ల తర్వాత ఇప్పటికీ ఈ సమస్య వల్ల దేశంలో 80 శాతం మంది ప్రజలు భాషాపరమైన దోపిడీకి గురి అవుతూనే ఉన్నారు. సరళంగా చెప్పాలంటే తమ భాషాహక్షును పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. భారతదేశం అనేక భాషల కలపోతగా ఉన్న ఒక భౌగోళిక సమూహం. భాషాజాతులనే మాటను వాడితే కొందరు జాతీయతా తీవ్రవాద వర్గాలకు బాధ కలుగుతుంది. నిజానికి, మాట్లాడే భాషవల్లనే ప్రజాసమూహాల గుర్తింపు జరుగుతుంది. లాకాకపోజే మానవులంతా ఒకే జాతి. దాన్ని విభజించి చూడాలంటే ఆడవారనీ మగవారనీ అనుకోవచ్చు. అనేక దల టప్రాణిసమూహాల నుండి మనుషుల్ని విడమరిచిచూడాలంటే భాషను బట్ట జాతులుగా గుర్తించడమే సరైన తి. అంతేగాని రంగునుబట్టో, తిండినిబట్టో వారిని విభిన్నజాతులుగా చూడలేము. హిందీవారు, తమిళులూజాతి” మాటను కులం అనే అర్ధంలో వాడతారట. అది వేరేసంగతి. ఇప్పుడు సాంకేతికంగా కూడా భాషల ప్రయోజనం విస్తరించింది. అన్ని మానవసమూహాలు సాంకేతికతను వినియోగించుకొని తమ భాషల వినియోగంతోనే అంతర్జాతీయ సంబంధాలను పొందగలిగేవిధంగా సాంకేతికత అందుబాటులోకి వస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో - భాషాపరంగా రాజకీయ ఘర్షణలకు అవకాశమే లేదు, కావాలని ఇలికితే తప్ప! కాని, ఎంత అధిక సంఖ్యాక భాషీయులైనా ఆధిపత్య ధోరణులను అవలంబిస్తే మాత్రం అనేక విధాలుగా సమాజంలో ఆసంతృప్పి ఏర్పడి అనైక్యతకు బీజాలుపడే అవకాశం ఉంది. కనుక అన్ని రాజ్యాంగ వ్యవస్థల్తో, కనీసం గ గ రాజ్యాంగ గుర్తింపు పొందిన భాషలవారికైనా, తమ భాషలో తమ భావాలను వెల్లడించడానికీ తమ _ పనులను ౧... నెరవేర్చుకోవడానికీ అవకాశాలుండాలి. కేంద్ర చట్టసభల్లో, న్యాయస్థానాల్లో, పాలనా వ్యవహారాల్లో తమ భాషలతో గ తాము పూర్తిగా వ్యవహరించగలిగాలి. ఆధునిక సాంకేతికతను (శద్ధగా ఉపయోగించుకొంటే అతి త్వరగానే యీ పరిస్థితిని


[షన క్ష;

ప చనాతక హృదయం

గ్ర

అ వ పడ

ప యను

[స్ట నష్టమో నష నష నవన్‌

| తెలుగజాత్‌ పత్రిక అువ్నునుడి ఆ జనవం-2022 |