పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రచనా రంగం.

బి. లలితానంద ప్రసాద్‌ 92474 99715

రచనా, రచయితా- ఏది ముఖ్యం?

ప్రక్రియ ఏదైనా రచన అంటే చెప్పడం. ఏమి ఇవ్వాలన్నా ఇచ్చే వారి దగ్గర అది ఉండాలి. అలాగే చెప్పటానికి ఏమైనా ఉండాలి. ఉందాల్సినది ఏదీ దానంతట అదే ఎవరిలోనూ జొరబడదు. అందుకు అనేకం కావాలి. వాటితో సరిపోదు. ప్రతిదానికి విషయం, అఖివ్యక్తీ కీలకం. వాటి స్థాయి రచయిత శక్తిసామర్థాలతోపాటు అంశము లోతులు, విస్తృతి, ఖిన్న పార్య్వాలు స్పృశించటం అవసరం. ఇందుకు మిగతా అన్నీంటితోపాటు నీజాయితీ, అంశం తాలూకు మనిషిపట్ల నీమగ్నత, విశాలత్వం అవసరం. రచయితల స్థాయినిబట్టి రచనస్థాయి ఉంటుంది. ఏ స్థాయి రచనలకు ఆ స్థాయి పాఠకుల ఆదరణ లఖిస్తూనే ఉంటుంది. అయితే కొందరు ఏ రచనలోనైనా రచయిత తాలూకు దృక్పథం ప్రస్ఫుటం కావాలని ప్రబోధిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబు అనే విషయాన్ని పరిశీలిద్దాం. దీనితోపాటు అసలు మనిషి- సమాజం ఎట్లా ఉన్నాడు? ఉన్నది? ఎట్లా ఉండాలి? అంతరాలు ఏమిటి? ఎందుకు? వాటిని ఎట్లా పూడ్చాలి? తెలియని, తెలుపని సాహిత్యం, కళలు ఎవరికోసం? ఎందుకోసం? అనేది కూడా గమనంలో ఉంచుకోవాలి.

ప్రతి రచనా అక్షరాల్లో రచయిత అంతరంగ నిశ్శబ్ద ఘోషే వాటిలో తననీ తాను వివిధ రూపాలలో ఆవిష్కరించుకుంటాడు. అతనీ (ప్రవేయ, అ(ప్రవేయాలతో తీనుకున్న వన్తువులకు సంబంధించిన అధ్యయనం, అవగాహన, ఆలోచన, అనుభవాలు, అంచనాలు, అనుభూతులు అంతర్లీనంగా అంతటా ప్రవహిస్తుంటాయి. రచయితకు లేనీ వికాసం అతనీ రచనల్లో ఉండదు. అలాగే ఉన్నది లేకుండానూ పోదు. తీనుకున్న అంశానికి నంబంధించిన పూర్వావరాలు, అన్ని కోణాలు, శాస్త్రీయంగా, చారిత్రికంగా, వైజ్ఞానికంగా, సహేతుక పరిణామాల్ని పరిగణనలోకి తీసుకుని పరిణిత రీతిలో కళాత్మకంగా అఖభివ్యక్తిలో (వ్రదర్శిస్తాడు. ఎక్కడా వాస్తవాతీతంగా నేల విడిచి సాము చేయడు. ఇక్కడ తనకన్నా తన రచన ముఖ్యంగా భావిస్తాడు. తన రచనల్లో వాటికి సాపొతీ, కళారూపాలను ఇస్తాడు. దీనీలో ఎక్కడా రాజీపడడు. రాజీపదితే ఆ మేరకు ఆ సృజనకు హాని జరిగినట్లే. దానితోపాటు సహృదయ పాఠకునికి అతని ఆస్వాదన ప్రమాణాలకి ద్రోహం చేసినట్లే. కాబట్టి ఇక్కడ రచయితకు అతని ధోరణి, దృక్పథాల కన్నా రచనే ముఖ్యం. సమాజంతో చదువరితో అతని అనుసంధానం రచనతోనే కాబట్టి, మానవత్వాన్న కారుణ్యాన్ని మించిన ఏ సృజనాత్మక, విశ్లేషణాత్మక విలువలూ ఉండవు.

అయితే కొందరు విమర్శకులు సదుద్దేశ్యంతోనే కావచ్చు- రచనలో రచయిత దృక్పథం ముఖ్యం అంటారు. బహుశా మనిషి పట్ల వారి అపార నీరంతర తపన అలా అనిపిస్తూ ఉండవచ్చు. ఇది అసంబద్ధం. ఎంతటి మహోన్నత దృక్పథాలు ఉన్నా వీరి రచనలలో

సంవిధానంలో అంతర్లీనంగా అవి ప్రతిఫలించన్నప్పుడు అవన్నీ | తెలుగుజాతి పత్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

నిరర్ణకం. అసలు నిజమైన ఆసక్తి గల పాఠకులకు రచనకు మించినవి పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. పైగా వీటి పేరుతో ఏర్పడిన లేత ఏర్పరుచుకున్న చట్రాలతో, వాటి వరిధిలో, పరిమితులతో రచనా స్వేచ్చకు సంకెళ్లు పడతాయి. పంట చేనునీ కంచెలా ఆక్రమిస్తాయి. చెంగున గంతులు వేయవలసిన లేగదూడలకు గుదిబందలవుతాయి. స్వేచ్చగా విప్పారి ఎగరాల్సిన శెక్మల్ని కత్తిరించినట్లు అవుతుంది. రంగులు, గీతలు, గోడలు విశ్వ మానవుల శరీరాన్ని బీటలు గావిస్తాయి. ఎవరి చట్రంలో వారు 'గుడుగుడు గుంచం” చందం అవుతుంది. సంకెళ్ళతో స్పీయ జైల్లో మగ్గిపోతారు. జీవన పరిపూర్ణ పరిమళ ఆస్వాదనకి అవరోధంగా ప్రహరీ పంజర ప్రక్రియ ఏర్పరచుకుంటారు. ఇతరులకి ఏర్పరుస్తారు. మనిషి అయినా మానైనా కలుగుల్లో నుంచి వెలుగుల్లోకి వస్తేనే వికసించి, విస్తరించి, పరిమళించి, ఫలభరితం అయ్యేది. లేకుంటే (గహాంతరాలలోకి వెళ్లినా గుహాంతరంలోకి మరలినట్లే. తానో అగ్నిగుండమైై ఎగసి సూర్యగోళంగా నింగి నుండి నేలంతా కాంతిపుంజాలు విరజిమ్మాలి. అతదే అసలు సిసలు సృజనకారుడుగా మిగిలేది.

పాఠకులు ఎవరూ రచయితలకు తీసిపోరు. వారిని ఏమాత్రం తక్కువ చేయరాదు. ఆ మాటకొస్తే చాలామంది సీరియస్‌ చదువరులు అనేక మంది రచయితలకన్నా పరిపరి విధాల మెరుగ్గా ఉంటారు. నిజమైన మంచి రవయితలంచా మంచి చదువరులే. వారందరికీ తెలిసిందే అనాదిగా మానవాళితోపాటు సృజనకారులు కూడా భావ, ఇఖౌతికవాదులుగా విడిపోవటం. నిజానికి రెంటూ అవిభాజ్యం, అనంతంగా. భౌతికం లేనిదే భావానికి అస్తిత్వం ఉండదు. భావం లేకుందా ఏ సృృజనా ఉండదు. భూగోళాన్ని కలిపి ఉంచే (భ్రువాలలాగా, ప్రాణి, ప్రాణంలాంటిది ఒకదానికొకటి. ప్రకృతిలో ప్రతి ప్రాణి జీవన సమస్తం ద్వంద్వాల సమ్మిశ్రమం లాగానే ఇవి రెండూను. వీటిని విడదీసి ముక్కలుగా ప్రదర్శించటం అంటే అది ఏదోరకంగా పాక్షికతను, వివక్షతను, సంకుచితత్వాన్నీ ప్రోది చేసి ప్రచారం గావించడమే. రెండింటిలో ఏ ఒకటి లేకుండా మరొకటి లేనప్పుడు ఏదో ఒక దాన్నీ పట్టుకునీ పాకులాడటం నీలువ నీరు కావడమే. అది పాచిపోవడవే. గాక రకరకాల రుగ్మతలకు కారణమవుతోంది.

మనిషి దైనందిన జీవితంలో బాహ్య అంతరాలనీ అత్యధికంగా (ప్రభావితం చేసే అనేక అంశాలు ఉంటాయి. వివిధ రంగాల వ్యక్తుల గమ్యం గమనాన్ని అవి నిర్దేశిస్తాయి. వాటిలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతీక అంశాలు ముఖ్యమైనవి. వాటినీ గంపగుత్తగా విస్మరించి వాటన్నింటిని, ఏదో నెపంతో కార్పొరేట్‌ నంస్కృతి అన్నట్లుగా పేర్మాని దూరం పెట్టడం సృజనకారుడు వాస్తవాలను తృణీకరించడమే. వ్యవస్థల పట్ల వైముఖ్యంతో ఏరకపు సృజనకారుడు అవుతాడు? తాను వాటినీ వద్దనుకున్నా అవి ఏ ఒక్కరినీ వదలవు