పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కతకాక

డా మధురాంతకం నరేంద్ర 98662 48659

తొందడనాదు భారతం మిట్టలు

మహభారతాన్ని కేవలం సాహిత్య గ్రంథమని అంటే భక్తులు మండిపడతారు. కాడు, అది పుక్కిట పురాణం మాత్రమే అంటే సాహిత్యకారులు వొప్పుకోరు. మహాభారతపు వైశిష్టాన్ని వర్ణిస్తూ ఆ రచన మొదట్లోనే నన్నయ దాన్ని ధర్మశాస్త్రమనీ, వేదాంతమనీ, నీతిశాస్తమనీ, మహాకావ్యమనీ, సర్వలక్ష్యసం[గ్రహమనీ, యితిహాసమనీ, అన్ని పురాణాల సముచ్చయమనీ నొక్కి చెప్పేశాడు. అయితే మహాభారతమనేది తొండనాడు ప్రజలకు మాత్రం జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొంత భాగమూ, తమిళనాడులోని తిరువళ్ళూరు,కటారు,తిరవణ్డామ బై, విల్లుపురం, కదలూరు జిల్లాలో,కేంద్రపాలిత ప్రాంతమైన పాండుచ్చేరి కలిసిన ప్రతిగ్రామంలోనూ ధథర్మరాజుగుడి వుండి తీరుతుంది. అలాగే అనేక (గ్రామాల్లో 'భారతం మిట్ట) అనే ప్రాంతం వొకటి వుంటుంది. యిప్పటికీ తొండనాడుకు చెందిన చాలా గ్రామాల్లో ప్రతీ సంవత్సరమూ 'భారతయజ్ఞం” అనే 18 రోజుల వుత్సవం జరుగుతుంది.

సమశీతోష్ట ప్రాంతమైన తొండనాడులో వేసవి యెప్పుడూ కఠినంగానే వుంటుంది. 40 డిగ్రీలను దాటేసే వేసవిలో, నీటి యెద్దడి నుంచీ తప్పించుకోవాలంటే 'నలచరితినూ, “విరాట పర్వాన్నీ చదవడమో, హరికథగా వినడమో చేయాలని యీప్రాంతపు వాళ్ళు నమ్ముతారు. భఖారతయజ్ఞాన్ని నిర్వహించటమన్నది యీ నమ్మకానికున్న మరో పార్య్వంగా భావించాలి. 18 రోజుల పాటూ జరిగిన కురుక్షేత్ర యుద్దాన్ని గుర్తు చేస్తూ, 18 పర్వాలున్న మహాభారతానీకనుగుణంగా తాండనాడులో భారతయజ్జం 18 రోజులపాటు జరుగుతుంది.

వూరికి బయట. పెద్ద చింతచెట్టు మాత్రవే వుందే ఆరుబయలలో, చిన్నదో పెద్దదో అయిన ధర్మరాజు గుడిముందు కొబ్బరాకుల పందిళ్ళువేని యజ్ఞానికి సన్నద్ధమవతారు. పగలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకూ దాదాపు మూడు గంటలసేపు మహాభారతాన్ని హరికథగా పండితుదూ, గాయకుదూ అయిన వారిదాను గానం చేస్తాడు. వందిరి కటువైపునుండే మట్ళివేదికపైన, రాత్రి తొమ్మిది గంటల నుంచీ తెల్లవారుజాము వరకూ పగలు జరిగిన కథకు సమాంతరంగా భారతాన్ని జనపదుల నాటకంగా ప్రదర్శిస్తారు.

తొందనాడులో వాకప్పుడు గొప్ప హరికథకులు చాలా మంది వుందేవాళ్ళు. మైకులూ, విద్యుద్దీపాలూ లేని రోజుల్లో గూడా పగలు కథా రాత్రి ఆటా వైభవంగా జరిగేవి. మా చిన్నతనంలో దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం యీ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో పతీ సంవత్సరమూ భారతయజ్ఞం జరిగేది. భఖాతరయజ్ఞూాం జరగడానికి కొద్ది రోజుల ముందుగా పోతురాజు విగ్రహాన్ని సమీప (గ్రామాల్లోనంతా వూరేగింపుగా తీసుకెళ్తారు. వో జానపద గాధ ప్రకారం పోతురాజు పాండవుల బావమరిది. ఖారతయజ్ఞం కోసం భారతం మిట్టలో చలువపందిళ్ళు వేస్తారు. యిప్పుడు తొండనాడు నుంచీ మాత్రమే గాకుండా కోస్తా నెల్లూరు ప్రాంతాల నుంచీ పేరున్న హరికథకుల్ని తీసుకొస్తారు. పట్టుపంచను కట్టుకుని, నడుముకు రంగుల అంగవసస్త్రాన్ని చుట్టుకుని, మెడలో పూల మాలవేసుకుని, చేతిలో చిడతలు పట్టుకుని, కాళ్ళకున్న మంజీరాలు గల్లుగల్లుమంటూండగా హరికథకులు గుడిముందున్న చిన్నవేదిక పైకి చేరతాడు. మృదంగం, వయిలెను, హార్మోనియం వంటి వాయిద్యాలు వాయించే విద్వాంసులు వేదికపైన కూర్చుంటారు.

పగలు కథ (ప్రారంభించే ముందు గుడిలో వుండే (గుడి అంటే గోపురంలాండిది వుండాలని లేదు. నాలుగు గోడల పైన కప్పువుండే చిన్న యిల్లే గుడిగా వుంటుంది) పాందవులూ, శ్రీకృమ్ణుడూ,

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఉ జబనవరి-2022 |



ఫోతురాజుల చెక్క బొమ్మలకు పూజ జరుగుతుంది. పోతురాజు విగ్రహాన్ని మాత్రం హరికథ జరిగే వేదికపైకి తెచ్చి కొాలువుచేస్తారు. మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలు కనీసం దినానీకొకటి వచ్చేలా హరికథకుడు తన కథనాన్నీ కొనసాగిస్తాడు. దాదాపుగా ఆఘట్టాలన్నీ తొండనాడు జానపదులకు బాగా తెలుసు. భారతప్రశస్తి, భారతుడి జననం, భీష్మ ప్రతిజ్ఞ, పాండవ జననం, లక్మయిల్సు బకాసుర కథ, రాజసూయం, రాయబారం, అభిమన్యుడి వధ, కర్జుడి చావు, దుర్యోధన సంహారం.... యిలా ప్రతిరోజు వా ముఖ్యమైన ఘట్టాన్ని వినడం కోసం చుట్టూవున్న పల్లెల నుంచీ జనం వచ్చి పందిరి కింద చేరుకుంటారు.

జనరంజకంగావుండడం కోనం హరికథకులు మధ్యలో పాటలూ పద్యాలూ, వీలయితే నృత్యాలూ గూడా చేరుస్తారు. కథ మథ్యలో దేవుడికిచ్చిన హారతి పళ్లెం జనాల దగ్గరకి తీసుకొస్తారు. వచ్చిన వాళ్ళంతా హరిదాసుకోసమని మళ్లెంలో తమకున్న డబ్బేదో నమర్ప్చించుకుంటారు. భారతంలో జరినే ముఖ్యవుట్టాలను పందుగల్లాగా జరుపుకుంటారు. బకాసుర సంహారమపష్పుడు భీముడి వేషధారి యొద్దుల బండెక్కి వూళ్లంతా తిరుగుతారు. జనం ఆ బండిలో తాము వండిన ఆహారమంతా చేరుస్తారు. బకాసురవధను నాటకంలా (టదర్శించాక బండిలోని ఆహారాన్ని జనాలకు (ప్రసాదంగా పంచుతారు.

“తపసుమాను” అనేది మరో వుత్చవం. పెద్దతాటి చెట్టును కొట్టుకొచ్చి దాని బోదెను నాటిక, దానికి కొమ్మల్లా కొన్ని కాయ్యల్ని అమరుస్తారు. ఆర్జునుడు పాసుపతం కోసం శివుణ్ణి మెప్పించే ఘట్టమది. ఆర్జునడి వేషధారి పెద్దజోలెలో నిమ్మకాయలు, పూలు, విబూతీ నింపుకుని తవసు మానుకొమ్మలపైన యెక్కుతాడు. కౌమ్మకొమ్మకూ పద్యాలు పాడుతూ చివరికి తాటి బోదెపై నుండే చీన్న వేరికపైకి చేరుతాడు. 'పైనుంచి నీమ్మకాయలూ, విబూతి పండ్లూ, పూలూ కిందకి విసరుతాడు. వాటికెంతో మహిముందని నమ్మి