పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆమె సమాధి కూదా ఉంది. అక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆమె కాలం నాటి శాసనాల కోసం వెదికాను. ఆ మ్యూజియం వారు ఒక 'బోచర్‌ ఇచ్చారు. ఆ టబ్రోచర్‌లోని వివరాల ప్రకారం చామాదేవి రెండు నదుల మధ్య ప్రాంతాన్నీ పరిపాలించింది. ఆ రెండు నదుల మథ్య ప్రాంతాన్ని ఆనాడు * సమాం(ధ్రప్రదేశ్‌ ” అనే వారని తెలుసుకుని ఆ ప్రాంతంలో మన 'ఆంధ్రా పదం విని ఆశ్చర్యపోయానని ఆమె చెప్పారు.

అక్కడి నుంచి, వియత్నాంకు తను వెళ్లారని, అక్కడి ఆర్మిలాజికల్‌ అధికారులు చెప్పిన విషయం ఆధారంగా, వియత్నాంలో మొదటి ఆలయం “ఛద్రేశ్వరస్వామి” దేవాలయం అన్ని, దానిని వియత్నాలోని చంపా రాజ్యాన్ని పరిపాలించిన హిందూ రాజులు నిర్మించినదనే విషయాన్ని ఆమె సభికుల ముందుంచారు. ఈ దేవాలయం ప్రస్తుత సెంట్రల్‌ వియత్నాంలో మైసన్‌ సిటి అనే నగరంలో ఉంటుంది.

ఇళ ఆర్మిలాజిళల్‌ స్వే అవ్‌ ఇండియా వాళ్ళు వ్‌మీ చెబుతారంటే, భారత దేశంలో ఇటుకలతో నిర్మించిన అతి పురాతన దేవాలయాలు మూడు ఉన్నాయి. అందులో ఒకటి నాగార్జున కొండ ప్రాంతంలోని 'పుష్ప భదేశ్వరస్వామి” ఆలయం. ఇక్కడి భద్రేశ్వర స్వామి దేవాలయం క్రీశ 2వ శతాబ్దానికి చెందినదైతే, అక్కడి భద్రేశ్వరస్వామి దేవాలయం 5 వ శతాబ్దానికి చెందినది. ఇక రెంటి గోపురాలు ఒకే విధంగా ఉండటం విశేషం అనీ అనురాధ తెలిపారు.

వియత్నాంలోనీ హొచిమిన్‌ సిటీలో, నేషనల్‌ హిస్టరీ మ్యూజియం అని ఉన్నది. అక్కడికి వెళితే ఎదురుగా చంపా రాజ్యానికి చెందిన చాంగ్‌ దాంగ్‌ బుద్ద శిల్పం చూసి ఆశ్చర్య పోయానన్నారు. కారణం వివరిస్తూ, అలాంటి బుద్ధ విగ్రహమే నాగార్జున కొండకి వెళితే కనీపిన్తుందని చెప్పి సభికులని ఆశ్చర్యానికి గురిచేశారు. కాకపోతే అక్కడి శిల్పం 7వ శతాబ్టీకి చెందినది. అది కంచు విగ్రహం. తమ మొదటి శిల్పానికి డ్రేరణ “అమరావతి” అనీ వియత్నాం వాసులు చెబుతున్నారనీ అనురాధ తెలిపారు. అలాగే మయన్మార్‌ లో “మన్‌” భాష, థాయ్‌లాండ్‌లో '*లాన్ను, 'థాయ్‌” భాషలు, వియత్నాంలోని “వామి భాషల లిపులకి మూలం “పల్లవ (గ్రంథి? లిపి అనీ అనురాధ తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ “1921లో భావరాజు వెంకట కృష్ణారావు ప్రాచీనాంధ్ర నౌకాజీవనం” అనే గ్రంథం రచించారు. అందులో ఇండోనేషియాలోనీ జావా దీవుల్లో, జూంబీ అనే కొండ మీద పూర్ణవర్మ అనే రాజు పాదముద్రలున్న పెద్ద శిలాశాసనం దారికిందనీ రాశారు. ఆ శాసనం భాష సంస్కృతం అని, లిపి వాతం వేంగీ లివి లాగా ఉందనీ ఆయన రాశారు. నేను ఇందోనేషియా రాజధాని జకార్తాలో నేషనల్‌ మ్యూజియంకి వెళితే, రెందవ అంతస్తులో పూర్ణవర్మ పాదముద్రలున్న పెద్ద బండరాయి ఏసి గదుల్లో భద్రంగా దాచిపెట్టబడి ఉన్న విషయం గుర్తించాను.” అని చెప్పారు.

శ్రీలంక, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, ఇండోనేషియా అలా వెళ్ళే కాలదీ తెలుగుజాతికి సంబంధించిన ఎన్నో మూలాలు దొరికాయనీ, అలా చూసిన అద్భుతాలన్నీ తనలోనే ఉంచుకోకూడదని, ప్రపంచానికి చెప్పాలని, వ్యాసరూపంలో చెబితే అందరికీ చేరువవ్వదని ఒక కథ రూపంలో నవలగా తెలుగు వారి ముందుకు తెచ్చానన్నారు అనురాధ.

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

వాస్తవానికి ముందు వ్యాసరూపంలో తూడా రాయడం జరిగిందని ఆమె తెలిపారు. అనేక విశేషాల నమాహారమే తన పుస్తకమనీ అనురాధ చెప్పారు. 1975లో వెొదటి తెలుగు మహాసభలు జరిగాయి. ఆ సందర్భంగా విడువలైన ఒక 'ప్రత్వేక సంచికలో విశ్వనాధ సత్యనారాయణ ఒక వ్యాసంలో “ఫిలిప్పీన్స్‌ లో కెగలాగ్‌” అనే భాష ఉన్నదని, అది తెలుగు భాషకు దగ్గరగా ఉన్నదనీ, వారికి తెలుగువారికి సంబంధాలు ఏవిటో చూదాలి అని ఆయన అథివ్రాయపడ్డారు. ఆ విషయాన్ని రచయిత్రి ఈ సందర్భంగా సభికులకు గుర్తుచేస్తూ, దాని గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 'తెగలాగ్‌ భాషనీ ఫిలీప్పీన్స్‌ వారు తమ అధికార భాషగా ప్రకటించుకున్నారు. ఫిలిప్పీన్స్‌ లో 'పలావాన్‌” అనే పెద్ద దీవి ఉంటుంది. పలావాన్‌ అనే జాతి అక్కడ ఇంకా మనుగడ సాగిస్తోందనీ ఆమె తెలిపారు. కానీ వాళ్ళ గురించి మనం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

టర్మీలో ఏన్నియంట్‌ ఆర్మిలాజికల్‌ సైట్‌, 'గాబెక్షి తెపె” 12 వేల ఏళ్ళ క్రితంది. అతి పురాతనమైనది. దానిలో తెపె అనే పదం తిప్ప అనే తెలుగు పదం నుంచి వచ్చిందని భాషా శాస్త్రవేత్త ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారని అనురాధ సభికులకు తెలిపారు.

ఈ పరిశోధన చేయనానికి ముఖ్య కారణం, టివి9ి అప్పటి మాజీ సిఈవో రవిప్రకాష్‌ అని, ఆయన పదేళ్ల క్రితం ఇచ్చిన ప్రాజెక్ట్‌ అది అని గుర్తుచేసుకున్నారు. ఆయన సలహాతో శ్రీలంకలోని కాండీతో మొదలైన తన శోధన ఇతర (ప్రాంతాలలో కూదా నిరాటంకంగా సాగిందనీ అన్నారు. కాగా ప్రముఖ ఆర్మియాలజిస్ట్‌ వి.వి. కృష్ణశాస్త్రి గారినీ తాను కలిసినప్పుడు టర్మీలోనీ ఇస్తాంబుల్‌లో పురాతనమైన సుల్తాన్‌ మెట్‌ అనే ప్రాంతం ఉందని అది తెలుగులోని మెట్ట అనే పదం నుంచే ఏర్పడ్డదని కృష్ణశాస్త్రిని ఉటంకిస్తూ ఆమె తెలిపారు. తెలుగుజాతి వలనల గురించి, వారి మూలాలపై విస్తృతన్టైన అవగాహన కలిగేలా చేసిన స.వెం. రమేశ్ళ్‌ శాసనాల గురించిన అనుమానాల్ని నివృత్తి చేసి తన పదేళ్ల ప్రయాణంలో వెన్నంటి ఉన్న ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త ఈమని శివనాగిరెడ్డి, ఏ దేశంలో తెలుగువాళ్ళ ప్రాభీన ఆనవాళ్ళ గురించి తెలిసినా తనకి ఆయా వివరాలు అందించిన ఈనాడు జర్నలిజం స్కూల్‌లో ఫొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకులు దివంగత తల్లాప్రగడ నత్యనారాయణ, నవల ప్రచురణకు ఆర్ధిక సహాయం అందించిన బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, అడిగిన వెంటనే వుందువూట అదల్బతంగా రానీచ్చిన దా॥ కె. శ్రీనివాస్‌, అమ్మనుడిలో సీరియల్‌ గా ప్రచురించిన దా॥ సామల రమేష్‌, ఎప్పుడూ కాదనకుండా తనకు అందగా నీలిచిన తన కుటుంబ సభ్యుల సహకారం ఎనలేనీదనీ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

ఇంకా తన జాబితాలో జపాన్‌ ఉందనీ, క్రి.శ 7వ శతాబ్దంలో నాగయ అనే రాజు అక్మన పరిపాలీించాడనీ ఆమె తెలిపారు. అతని సమాధి కూదా ఉన్నదని తెలుస్తొంది. తరువాత కొరియాలో తన పరిశోధనని కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు.

సమావేశకర్త దా॥ సామల రమేష్‌బాబు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.