పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దానిలో ప్రవేశం ఉన్నవాళ్ళు కనిపెట్టవచ్చు.

చంపాలో ఉన్న లిపి గాని, బర్మా లిపి, బంగినీ లిపి గమనిస్తే, తెలుగు లిపి కొట్టాచ్చినట్లు కనిపిస్తుంది. ప్రాచీన తెలుగు శాసనాలు చూస్తే ఈనాటికీ కాన్ని తెలుగు అక్షరాలు ఖ, ఘ, మయ ఈ నాలుగు అక్షరాలు రెండు అక్షరాలు కలిపినట్లు ఉంటాయి. ఈ నాలుగు అక్షరాలు మన పాత ప్రాచీన థాయ్‌ లిపి, మన్‌ లివి కానీ, బర్మా లిపి కానీ తీసుకుంటే ఘ, ఈ, ఎ, నీ వెల్లకిలా తిప్పినట్లు ఉంటుంది.

ఖచ్చితంగా తెలుగు, కన్నడలిపిలలో ప్రాచీన అవశేషాలు ఉన్నాయి. అవి పల్లవులు అందిపుచ్చుకుని, పల్లవుల నుంది ఆ ప్రాంతాలకు తీసుకు వెళ్లారు. అంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభమై అక్కడి నుండి తమిళనాడు మీదుగా అక్కడికి చేరుకున్నాయి. వీళ్ళందరూ అక్కడికి చేరుకోకముందే శాతవాహన సామ్రాజ్యంలో కృష్ణ గుంటూరు గోదావరి పట్టణాల నుంది ఆంధ్ర శాతవాహనులు ఓడల మీదుగా తూర్పు తీరాలకు, దేశాలకు వెళ్లి రాజ్యస్థాపన చేసినట్లు అక్మడ కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ఆంధ్ర శాతవాహనుల నాణేల మీద ఓడల బొమ్మలు ఉండడం, పట్టణాలకు అమరావతి ఊళ్ల పేర్లు ఉండడం ఇవన్నీ చూస్తుంటే మన చరిత్ర ఎక్కడో ఆగింది. వారు ఎందుకు వెళ్లారు, ఏం చేశారు, ఎలా వెళ్లారు, ఎలా సాగింది వారి ప్రయాణం గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. దీనికి నరైన మార్గనిర్దేశం చేసేందుకు అనురాధ చక్కగా రాసిన నవల ఇది. ఇక్కడి నుంచి పాఠంఖించి చరిత్రకారులు, ఖాషాశాస్త్రజ్జులు అక్కడ ఉన్న శాసనాలను, లివులను పరిశీలించి ఎక్కడ నుండి తెలుగు వాళ్ళు వెళ్ళవలనీ వచ్చింది, ఏమీ సాధించారు, మిగిలిన వాళ్ళు ఏమయ్యారు, ఇట్లా ముందుకు సాగడం అనేది ఈ నవలలో కనిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది అని అభిప్రాయపడ్డారు.

ఆనాటి తెలుగు వారినీ గురించి చెప్పుకోవాలంటే తడలి తరంగాల మీద ఇతర దేశాలకు పోయి అక్కడ చరిత్ర సృష్టించారు. మరి ఈనాడు వారు ఏమి చేస్తున్నారు? కొంతమంది ఇతర దేశాలకు అమెరికా ఆస్ట్రేలియా వెళ్తున్నారు. కానీ ఎలాంటి చరిత్ర సృష్టిస్తున్నాం? ఏం చేస్తున్నాం? చాలా నిద్రావస్థలో, సుషుష్తావస్థలో అసలు ఏం జరుగుతుంది అనేది వంటపట్టడం లేదు. విద్యార్దులు పూర్తి నీద్రావస్థలో ఉన్నారు. చదువు ఉన్నవారు అంతకన్నా నీద్రావస్థలోకి వెళ్లారు. ఇక రాజకీయ నాయకులదే రాజ్యం. మళ్లీ మనందరం మేల్మోవాలి. ఈ మేలుకోవదానికి ఈ పుస్తకం ఉపయుక్తమవుతుంది. ఈరోజు యువకులందరూ ఏదో ఒక స్కిల్‌ నేర్చుకుంటున్నారు. ఒక డిగ్రీ వస్తుంది. స్కిల్‌ నేర్చుకుని డబ్బు సంపాదిస్తున్నారు. కానీ సమాజం ఏమవుతోంది? నమాజం ఎందుకు ముందుకు పోవడం లేదు. ముందుకు ఫోవడం అంటే ఏమిటి? మనందరం మన గురించి ఏందుకు ఆలోచించడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డు గ్రహీత స్పందన

అవార్డు గ్రహీత, పుస్తక రచయిత్రి డి. పి. అనురాధ తన స్పందనలో ఇలా అన్నారు: “జగమునేలిన తెలుగు- గోదావరి నుంచి జావా దాకా నవల రాయదానీకి కారణాన్ని వివరిస్తూ, (శ్రీలంకలో క్యాండి నగరం అనే నగరం ఉంది, అది పర్వాటక కేంద్రం. అక్కడి క్వీన్స్‌ హోటల్‌లో బేక్‌ఫాస్ట్‌ చేస్తూ ఉన్నాను. ఎదురుగా రెండు పెయింటింగ్స్‌ కనిపించాయి. 'ది లాస్ట్‌ రూలర్స్‌ ఆఫ్‌ కాం అనీ ఉంది. ఆ రాజు

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

డి. పి. అనురాధకు తాపీ ధర్మారావు పురస్కారాన్ని

ఇచ్చే సందర్భంలో తెలుగుజాతి(టస్సు)

'టప్టీ డా! వెన్నీసెట్టి సింగారావు

మన్నన పత్రాన్న చదివి సత్మార గ్రహీతకు అందజేశారు.


రాణి పెయింటింగ్స్‌లో రాజు పెరు విక్రమరాజ సింఘె, రాణ్‌ పెరు గమనిస్తే, అవిడ పేరు 'వెంకట రంగమ్మ అని ఉంది.

మన తాతమ్మ, జేజమ్మల పేరు శ్రీలంక మహారాణి పేరుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడి వాళ్లని అడిగితే, ఈ కోటంతా వాళ్లదే, 150 ఏళ్ళు పరిపాలించారు. వాళ్ళంతా తెలుగు వాళ్ళు అని చెప్పారు. ఈ విషయం మనకి ఇక్కడ ఏ పుస్తకంలో కూదా ఉందదు. మనకి (శ్రీలంక అనగానే తమిళులే గుర్తొస్తారు. మన తెలుగువాళ్ళు అక్కడ పరిపాలించారు. శ్రీలంక మొదటి పాలకుడు విజయుడు, శ్రీకాకుళం నుంచి వచ్చిన వాదైనప్పటికీ, అక్కడి వాళ్ళు కళింగదేశం నుంచి వచ్చినట్లు చెబుతారు. కానీ మన చరిత్రలో ఎక్కదా దానీ వివరాలుండవు. కళింగ అనగానే ఒరిస్సా వాళ్ళు తమ వారనీ చెబుతారు. కానీ శ్రీకాకుళం వారని, మన పరిశోధకులు ఆధారాలతో రాశారు. అయితే సామాన్యులకు మాత్రం ఆ విషయం అసలు తెలియకపోవడం శోచనీయం. అలానే మయన్నార్‌లోని యాంగాన్‌ (అప్పటి రంగూన్‌) నగరంలో “ప్వడగాన్‌ పగోడా” అనే పేరుతో 362 అదుగుల ఎత్తు స్థూపం ఉంది. ఆకాశానికి చొచ్చుకొనీ పోతున్నట్లుగా ఉందే ఆ స్థూపం టన్నుల బంగారంతో తాపడం చేసిన ఒక అద్భుత కట్టడం. ఏ దేశాధ్యక్షులు ఆ దేశం వెళ్ళినా కచ్చితంగా సందర్శనీయ స్థలంలో అది మొదటే ఉంటుంది. దానీ గురించి వివరాల కోసం అక్కడి సావనీర్‌ చుస్తే, దానినీ క్రీశ 5 వ శతాబ్దంలో “ఒక్మలప్పు” అనే రాజు నిర్మించినట్లు తెలినిందని అనూరాధ చెప్పారు. ఆ స్టూవం నిర్మించిన కొండ పేరు 'తంబగుట్ట”. అలాగే 13వ శతాబ్దంలో “మగాడు” అనే రాజు పరిపాలించినట్లు తెలిసిందన్నారు. వీరంతా 'మన్‌” జాతీయులు. దక్షిణ బర్మాలో తొలి రాజ్య పాలకులు వీరు అని ఆమె తన పరిశోధనా విశేషాలు వివరించారు.

ఈ 'మన్‌” జాతికి చెందిన రాణీనే *'చామదేవి”* ఈవిడ థాయ్‌లాంద్‌కు చెందిన రాణి. ఉత్తర థాయ్‌లాండ్‌లో మొదటి పాలకురాలు చామదేవి. ఆమె ఇంకొక పేరు చిన్నమదేవి. చెన్నదేవి అనీ కూదా అనేవారు. మయన్నార్‌లో ఒక పరిశోధకులు చెప్పిన విషయం ఏమిటంటే, ఆమె పేరు మీదనే “చింగ్మయి” అనే ఒక నగరం ఉన్నది. బ్యాంకాక్‌ తర్వాత ఆ దేశంలో అతి పెద్ద నగరం అది అని అనురాధ సథీికులకు తెలిపారు. చింగ్మయి కాస్త చిగ్గయి అయ్యింది అని స్థానికులు తెలిపినట్లు రచయిత్రి చెప్పారు.

చింగ్మయికి నమీపంలోని లంపూ నగరం శేంద్రంగా రాణి చామదేవి పరిపాలించారు. ఆమె శ్రీ.శ 7 వ శతాబ్ది రాణి అక్కడ