పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సామాజిక కట్టడిలో ఉన్న సమయంలో కూడా తమ తమ భాషలని తమ వద్దే భద్రపరచుకున్నారనే విషయం గర్వించదగ్గవనీ అన్నారామె. శతాబ్బాల కాలం నాదే వలస వెళ్ళిన తెలుగు వారి గురించి అనేక విషయాలు స్పృశించిన ఈ పుస్తకం నిజంగా మెచ్చుకోదగినదని కొనీయాదారు. అలాగే రచయిత్రి నవలలో ఒక టైం మిషన్‌ ద్వారా చెప్పాలనుకున్న ప్రయత్నం అభఖినందించదగ్గదనీ అన్నారు. సహజంగా ఉన్నది అందిస్తే వ్యాసాలలా మామూలుగా ఉండవచ్చు లేదా

అందరినీ చేరువకాలేక పోవచ్చు. కనుక అనురాధ ప్రయత్నం అభినందనీయం అన్నారు. దీనితో పాటూ ఈ నవలలో మనోవైజ్ఞానానికి సంబంధించిన అంశాలు ప్రాంతీయ భాషలు, తెలుగు భాష పొలివురలు దాటి ముందుకెళ్ళి మనుగడ సాగించాల్సిన అవసరం, దక్షిణ భారతీయ భాషలు ఎలా మనుగడ సాగిస్తున్నాయన్న విషయాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎలా వెళ్ళారన్నది చారిత్రక అంశం, కానీ ఎలా మనగలుగుతున్నాయి అన్నది మాత్రం పెద్ద పరిశోధనే అవుతుందనీ చెప్పగలన్నారు. దీనినీ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత కూదా యువత మీవ ఉందని ఆమె అన్నారు. నిద్రావస్థ నుంచి జాతిని మేల్మొల్చే రచన

ఈ సమావేశంలో మరొక ఆత్మీయ అతిథిగా పాల్గొన్న భారతీయ భాషల సంధు జాతీయ అధ్యక్షుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రచయిత్రి అనురాధ ఒకరకంగా పద్మవ్యూహంలోకి ప్రవేశించి మన తెలుగు వారినందరిని సైనికులుగా అందులో ్రవేశించమని సన్నద్ధం చేస్తున్నట్లుగా ఉందనీ అన్నారు. ఇంతవరకు తెలుగు వారి గురించి చారిత్రక నవల రాయడం గత తరంలో జరిగింది. కానీ గత 80 సంవత్సరాలలో అలాంటి చారిత్రక నవల రాలేదు. చరిత్ర పరిశోధనకు చారిత్రక నవలలు చాలా అవసరం. ఈ నవలలు మార్గనిర్దేశకత్వం చేస్తాయి. అనేక రకాల విషయాలను సమ్మిళితం చేసిన పెద్ద నవల జగమునేలిన తెలుగు. ఈ నవల సృష్టించడానికి చక్కటి తెలుగు శైలినీ ఆమె అందించారు. ఇందులో సూర్యవర్మ అనే యువకుడు ఉంటాడు. యువకుడిని ఎందుకు సృష్టించారు అంటే కథానికకు కావలసిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ కాలంలో మగవాళ్ళు అవసరం. సూర్యవర్మ కాల యంత్రంలో వెళ్లి గడిచిన కాలంలో ఎవరెవరు అయితే తెలుగు చరిత్రను నిక్షిప్తం చేశారో, ఆ చరిత్ర పాత్రలోకి వెళ్లి వాళ్ల ద్వారా

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

చెప్పిస్తూ ఉంటాడు. చళ్కని చార్మితక నవలగా దీనీనీ రూపొందించారు. చవవడం మొదలు పెడితే వదలకుండా చదివే స్థాయి ఈ నవలకి ఉంది. అంత చక్కని నవల. ఈ ఆలోచన, రావడానీళిచాలా


వుంది కారణం అయ్యారు అని ఆమె కూడా చెబుతున్నారు. ఆయా ప్రాంతాలలోని చారిత్రక విషయాలు తెలుగువారికి ఇప్పటిదాకా తెలియవు అంటే అతిశయోక్తికాదని, అక్కడ చూచాయగా ఏదో హిందూ రాజ్యాలు ఉన్నాయి ఏనాడో వారు వెళ్లిపోయారు అనీ మాత్రమే తెలుసు. అయితే ఈ నవలలో ఆయా రాజ్యాలన్నీ ఎక్కడి నుండి వెళ్లాయి భారతదేశం నుండి అక్కడ రాజ్యస్థాపన కోసం ఎందుకు వెళ్లాయి. ఏ రాజ్యానికి ఆ రాజ్యాన్నీ తీసుకొనీ చాలా వివరణాత్మకంగా రాశారు. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే చంపా రాజ్యం గురించి. మీ అందరికీ కంపూచఛియా అది వియత్నాంగా మారిందనీ తెలుసు. అ ప్రాభీన హిందూ చంపా రాజ్యం నేటి వియత్నాంలో దక్షిణ తూర్పు తీరంలో ఉండి పై నుండి కిందదాకా ఉంటుంది. అక్కడ ప్రాచీన నగర రాజ్యాలనీ పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న పేర్లు “అమరావతి. అమరావతికి మరో పేరు 'ఇంద్రపురం” ఆల్జర్నేట్‌ గా “ఇంద్ర పుర. ఆ తరువాత అక్కడితో ఆగలేదు. ఇంకొంచెం కిందకి వస్తే ఇంకో నగరం శౌతరి. కౌతరా అంటే కృష్ణాజిల్లాలో ఒక ప్రాచీన తీరపట్టణం. ఈనాడు శౌతరం” అనీ పంచాయతీ ఉంది. అక్కడ కౌతరం నగర రాజ్యం ఉంది. అలాగే కిందకి వస్తే “పండ్రంగి పండ్రంగ అంటే పాండురంగ అని అర్ధం. కృష్ణాతీరంలో ప్రసిద్ది చెందిన పాండురంగ ఆలయం ఉందే నగరం బందరు ఉంది . తర్వాత అక్కడి నగరం పేరు విజయ. విజయవాడ పేరు మీద నగరం. ఇలా 4 నగర రాజ్యాల పేర్లు కృష్ణ గుంటూరు తీర నగరాల పేర్లు అక్కడ పెట్టారు. ఇది ఎలా జరిగింది అంటే ఇక్కడ ఓడ ఎక్కిన వాళ్లు కృష్ణా,గోదావరి ఫోర్ట్‌ సిటీస్‌ నుండి వెళ్ళిన వాళ్ళు, పడవ దిగి అక్కడ వాళ్ల పట్టణాల పేర్లతో రాజ్యస్థాపన చేసి కాన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తర్వాత పై నుండి, జావా నుండి వచ్చిన కొంతమంది దండయాత్రలతో ఆ పట్టణాలలో కొన్నిటిని నాశనం చేశారు. చెంఘీజ్‌ ఖాన్‌ పేనలు కూడా అప్పుడే 12వ శతాబ్దంలో బయలుదేరాయి. వాళ్ల తాకిడికి కొన్ని పట్టణాలు, ఆ తర్వాత చైనా నుండి దురాక్రమణకు గురై కొన్ని పట్టణాలు, అనేక రకాలుగా ఒత్తిడిలకు లొంగి కొన్నీ నామరూపాలు లేకుందా పోయాయి. కానీ చరిత్రను వదిలి పెట్టి పోయారు. ఆనాటి కొన్ని శిలాలేఖనాలు గమనిస్తే ఇక్కడ శిలా లేఖలలో కనబడే తెలుగులిపి అక్కడ శిలా లేఖనాలు కనబదే తెలుగు లిపి ఒకేలా ఉంటుంది. ఈనాటికి కాంత