పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుసుకునీ ఆశ్చర్యానికి గురయ్యానని రాధారాణి అన్నారు. ఇప్పటి వరకూ తెలుగు వారు అమెరికా, యూరోపియన్‌ దేశాలకు మాత్రమే వెళ్లారని తెలుసు కానీ, సౌత్‌ ఈస్ట్రన్‌ కంట్రీస్‌కి వలస వెళ్లారన్న విషయం చాలా మందికి తెలీదని, మలేషియా వంటి దేశాలకు వెళ్ళినా వర్మర్హుగా వెళ్ళిన వారి గురించి మాత్రమే చరిత్రలో ప్రస్తావించారనీ, అందువల్లే తెలుగువారికి, వారి వారి మూలాలపై అవగాహన తక్కువని ఆమె అఖీప్రాయపడ్డారు.

ఇక అనురాధ రచనలో తెలుగువారు ఇతర దేశాలకు ఎలా పొట్ట చేతపట్టుకుని వెళ్ళారు? అక్కడ రాజులుగా, రాణులుగా ఎలా ఎదిగారు? ఎలా అక్కడి రాజ్యాలని ఏలారు? అక్కడి ప్రజలు వారి విగ్రహాలను ఇప్పటికీ ఎలా కొలుస్తున్నారు? అనే విషయాలను కూడా కళ్లకు కట్టినట్లు ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు. అలాంటి విషయాలు తెలుసుకోవడం తెలుగు వారందరికీ స్పూర్తిదాయకం. దీనిలో ప్రస్తావించిన అనేక విషయాలపై, వస్తువులపై అందరికీ అవగాహన చాలా తక్కువగ ఉంటుందన్న రాధారాణి అద్భుతంగా సాగిన ఇలాంటి రచనలు అనురాథ నుంచి మరిన్ని రావాలనీ ఆకాంక్షించారు. అభినందనలతోపాటు సూచనలు, సలవోలు

విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆంధ్రజ్యోతి సంపాదకులు దా. కె. శీనివాస్‌ మాట్లాడుతూ తాపీ ధర్మారావు పురస్కారం అనూరాథకి అందించడం అభినందనీయమని, అలాంటి యువ జర్చలిస్టులకు పురస్మారం అందించడం ద్వారా తాపీ ధర్మారావు ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్ళ డానికి దోవాద


యూరవ్‌, కరేబియన్‌ దీవులు, మాల్టీవులు, మారిషస్‌, సౌత్‌ ఆఫ్రికా వంటి దేశాలను గుర్తు చేసుకుంటాం, పశ్చిమాసియా దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలుందేవని ఇప్పటి వరకూ పూర్తిగా వెలుగు చూసింది లేదని అన్నారు. తెలుగు వారి పాత్ర వీటిలో ఉన్న విషయం పై పెద్దగా ప్రచారం జరగలేదని, అలాంటి విషయానికి ప్రచారం కల్పించడంలో భాగంగా అదనపు సమాచారం సేకరించి, మనకు శేవలం కార్మికుల గురించి మాత్రవేు కాకుండా, రాజుల, విద్యావంతుల చరిత్ర కూడా ఉందన్న విషయాన్ని గుర్తించి కథలో చొప్పించి, నవల రాసిన తీరు చక్మగా ఉన్నదనీ అనురాధ రచనా శైలిని అభినందించారు. ఏ ఉద్యమమైనా భావావేశం నుంచే ్రేరణ పొందుతుంది. గతంలో ఒకరకమైన చరిత్ర ఉంటే, జాతీయోద్యమం మరొక రకమైన చరిత్రను భారతీయుల ముందుంచింది. తెలంగాణా

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఉ జబనవరి-2022 |

ఉద్యమం లాంటి ఏ ఉద్యమాన్ని గమనించినా, చరిత్ర మూలాలు అన్వేషించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. భావావేశం అనేది చరిత్ర పరిశోధకులకు (క్రేరణ అనీ చరిత్రలోనీ వాస్తవాన్ని నిజాయితీగా పరిశోధించాల్సిన అవనరం ఉన్నదని, అందుబాటులో లేని సమాచారాన్ని చరిత్రకారులు తమ భావావేశంతో పూర్తిచేయాలని చూడకుండా జాగ్రత్తపదాలనీ ఈ సందర్భంగా సూచించారు. ఇటీవల కాలంలో తెలుగు వారిలో బెత్సాహికులు చరిత్ర పరిశోధనకు కృషిచేన్తున్నారన్నారు. చరిత్రను సామాజిక వేత్త ఒకరకంగా చెబుతాడు. (త్రవ్వకాలను పరిశీలించినవారు ఒకరకంగా చెబుతారు, నాణేలను చూసిన వారు ఒక రకంగా చెబుతారు. సాంస్కృతిక చరిత్రకారులు మరోరకంగా చెబుతుంటారు. వీటి అన్నింటినీ సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది.

చరి[త్రకారులకి అనుబంధ శాస్త్రీయత పట్ల కూడా అవగాహన ఉందాలనీ ఆయన అన్నారు. అమితవ్‌ ఘోష్‌ ఈ మధ్య ఒక చారిత్రక నవల రాశారు. ఇండియా నుంచి మారిషస్‌కి వెళ్ళిన వారి గురించి ఆయన వ్రాశారు. దానినీ గమనిస్తే ఒక చారిత్రక నవల రాయదానికి ఎంత కష్టపడాలి అనే విషయం తెలుస్తుందన్నారు. అదే పుస్తకంలో భారత్‌కి చైనాకి వర్తకం వంటి విషయాలను కూడా స్పృశించారు. ఆ పుస్తకంలో బీహార్‌ నుండి ఎక్కువగా మారిషక్‌కి వలసలు ఎలా వెళ్ళారు? అనే విషయాలను ఆయన చక్కగా విశదీకరించాన్నారు. మారిషస్‌లో అత్యధికంగ మాట్లాడే ఖాష 'మోదిసెన్‌ అనీ, దానీ తర్వాత అధికంగా మాట్లాడే భాష తెలుగని శ్రీనివాస్‌ తెలిపారు. ఆ వలసలు ఎక్కడి నుంఛి, ఎలా జరిగాయనే విషయం పై అనేక దాక్యుమెంట్లను ఆ రచనలో ఆధారంగా చూపించారన్నారు. దానినీ సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు తెలిసిన ఈ 150 -200 ఏళ్లూ వలస తెగల గురించి పరిశోధన చేయడానికి ఆస్కారం ఉంది. ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఆ వంశీకులు కూడా ఉన్నారు. నిజంగా అనేక చరిత్ర ఆధారాలు బయటపదే అవకాశం ఉంది. ఈ విషయాల మీద దృష్టి పెట్టమని, మనకు కొన్ని విషయాలు తెలిసినప్పుడు భావావేశంతో రాయకుండా, ఇతర అంశాలను కూడా బేదీజు వేసుకుని, అప్పుడు మాత్రమే వెల్లడించాలనీ చరిత్ర శోధకులకు సూచించారు. బాధ్యత యువతరానిదే

ఆత్మీయ అతిథిగా పాల్గొన్న విశ్రాంత ప్రొషెనర్‌ ఆచార్య గూడూరు మనోజ మాట్లాడుతూ, భాషా మూలాలు వెదికినప్పుడు భాష తమది కానీ భాషల మథ్య ఇమిడి మనుగద సాధించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్క భాషకు ఎన్ని లిపిలు ఉంటాం అనీ పరిశీలిషే స్తై ఆయా పరిధిలో ఉన్న చిన్న చిన్న సమాజాలలో ఒక్కొక్క భాష మనుగడలో ఉన్న విషయం మనకు అవగతమవుతుంది. రామచరిత మానస్‌ నీ తులసీదాస్‌ 'అవధి భాషలో రాసినప్పుడు అతనీనీ సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. ఎందుకంటే అప్పుడు అవధి అనే భాష అలగా భాషగా ముద్రపడింది. షా అబ్బుల్‌ ఖాదిర్‌ అరబ్‌ లోని ఖురాన్‌ని, ఉరూలోకి అనువదించినప్పుడు కూడా అతడిని ఆ సమాజం బహిష్కరించింది. అవధికి గానీ ఉర్దూకి గానీ ఎందుకు అప్పట్లో అంత తక్కువ తనం ఎందుకు ఉన్నది అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది.