పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శీలంకళు ఫోయి వన్తుంటారట కదా, నేనూ పోయి రావాలనుకుంటున్నాను, వివరాలు కావాలి” అనీ ఆమె అడగడంతో అక్కడి వివరాలనందించాననీ వారి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీలంక వెళ్ళారు. ఈ పుస్తకం రాశారు అనీ తెలిపారు. శ్రీలంక మూల వాసులు ఎవరు? అని అన్వేషణలో ఆమె తనకంటే ఒక్క అడుగు ఎక్కువ వేశారని తెలిపారు.

అక్కడ జాతుల మధ్య అంటే సింహళులకి, తమిళులకి మధ్య చాలా కాలంగా ఘర్షణలున్నాయి. వారిలో మూలవాసులెవరు అని అక్కడి ఆంత్రోపాలజిస్ట్‌లు వెదగడం మొదలు పెట్టారు. అలా వెదికి మూడు జాతులు మూలవాసులుగా గుర్తించారు. దానిలో రెండు జాతులు తెలుగు మాట్లాడుతున్నారు. ఇవి స్వంతంగా చెబుతున్నవి కాదు. అక్కడి ఆంత్రోపాలజీలో వచ్చిన పుస్తకాల ఆధారంగా చెబుతున్నవనీ రమేశ్‌ తెలిపారు.

“గతంలో మేము వెళ్తున్నప్పుడు పాములు వాళ్లనీ కలిశాం. కోతులు ఆడించే వాళ్ళనీ కలిశాం. ఈ రెందు తెగల వాళ్ళు బ25, 000 మందికి పైగా ఉంటారు. వీరితో సంబంధం లేకుందా, తమిళ ప్రాంతంలో అంటే ఉత్తర ప్రావిన్స్‌, తూర్పు ప్రావిన్సు, కొలంబో నగరం ప్రాంతాలలో తమిళులుగా ముద్రపడిన వారు 8.5 లక్షల మంది తెలుగు వారు ఉన్నారన్నది వాస్తవం. 'ఆల్‌ శ్రీలంక తెలుగు కాంగ్రెస్‌” అనే ఒక పార్టీ కూడా శ్రీలంకలో ఉంది. వాళ్ళనీ గతంలో కూదా కలిశాం. వాళ్ళలో మాణిక్యం అనే వ్యక్తి ఉన్నాడు, ఆటో తోలుకుంటాడు. అతనీ నుంచి అనేక వివరాలు సేకరించాం” అని రమేశ్‌ తన అనుభవాలను చెప్పుకొచ్చారు.

ఇవన్నీ కాకుందచా, రమేశ్‌ కంటే అనూరాధ ఎక్కువ అడుగు ఎక్కడ వేశారంటే, అక్కడ '“నాపోర్‌ అనే ఒక సంచార జాతి ఉంది. వాళ్ళు తెలుగు మాట్లాడతారు. ఆ జాతి వారినీ తాను 4 సార్లు శ్రీలంక వెళ్ళినా కూడా కలవలేకపోయానని చెప్పారు. దానీకి కారణం వివరిస్తూ, టశీలంక వెళ్ళిన వెంటనే పాములు ఆడించే వాళ్ళ వద్దకు వెళ్ళే వాడినన్స, వారు 'నాపోర్‌ జాతి వద్దకు వెళ్ళనిచ్చేవారు కాదని తెలిపారు. పఫాములవారు, కోతులవారు చెప్పేదేమిటంటే, ఆ 'నాపోర్‌ అనే జాతి దొంగతనాలు చేసే తెగ అని చెప్పి థయపెట్టేవారు. కానీ అనురాధ వారిని కూడా కలిసి అన్న కంటే ఒక అడుగు ముందుకు వేశారని అనురాధనీి ఆయన కానియాదారు. వాళ్ళు కూడా జా(గ్రత్తగా అనురాధని చూసుకున్నారు. ఈ పుస్తక రచయిత ప్రత్యేకత ఏమిటంటే, ఆయా ప్రాంతాలకు సరదాగా వెళ్లడం కాదు, పైపైన తిరగడం కాదు, అక్కడి వారితో కలినిపోవడం ఆమె (ప్రత్యేకత, ఆమె ఎక్కడా రాజీపడలేదు. ఆడతనం ఆమె పరిశోధనకి ఎక్కడా అద్దు రాలేదు. తనని వెళ్లనీవ్వనీ వారు, అనూరాధని కూదా వెళ్లనీవ్వలేదు. కానీ, ఆమె మాత్రం ఆ ప్రాంతానికి వెళ్లననీ వారికి చెబుతూనే ఆ తెగ వారుందే 'పుత్తళం” అనే (ప్రాంతం వెళ్ళిపోయి, అనేక వివరాలు బయటపెట్టారని రమేశ్‌ తెలిపారు.

వీరే కాకుండా ఇంకా రెండు తెగల వారున్నట్లు మాకు ఆధారాలు దొరికాయి. అనూరాధకు, తనకూ ఆ వివరాలు సేకరించాల్సిన బాకీ మిగిలి ఉందనీ చెబుతూ, జుఫ్నా ప్రాంతంలో 'అల్లంపల్లి అనే ఊరులో ఒక తెగవారు ఉన్నారు. వారిని “ఇసిరోళ్ళు? అంటారుట. 'నాపోరొలు తెలియకుండ చాకచక్యంగా దొంగతనం చేస్తారు. కానీ

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

'అసిరోళ్ళు” కొట్టి లాక్కుంటారుట.

ఇక ఇంకా చెప్పాలంటే అనురాధ అన్వేషణ (శశీలంకతో ఆగిపోలేదు. శ్రీలంక నుంచి మయన్మార్‌ దేశానికి వెళ్ళారు. అక్కడ తెలుగు వాళ్లకోసం వెదుకుతున్న సమయంలో ఈమెకు ఒక పాట వినిపించింది.

“కూన్‌ సమయా తిలంగాన దేసటోన్‌ మొన్‌ సమొన్‌ కౌ సా ఉన్‌ చకమున్‌ దౌం తరౌం దెవా పొబ్బ తై వాగెదోం టోం త్రిం పర్వా న్వా సువణ్న మించెలా సుద్ద పలతరె య్‌ కా చాకలొం రూం” ఇది ఆదేశంలో ఒక భాషలోని ఓ జోలపాట. ఆ పాటకు తెలుగు అర్ధం ఏమిటంటే,

= శ్చ కాదుకా, మన వేల తెలంగాణ. మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే మనం పడవల్లో ఎ(ర్రరాళ్ళున్న ఈ సువర్ణ భూమికి వచ్చాం” అని తెలుగు అర్దం. అంటే వారంతా, శతాబ్దాలక్రితం తెలంగాణా నుంచి వలస వచ్చేశారట, ఆ చరిత్రని పాట రూపంలో ఒకామె పాడుతుంటే అనురాధ ఆ పాటను రికార్డు చేశారు. ఎప్పటి వాళ్లో, వందలు కాదు, వేల ఏళ్ల క్రితం జరిగి ఉంటుంది వారి యానం అనీ ఆ పాటను ఉటంకిస్తూ ఆయన అఖిప్రాయపదారు.

ఆ జోల పాట విన్న తరువాత, అనురాధ వారితో మాట్లాడుతూ, తెలంగాణా అనేది ఒక ప్రాంతం అని, ఇప్పుడు కొత్త ర్యాష్ట్రంగా ఏర్పడిందని చెబితే వాళ్ళు సంతోషం పట్టలేకపోయారుట. అక్కడ నుంచి ఆమె తెలుగు వారు ఆగ్నేనియా దేశాలు వెళ్ళి ఆయా రాజ్యాలను ఎవరు పరిపాలించారో, వారిలో తెలుగు ప్రాంతాల, పేర్ల ప్రస్థావన ఎందుకుంది అనే విషయాలను అక్కడి లోతులకు వెళ్ళి పరిశీలించారు అని రమేశ్‌ తెలిపారు.

థాయిలాండ్‌లో చావుదేవి అనే రాణిది పెద్ద విగ్రవాం ఉంటుంది. అక్కడికి కూదా వెళ్ళారు అనురాధ. చాలా చోట్లకు వెళ్లారీమె. నేరుగా వెళ్లారు. వెతికి వెతికి లోతులకివెళ్ళి, తెలుగును తెచ్చుకున్నారు. ఆ విషయ సమాచారం క్రోడీకరించి 'జగమునేలిన తెలుగు” అనీ ఒక నవల లాగా రాశారు. ఇది ధారావాహితగా అమ్మనుడి పత్రికలో ప్రచురితమైంది.

ఆ సమయంలో బావుందన్న వారు, వ్యాసాల్లా ఉందని నొసలు చిట్లించేవారూ నాకు ఫోన్‌ చేశారు. ఏది ఏమైనా ఆ ధారావాహిక అనేక మందిని చదివించింది, అంటే కదిలించిందనీ ఆయన అన్నారు.

తిరుమలరావు గారన్నట్లు, తెలుగు వాళ్ళు చాలా చాలా దూరం వలన వెళ్లారు, వారి వలనల్లో ఒక కోణాన్ని మాతే చెప్పుకుంటుంటాం, దానినే పుస్తకాలలో రాసుకుంటున్నాం. కానీ నాణేనికి ఇంకోనైైవు వునం తాకడానికి ఖభయవడ్దాం. అసహ్యించుకుంటాం, ఏదేమైనా అటు వైపు మాత్రం చూడటానికి ఇష్టపడం. అదేమిటంటే, రాజ్యాలు పరిపాలించారు. రాజ్యాల నిర్మాణం చేశారు వంటి విషయాలు మనవాళ్ళు చెప్పుకున్నారు పాత రోజుల్లో. కానీ తెలుగు వాళ్ళు కోతులు, పాములు ఆడిస్తున్నారు, దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నారు అనీ మనం చరిత్ర పుటల్లో చూడలేదు. అంతేగాక తెలుగు జాతి ప్రాచీనత్వం గురించి మాట్లాదేవ్చుడు మన వారిలో కొంత వెనుకబాటుతనం తొంగిచూస్తుంటుంది. అప్పుడప్పుడూ రాజీ ధోరణిలా కూడా