పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తాపీ ధర్హారావు డి.పి. అనురాధ న్న మన్నన

శ్రీలంకకు వెళ్లిన తెలుగువాళ్లం ఎవరయినా ఏం చూడాలనుకొంటాం? ఏం చూసేసి వస్తాం? బౌద్దారామాలనో, శాంకరి శక్తిపీఠాన్నో ఇంకా కావాలంటే నూవర ఎలియా వేసవివిడిదినో, గాలె ప్రాంతపు కడలితీరాలనో చూసివస్తాం. అనురాధది ఆ చూపుకాడు, తనది తనక చెందిన తెలుగు చూపు. మనం మరచిపోయిన తెలుగుతనాన్నంతా మనముందుంచే చూపు. ఆ చూపే, పాముల్నీ కోతుల్నీ ఆడిస్తూ, పొట్టపోసుకొని తిరుగుతున్న లంకమూలవాసులైన తెలుగువారిని మనకు చూపిస్తుంది. ఆ చూపే, కొలంబో నగరంలోని కోపియవత్త అనే బదుగువాడ తెలుగు బతుకుల్ని మన కనులకు కడుతుంది. ఆ చూపే, మయన్నార్‌ మన్‌ తెగవారి జోలపాటలోని 'తెలంగాణ) మాటను గుచ్చి వెలికితీస్తుంది. ఆ చూపే, ఇండోనేషియా చామదేవిని తెలుగురాణి అని ఎలుగెత్తి చాటుతుంది. ఆ చూపే, ఆగ్నేయాసియా దేశాలనిండా అల్సుకొనిపోయున్న తెలుగువెలుగును మనకు మరుమట్లుగొలిపిస్తుంది. అనురాథకు పర్యాటకప్రాంతాలతో పనిలేదు. బోరోబుడూరు స్తూపం కావచ్చు, దరదమాళతిగ గుడి కావచ్చు, శీగిరి కొండ కావచ్చు, అంకొర్‌వాట్‌ ఆలయాలు కావచ్చు, బాలి రామాయణాలు కావచ్చు, మలేసియా పల్లెపేర్లు కావచ్చు, ఎక్కడకు వెళ్లినా లోతులకువెళ్లి అక్కడున్న తెలుగుదనాన్ని బయటవేయడం మట్టుకే అనురాధ పని. అనురాధ, పొట్టచేత పట్టుకొని విదేశాలకు వలసవెళ్లిన తెలుగుకుటుంబాల అమ్మాయికాదు. నుడులపేరుతో నాడులు వేరుపడినపుడు, పొరుగునాదులలో మిగిలిపోయిన అమ్మాయి కాదు. వాళ్లయితే వాళ్ల ఉనికికోసం చేసే పోరాటంలో తమ మూలాలను తవ్వకోవడం సహజం. అనురాధ తెలంగాణ గడ్డపై పుట్టిపెరిగింది. తెలంగాణాంధ్రాలలో ఎవరికీ పట్టని, ఎక్కడో ఉన్న తెలుగు ఉనికినీ చరిత్రనీ వెలికితీసే పనిని పెద్దగా తలకెత్తుకొని చేయడం అనురాథ గొప్పదనం. అనురాధ తెలుగు మగువ కావడం తెలుగుజాతికే గర్వకారణం.

అనురాథ, తను చెప్పదలచుకున్న చారిత్రిక వాస్తవాలను ఇదివరకు అమ్మనుడితో సహా పలుపత్రికలలో వ్యాసాలుగా వ్రాసింది. వాటిని ఇంకా ఆసక్తిదాయకంగా చదివించడానికి, దీనిని కాల్చనికనవలలో చొప్పించి అందంగా చెప్పింది. అందువల్ల అన్ని తీరుల చదువరులూ ఇష్టంగా చదువగలుగుతారు. ఇదొక చారిత్రిక కాల్బనీక రచన. ఇతర రచయితలకొక కొత్తదారిని చూపిన రచన.

తెలుగుజాతి ట్రస్టు ప్రచురిస్తున్న 'అమ్మనుడి పత్రికలో తొలుత ధారావాహికగా వెలువడిన ఈ రచన అందరి మన్ననలను పొందింది. అనురాధ, ట్రస్టు పాలకమండలి సభ్యురాలుగా సంస్థకు కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసింది.

ఇప్పటివరకు తాపీధర్మారావు పురస్కారాన్ని పొందినవారికంటే వయస్సులో చిన్నదైన అనురాధ, ప్రింట్‌ ఎలెక్షానిక్‌ మీడియాలు రెండింటిలో పాతికేళ్ల అనుభవాన్ని సంపాదించింది. ఎల్‌ఎల్‌బీ చేసినా జర్నలిస్టుగా స్థిరపడింది. దేశవిదేశాల్లో మరుగునపడిన తెలుగుజాతి అడుగుజాడలను పరిశోధించి, మూలాలను స్పృశించి చెప్పడమే తన ప్రత్యేక అఖీరుచి అని వినయంగా వెల్లడించిన అనురాధకు తాపీథర్మారావు పురస్కారాన్ని అందించి గౌరవించగల అవకాశం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాము.

అనురాధ సొంత ఊరు మహబూబ్‌నగర్‌ అయినా, చదువూ ఎదుగుదలా అంతా రెండు తెలుగురాష్ర్రాలతోనూ ముడిపడివుంది. కనుక ఆమె మొత్తం తెలుగుజాతి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొంది. పెద్దలు ఆశిస్తున్నట్లు, అనురాధ, ఇంతవరకూ తాను చేసిన కృషితో సంతృప్తిచెంది ఊరుకోకూడదు. మరింత లోతుగా, బలంగా, విసృతంగా తన పరిశోధనను కొనసాగించి తెలుగుజాతి మన్ననలను మరింతగా అందుకోగలదని ఆశిస్తూ ఈ మన్ననపత్రాన్నీ పురస్మారాన్నీ అందజేస్తున్నాము.

శెలుగుజాత్‌ పత్రిక అవ్నునుత్‌ అ జనవం-2022