పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులో బండారు అచ్చమాంబా ఇంకా కొందరూ ఇటువంటి కతలను గోదానాయకమ్మ కంటే పదిహేను ఇరవయ్యేళ్లకు ముందే రాసున్నారు. గోదానాయకమ్మ తమ అత్తగారి దగ్గర నుండి తెలుగును రాయడం చదవడం కూదా నేర్చుకొనున్నారు.

ముప్పయ్యవ నలబయ్యవ పదికాలలో చెప్పుకోవలసినవారు ముగ్గురు. ఎం.ఎస్‌. కమల, కు.వ. సేతు అమ్మ, మువ్వలూరు రామామృతం అవ్ము. ఈ ముగ్గురూ తెలుగువాదే. ఎం.ఎస్‌. కవమలగారి గురించి దొరికిన మందల చాలా తక్కువ. వీరు ఆంద్రతావులో పుట్టీ 'పెరిగినవారు. పెళ్లయినాక చెన్నపట్నానికి వచ్చినారు. ఆ తరువాతనే తమిళం నేర్చుకొని వ్రాతరి అయినారు. ఇంతే వీరి గురించి తెలిసింది. వీరు జమీందారు కుటుంబంలో పుట్టినవారట. పాఠరుల కుదురులో పుట్టినవారనీ, ఇంటి పేరు మం్రిమైగడ అనీ చూచాయగా గురుతున్నట్లు చెన్నపట్నంలోని గురుస్వామిగారనే పెద్దాయన కుటుంబంలో చెప్పినారు. వారు కూదా, ఇది నూటికి నూరుపాళ్లు సరయిన మందలేనని గట్టిగా చెప్పలేకపోయినారు. ఆదన్నువ (స్త్రీవాదం) అనే తలపోత వెఎదలవదానికి ఎన్నో ఏళ్ల ముందే, ఆడువారి తన్నెనరును (స్వాఖిమానాన్న) తన కతలలో నీలువెత్తున నీలిపినవారు కు.ప. పేతు అమ్మ,

సేతమ్మ మీద ఆమె అన్నగారైన కు.ప. రాజగోపాలన్‌ వెలుగువ (ప్రబావం) ఉంది. ఆదవాళ్లకూ ఉల్లం ఉంటుందనీ, అందులో కోరికలు ఉంటాయనీ, వాటిని నెరవేర్చుకొనే విచ్చలు (స్వేచ్చ) వాళ్లకు ఉండాలనీ తన కతలలో చాటింపు వేసినారు కు.ప.రా. కతలు రాయడమే కాదు, తన ఇంటి ఆడవాళ్ల గురించి అట్లే పట్టించుకొన్నారు. సేతమ్మకు చిన్న ఈడులోనే పెళ్లయి, ఆ ఈడులోనే పెనీమిటి చనీపోయినాడు. సేతమ్మ పెద్దవారు అయినాక ఇంట్లోనీ పెద్దల్ని ఎదిరించి చెల్లెలికి మరుమనువు చేసినాడు రాజగోపాల్‌. ఆదామగా నడుమ పొంతును గురించి తెంపుగా రాసినవారు ఈయన. మన చలంతో అంతోయింతో పోల్బదగినవారు తమిళంలో కు.ప.రా. ఒక్కరే. పోల్చదం తస్పో ఒప్పో తెలియదు నాకు. చలంలోని లోతు, చలంలోనీ వడి, చలంలోనీ ఒడుపు, చలంలోని తెంప రాజగోపాలన్‌లో కనబడవు. అరవాసి అయినా కనబడవు. చలం ఇంకా పుట్టలేదు తమిళంలో.

మణికొడి లాగానే కలామోహిని” అనే ఆకిక కూడా ఆ తరిలో తమిళంలో పేరు గడించినది. ఇందులో ఆడవారి రచనలు బాగా వచ్చేవి. ఈ ఆకికను నెలకొల్బడంలో సేతమ్మ చేయి ఎక్కువగా ఉంది. దీనిని నడిపే మోపిక(బాద్యత)ను చాన్నాళ్లు మోసినారు సేతమ్మ, ముందే చెప్పినట్లు సేతమ్మ కతలలో ఆడువారి వెన్ను నిటారుగా ఉంటుంది, కాసంతయినా వంగదు.

మువ్వలూరు రామామృతం అమ్మ. ఈ పేచే ఒక ఎనపు (ఉద్యమం). కరుకయిన వ్రాతలు, పదునయిన పలుకులు. ద్రావిడ ఎనపుకు, రామామృతం౦ రాని చేదోడయినారు. వాదాడి వాదోడయినారు. చేదోడువాదోదే కాదు, ఆ ఎసపుకు వెన్నూదన్నూ కూదా.

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

ఒక ఎసపు కోసం బతికినంత తరీ(శాలమూ) తన వ్రాతలను సాగించినవారు మువ్వలూరి రామామృతమమ్మ. ఈమెలాగా తను నమ్మిన చిక్కపట్టు(సిద్దాంతం) కోసమే వ్రాసిన ఆవిడ తెలుగులో నాకు తెలిని రంగనాయకమ్మ ఒక్కలే. రంగనాయకమ్మ కంటే రామామృతమమ్మ చాలా ఏళ్ల కిందటనే ఈ పనినీ చేసినారు.

మగువలలో తెలుగువాళ్లను వెతకడం ఇంకా ఇక్కట్టు అయింది. చిన్నపాటి తోడుపాటు కూదా దొరకలేదు. చాలా చాలా పాటుపడితే, ఇందులో పదమూడుమంది మగువల కతలకు చోటు దొరికింది.

ఇక ఈ నేలన తెలుగు బడుగు(వళిత) వ్రాతరుల గురించి చెప్పడానికి ఏమీలేదు. తెలంగాణాంద్రలలో లెక్కకు పెద్దగా ఉన్న బదుగులు రెందు గుంపులు: మాల, మాదిగ. ఇది అందరికీ తెలిసిందే. తెన్నాట మూడు గుంపులు; పళ్లర్‌, పరయర్‌(మాల), చెక్కిలియర్‌ (మాదిగ) పళ్లర్లు కావేటికి తెళ్షణంగా మట్టుకే ఉంటారు, అందరూ తమిళులే. పరయర్హు వైగేటికి(మదురతావు) వక్కణంగా మట్టుకే ఉంటారు, నూటికి పదిమంది కూడా తెలుగువాళ్లు ఉండరు, తాంబైమందికి పైగా తమిళులే. మాదిగలు తెన్నాడు నాలుగు మూలలా పరచుకొని ఉన్నారు, అందరూ తెలుగువాళ్లే. లెక్కలో మూడుగుంపులూ దాదాపు ఒక్కటే.

పళ్లర్ల నుండీ పరయర్ల నుండీ తెన్నాట, కొమ్ములు తిరిగిన ఏలుబడి తలవరలున్నారు. తెరాట(సినీమా) పోటరు(ీరో)లున్నారు. పెద్ద పెద్ద కవరు(వ్యాపారస్తులూ కెలసరు(ఉద్యోగస్తు)లూ ఉన్నారు. వ్రాతరులయితే నూర్ల లెక్కే తెలుగు వారయిన మాదిగ కుదురు నుండి ఒక్క పేరున్న తలవరలేడు. తెరాట పోటరి కాదు నటుడే లేడు. కవరీ కెలసరీ లేనే లేరు. దివ్వెను పెట్టుకొని... కాదుకాదు దివిటీని పట్టుకొని... లేదులేదు దేబెళుకు(సెర్చ్‌ లైట్సొను వేసుకొని వెతికితే ఇద్దరే ఇద్దరు వ్రాతరులు దొరికినారు. ఒకరేమో తన కుదురునూ ఇంటిపేరునూ బయట పెట్టకూడదు అని చెప్పి కతను ఇచ్చినారు. ఇంకొకరయితే కతనే ఇవ్వననేసినారు. ఇదీ తెన్నాట తెలుగు బడుగుల నిలవరం.

ఈ కూర్పులోని “తెల్లారునా, ఎరుకపాలు, పాలవృుల్లం, అనుగొసగు, ఎరిగిన మొకం, తలుపు, చెత్తతొట్టి, కమతంగారి ఇల్లు” కతలను తమిళంలో మేలిమి(్హాసిక్‌) కతలుగా చెపుతారు.

ఈ కతలను తెలుగు చేయడంలో నేనొక దారిని ఎన్నుకొన్నాను. ఎక్కడా ఏసను వాడలేదు. దాదాపుగా ఆకిక నుడిలోనే చేసినాను. కడతరి అగవనిక(బూతకాల క్రియావాచకం)లను మట్టుకు, 'వచ్చాడు చేసాడు” అనీ కాకుందా “వచ్చినాడు చేసినాడు అనీ వాడినాను. ఇంగ్లీసు, పరో అరబిక్‌, నంనుక్రుతపుు మాటలకు మారుగా, నూటికి తాంబైపాళ్లు తెలుగుమూటలనే వాడినాను. ఆ మాటల తెల్లాలను చివర '“అ,ఆ” వరుసలో ఇచ్చున్నాను.

చివరిమాట. ఇది చిరుపూనిక మట్టుకే. తెలంగాణాంద్రల బయటి నుండి ఇటువంటివి ఎన్నో రావాలి. వచ్చి, విందెమలా వానమామలా పడమటి కనువములూ వంగకడలీ నడుమ నుండే తెలుగునేల గురించీ, ఇరవైకోట్ల తెలుగు కందువ(జాతి) గురించీ గొప్పగా చాటాలి. అందుకు ఈ చిరుపూనిక దారిని వేస్తుందని కోరుకొందాం.