పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొందరు, “'ఎందుకులెండి... పోనిద్దురూ...” అని నసిగి నసిగి ఒప్పు కొన్నారు. కొందరు, ఎంత బతిమాలినా ఒప్పుకోలేదు. కాందరు, ఎదురుతిరిగి తిట్టినారు.

వెతుకులాటలో రెండు వందల మంది వరకూ తెలుగు వ్రాతరులు దారికినారు. తెలుగు వ్రాతరులు అంటే తెలుగులో రాసినవారు అనీ కాదు, తెలుగువారు అయ్యుండీ తెలుగు తెలియక తమిళంలో రాసినవారు అని. బతిమిలాటలూ బుజ్జగింతలూ వేడుకోళ్లూ మొత్తుకోళ్లూ అన్నీ అయినాక ఈ నలబై కతల్ని ఎంచుకొని తెలుగు చేసినాను. అదేపనిగా వెతికితే ఇంతకు పదింతలమంది దొరుకుతారు.

తెలుగు వ్రాతరుల ఇంటి పేర్లను ఇద్దామనుకొన్నాను, కుదురు (కులం)ను కూడా. “కుదురూ కూటం (గోత్రం) లేనీవాండు తెలుంగువాండు ఎట్ట అవ్వ?” అని మా పెద్దలు అంటుందేవాళ్లు. ఎందుకంటే తమిళులకు ఇంటి పేరూ కూటమూ రెండూ ఉండవు. కొందరు వ్రాతరులు వీటిని బయట పెట్టడానికి ఒప్పుకోలేదు. కుదురును చెప్పకపోవడం తప్పు అనను కానీ ఇంటి పేరును చెప్పడానీకి ఏమయింది? సిగ్గా, వెరపా, పట్టనీతనమా? ఏదో తెలియదు కానీ కొందరు ఒప్పు కోలేదు. వ్రాతరులను వెతకడానికి పాటుపడినంతగా వాళ్ల ఇంటి పేర్లను తెలుసు కోవడం కోసం కూదా పాటుపడవలసి వచ్చింది.

లోపల నలబై కతలున్నాయి. తమిళకత కళ్లు తెరచినప్పటి నుండి నిన్నవెుఎన్నటి వరకూ వచ్చిన కళతలివి. అన్నిటి నీ తరివరున (కాలక్రమం)లో ఇచ్చున్నాం. తమిళ కత గురించి పై పైన కొంత చెప్పుకోవాలి మనం.

అచ్చుమర వచ్చి ఆకిక(పత్రిక)ులు వెలువడడం, ఇంగిలీసు నానుడి(సాహిత్యం)తో పొత్తు, వీటివలన మన బారతనాడులోనీ అన్ని నుడులలోనూ కత, కాత్తైన(నవల) వంటి కొంగొత్త నానుడి మొదలయింది. తెలుగులో తొలికత 1879లో వచ్చింది. అయితే నిండుగా కత ఆలుడి(లక్షణం)తో వచ్చిందిగా 1910లో వచ్చిన “దిద్దుబాటును ఎక్కువమంది గుర్తిస్తున్నారు.

అట్లాగే తమిళంలో తొలికత 1905లో వచ్చిన తులసీబాయి. రాసినవారు మహాకవి సుబ్రమణ్య బారతి. వీరే 1906లో 'ఆరిల్‌ ఒరు పంగు (ఆరులో ఒక వంతును రాసినారు. 1807లో వ.వే.సు. అయ్యర్‌ 'మంగయర్మరసి కాదల్‌ కతను రాసినారు. వీటి మూడింటినీ నిండు కతలుగా పేర్మ్కొనరు తమిళులు. 1908లో అయ్యరుగారే రాసిన “'కుళత్తంగరై అరసమరం చెన్నకదై (గుంటకట్ట రావిమాను చెప్పిన కత)ను తొలి నిండు కతగా పేరుకాంటారు.

1905 నుండి 1925 వరకూ ఉన్న తరిని తమిళకతకు బుడిబుడి నడకల తరిగా చెబుతారు. ఈ తరిలో కతను అడుగులు వేయించింది ముగ్గురు. సుబ్రమణ్య బారతి, వ.వే.సు. అయ్యర్‌, అ. మాదవయ్య. ఈ ముగ్గురిలో అయ్యరూ మాదవయ్యా తెలుగువాళ్లు. ఈ కూర్పు (సంకలనం)లో అయ్యరు కత ఉంది.

1930 నుండి 'మణికొడి” తరి మొదలయింది. మణికొడి అనేది ఒక ఆకిక పేరు ముప్పయ్యవ పదికంలో తమిళకత అడుగులు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఈ జనవరి-2022 |

కుదురుగా పడడమే కాదు, వడిని నేర్చుకొన్నాయి కూదా. మణికొడి ముమ్మూర్తులుగా పేరు గడించినవారు; కు.ప. రాజగోపాలన్‌, న.పిచ్చమూర్తి, పుదుమైపిత్తన్‌లు. వీరిలో తొలి ఇద్దరూ తెలుగు వాళ్లు. వీళ్ల ముగ్గుర్నీ కూడా తమిళ కతకుల్లో మేటరులు(మాస్టర్స్‌)గా చెబుతారు. ఈ పదికం(దశకం)లో రాయడం మొదలు పెట్టినవారు ఇరవైమంది వరకూ ఉన్నారు. వాళ్లలో బాగా పేరు గడించినవారు పదిమందికి తగ్గరు. వీళ్లలో, మూడు వందలకు పైగా కతల్ని రాసిన బి.ఎస్‌. రామయ్య, క.న. సుబ్రమణ్యం, పి.జి. సుందరరాజన్‌, రాజాజీ, అన్నాదొరలు తెలుగువాళ్లు. మిగిలినవాళ్లలో అందరూ తమిళులే అయుండకపోవచ్చు. వెతికితే ఇంకా కొందరు తెలుగువాళ్లు ఉందవచ్చు.

నలబయ్యవ పదికంలో కతలను మొదలిడి పేరు గడించిన వారిలో లా.సా. రామామృతం, కరిచ్చానకుంజు, ము. కరుణానిదిలు తెలుగువాళ్లు. లా.సా.రా. రాసిన “అమ్ములు కత తమిళ మేలిమి (క్లాసిక్‌) కతలలో ఒకటి. ఈ తరివాదే అయిన టి. జానకిరామన్‌, ఆర్‌. వెంకటరామన్‌, సి. రగునాదన్‌లలో తెలుగువారు ఉన్నారేమో తెలియదు.

ఏబయ్యవ పదికం నుండి తమిళకత పరుగులు పెట్టింది. ఈ పదికంలో కతలను మొదలిడిన ఇద్దరికి ఆ తరువాత జ్ఞానవీట పోణిమి దొరికింది. అకిలన్‌, జెయకాంతన్‌లు వాళ్లు. ఈ ఇద్దరూ తమిళులే. ఈ తరికి చెందిన గొప్ప దబ్రాతరులలో సుందర రామస్వామి, నా. పార్టసారది, ఇంద్రా పార్ధసారది కూడా ఉన్నారు. వీరి నుడి ఏమిటో తెలియదు. ఈ తరిలోనీ మరొక మేటరి జి.అళగిరిసామి తెలుగు వారు. వీర '“అన్నళిప్పు (అనుగొసగు” కత తమిళ మేలిమి కతలలో ఒకటి. ఇది ఈ కూర్పులో ఉంది.

అరవయ్యక పదికం నుండి ఇప్పటివరకు నూరారుమంది తెలుగువాళ్లు వ్రాతరులు అయి ఉంటారు. ఈ తరి నుండి వెతకడం చిన్నపని కాదు. కరడుగట్టిన తమిళదనంలో ఇరుక్కుపోంబన తెలుగువాళ్లు, తమ నుడివునికికి పాతర వేసేసినారు. ఈ తరిలోనే 'నెలవునుడి తాత (మాందలిక పితామహుడు)” కి.రాజనారాయణన్‌ దూసుకొని వచ్చినారు. తెలుగువారయిన కీరా రాకతో తమిళ నానుడి లోకం, అదివరకు ఎన్నడూ ఎరుగని తెలుగు కలిసిన కొత్తనెత్తావి తమిళాన్ని చవిగొని పులకరించిపోయింది. కీరా అడుగుజాడల్లో నడచి నల్లరేగడి బతుకులను తమిళులకు అందించి పేరు గడించిన ప.జయప్రకాశం కూడా తెలుగువాదే.

తమిళంలో తొలినుండీ మగవారికి తీసిపోకుండా ఆడవారు కూడా కతలను వెలువరించినారు. 1905-06లోనే చేవ్చ తాయారమ్మ అనే తెలుగావిడ కాన్ని కతల్ని రాసినట్లు తెలుస్తున్నది. కానీ అవేవీ దొరకలేదు. ఇరవయ్యవ పదికంలో "కోదై నాయకి అమ్మాళ్‌ (గోదానాయకి అమ్మ)” తమిళ నానుడి నింగిలో తళుక్కున మెరిసినారు. గోదానాయకమ్మ, గాందీగారి అడుగుజాడల్లో నడచి, ఆనిడి(స్వతంత్ర) పోరాటంలో చురుగ్గా పాలుగొని చెరసాలకు వెళ్లినారు. ఆడవారు చదువుకొని ఎదగాలనీ, అయితే పాటిడిగా వస్తున్న కుటుంబవిలువలను విడువరాదనీ వీరి కతలు చెబుతాయి.