పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుబడినీ వదిలేసినా తెలుగు రాతలను చెరిపేసుకొన్నాా ఇంటి పేరును విడిచేసినాా కూటం(గోత్రం)ను మరుగు చేసుకొన్నా మెడలో తెలుగుతాళికి మారుగా తమిళ పుస్తెను కట్టుకొన్నాా చివరకు ఇంట్లో కూదా తెలుగును వదిలేసినా సరే, ఇప్పుడు కుదురును (కులం) వెతికి వట్టుకాని “తెలుగు కుక్కా బయటకు పో” అంటున్నారు. గుప్పెడుమంది తెలుగు పెద్దలు చేసిన తప్పుడు పనికి కోట్లమంది ఇక్కట్ల పాలయినారు. ఆ తెలుగు పెద్దలు తెలుగుకు కీడు చేసినారు కానీ తమిళానీకి మువ్వీసమయినా ముప్పును తలపెట్టలేదు. పైగా తమది కానీ తమిళాన్ని పనిగట్టుకొని పెంచినారు.

ఓ ఇరవైయేళ్లుగా తెన్నాడులో తెలుగువారి మీద కొంగొత్త తెగబాటు(దౌర్దన్యం) మొదలయి కొనసాగుతున్నది. దీనిని మొదలు పెట్టింది 'తని తమిళ్‌ సేనై' అనే తట్టువం. కొనసాగిస్తున్నది “నామ్‌ తమిళర్‌ అనే తట్టువం. పగలూ రేయీ తెలుగు వాళ్లను తిట్టదమూ తెగడడవే వీరి పని. (కిష్టదేవరాయల తరిలో వలసవచ్చిన తెలుగువాళ్లు, తమిళులకూ తమిళనుడికీ పెద్దకీడు తలపెట్టేసినారు, తమిళాన్ని రాచిరంపాన పెట్టేసినారు అన్నది వీరి పెనగువ. ఇందులో రెండు పెద్ద పొల్లు మాటలున్నాయి. తెన్నాటి తెలుగువారందరూ కిష్ణదేవరాయల తరిలో వలస వచ్చినారు అన్నది ఒక పొల్లుమాట. ఈ నేలమీద తమిళులెంత పాతవారో అంతే పాతవారు తెలుగువారు కూదా. ఈ మెలన(చరిత్రనంతా చెప్పాలంటే ఈ మున్నుడి చాలదు. రెండువేల ఏళ్లనాదే సాతవాహన తెలుగుదొరల ఏలుబడి కావేరి వరకూ సాగింది. పలనాడు నుండి వచ్చిన పల్లవ దొరలు పదిహేను వందలేళ్ల కిందట కంచి నగరాన్ని కట్టించినారు. రేనాడు తావు నుండి వచ్చిన చోళులు పదమూడు వందలేళ్ల కిందట దనంజయూరును కట్టించినారు. అదే ఇప్పటి తంజువూరు. అప్పటికే ఈ తావునున్న తెలుగువారినీ తమిళులనూ కలుపుకొని ఇక్కడ సాగునేలను 'పెంఛినారు, సాగుబాటునూ పెంచఛినారు. తెలుగువాళ్లు తమిళాన్నీ తొల్కేసినారన్న రెండో పొల్గుమాట అయితే పెద్ద తప్పుడు కూత. వేలయేళ్లుగా తెలుగుకంటే మిన్నగా తమిళాన్నీ పెంచింది తెలుగువాళ్లే. ఇప్పుడు తమిళులు చేస్తున్న 'పెనగువను వింటుంటే అచ్చెరువు కలుగుతుంది. తెన్నాట తెలుగు సాగుబాటు అంతా తమిళం పేరుతో అలాగే ఉందాలి. తెలుగువాళ్లు మట్టుకు ఉందకూడదు. అంటే, దేవరాట ఉందాలి, దానీనీ ఆదే ఏకిలివారు

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

స.వెం.రమేశ్‌ కథల మీడ నీలవేణి రాసిన పరిశోధనా (గ్రంథాన్ని పేట శ్రీనివాసులురెడ్డి

రమేశ్‌కి అందబేసి సత్మరించడం ఈ సభలో చోటుచేసుకున్న ఇత విశేషం

ఉండకూడదు. తంజావూరు చోవులు ఉందాలి, వాటినీ గీసే జీనుగార్లు ఉండ కూడదు. ఇదీ వారి పెనగువ. వండుకొన్న కూడూ, ఒంటిమీది గుడ్డా కుండా చట్టీ కొంపాగోడూ, పిల్లామేకా అన్నిటినీ చివరకు ఆటాపాటలను కూడా వాళ్లకే ఇచ్చేసి మొండిమొలతో ఎక్కడికో వెల్లిపోవాలట తెలుగువాళ్లంతా.

1860-70ల వరకూ తెన్నాట గొప్పగా వెలిగింది తెలుగు. అప్పుడు ఈ చోటున ఏలుబడి నుడి తెలుగు, బడినుడి తెలుగు, ఎసనుడి తెలుగు, ఒక్క గుడినుడిగా మట్టుకు సంసుక్రుతం ఉండేది. తమిళులు వాళ్లు అమ్మనుడిని ఇంట్లో నుడువుకాని తెరువుకు వచ్చినపుడు తెలుగునే పలికేవాళ్స్లు. సరిగ్గా నూరేళ్లకు లోపల్నే ఈ నిలవరం(పరిస్తితి) తిరగబడింది. ఇప్పుడు బడీ గుడీ ఏలుబడీ అన్నిచోట్లా అరవమే. “ఎంగుం తమిళ్‌ ఎదిలుం తమిళ్‌ (అంతా తమిళం, అన్నిటా తమిళం) అనీ చెలరేగిఫోయింది. వడిగా వచ్చి ముంచెత్తిన ఈ వెల్లువలో ఊపిరి ఆడలేదు తెలుగువాళ్లకు. కదకు తల్లీవిద్దా కూదా కడపను దాటి బయటకు వస్తే తమిళాన్నేనుడువుకొనే నీలవరం వచ్చేసింది. సంసుక్రుత ఎదిరింపు, హిందీ ఎదిరింపు ఎసపు (ఉద్యమం)లలో తమిళం కాళ్లకింద నలిగిపోయింది తెలుగే.

1870 దాటినాక ముందుగా తెలుగు పారులు(బ్రాహ్మణులు) తమిళబడికి వెళ్లదం మొదలిడినారు. వారి వెనుక మెల్లమెల్లగా మిగిలిన కుదురులవారూ అడుగులు వేసినారు. చివరకు హోసూరు, దెంకణికోట, పల్లిపట్టు, గుమ్మడిపూడి తావుల్లో మట్టుకే ఆరువందల తెలుగుబడులు మిగిలినాయి. జయలలితమ్మ పోతూపోతూ వాటిని కూడా పొట్టన పెట్టుకొనీపోయింది.

ఇదీ మా వెత. కతలఫొత్తానీకి మున్నుడి రాస్తూ ఈ సోదంతా ఎందుకంటారా? కతలకు ముందో పాటలకు ముందో కాకుండా విడిగా చెపితే మీరు వినదేమో అని చిన్న బెరుకు, కతలమీది ముక్కువతో అయినా ఈ నాలుగు మాటల్ని వింటారు కదా అని చిన్న ఆబ.

ఇక ఈ నోయి(గ్రందం) గురించి కొంచెం ముచ్చటించుకొందాం. మొదలిడినప్పటి నుండీ ముగించేవరకూ మూడేళ్లు పట్టింది. ఈ పనికి, తెలుగు (వాతరు(రచయితులను గుర్తించడమే పెద్ద పనీ అయింది. గుర్తించినవారిలో బతికున్నవారినీ ఒప్పించడం ఇంకా పెద్దపని అయింది. కొందరు, ఎలమీతో గబుక్కున ఒప్పు కొన్నారు.