పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1953లో మదరాసును వదలి పారిపోయినారు. వెనుకముందులుగా తెన్నాటి తెలుగు పెద్దలు అరవకాళ్లను నాకుతూ సాక్షి మురిసిపోయినారు. ఆ మురిపెమే ఈ తావుకు తమిళనాడనే పేరును తెచ్చి పెట్టింది. ఆ మురిపెమే వేల తెలుగు తరగతులకు తాళాలను వేయించింది. ఆ వఎరిపెవే అడుగడుగునా అణువణువునా ఈ నేలంతా నిండివుందే తెలుగు సాగుబాటు(సంస్కృతి)ని తమిళ సాగుబాటుగా చాటింది. తెలుగుదడీ తమిళందీ విడివిడి సాగుబాటులు ఏం ఉంటాయంటారా? వినీపిస్తాను వినండి. ఈ నేలన తొలి గుడినీ కట్టించింది తెలుగువాళ్లు తాలి నగరాన్ని ఏర్పర చింది తెలుగువాళ్లు; నూర్లవేల చిన్నాపెద్దా గుళ్లనూ గోపురాలనూ నిలిపింది తెలుగువాళ్లు; తంజావూరు చోవులు (ుత్రాలు) తళుదాల పావులు (కాయ్యబొమ్మలు) కంచి, ఆరణి పట్టుకోకలు; మహాబలిపురం రాతిబొమ్మలు; బండి పాళెం మట్టిబొమ్మలు; వెలగచేరి కాలువు బొమ్మలు; పంటరొద్ది గుర్రంబొమ్మలు; తంజావూరు కులుకుబొమ్మలు; తంజావూరు అతుకు (ఆప్లిక్‌) గుడ్డలు; బవాని కంబళ్లూ జమకాళాలు: లచ్చిగుడి కంచుదివ్వెలు; జల్లికట్టు; పొంగలి పండుగ; కుచ్చులెద్ద్భులు; గంగెద్చులు) బూమెద్చులు; సలిగెద్చులు; కాంగేయం గిత్తలు; తంజావూరు బాగవతాలు్యు చోళనాటి చెక్కపుల్లలాట్స కొంగునాటి యక్షగానం తొందనాటి తెరువాటలూ బారతం ఆటలు; తగుడూరు బయలాటలు; మొరసు నాటి శేళికలు; పాందెనాటి విల్లుపాట; దేవరాట్స సేవాట, జిక్కాట, జింప లాట, కోలాట, పడుకాసియాట, వీరకాసియాట వంటి నూటికిపైగా పల్లె కళలు పదుల లెక్కలోనీ అలమరి (సంచార) తెగలు ఒక్కొక్క తెగకూ ఒక్కొక్క చిందాట; ఒక్కాళ్మ తెగ నోళ్లలో నూర్లనూర్ల అవ్పటపు తెలుగు మాటలు: రుక్ళిణీదేవి అరుందేల్‌ “భరతనాట్యం?” అనీ పేరు పెట్టేసిన దాసియాట, సదిరాటల్సు గుళ్లూ ఇళ్లూ ఆనకట్టలూ గాలిగోపురాలూ కట్టే ఒడ్డరులు; చెరువులూ బావులూ కాలువలూ తవ్వి పొలాలకు నీళ్లను అందించే మున్నీరు కాపులు కపిలబాన, తొండం, చెప్పులు, పలక(దప్పు), మద్దెల, డోలు వంటి పనీముట్లకూ ఎస(సంగీతం) ముట్లకూ తోలును తోమంచేసి అందించే మాదిగలు; ఉసురు ఎగిరిపోయి మన్నులో

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |


ఈ ఎసపుకు



మన్నుగానో మంటలో మంటగానో కలిసిపోయే పీనుగకు కడవరకు కాపుండే కాటికాపర్లు... ఎంతనీ చెప్పమంటారు తెన్నాటి తెలుగు సాగుబాటును! చెపుతూ ఉంటే వినదానీకి మీకు నాళ్లు చాలవు. ఏళ్లు కావాలి.

వాళ్లను చెప్పమనండి. లేదంటే మీరెవరయినా అరపి(శోదించి) చెప్పండి చూద్దాం! ఇందులో పదోవంతు సాగుబాటు తమిళులకు ఉందేమో! లేనప్పుడు ఇది తమిళనేల ఎందుకవుతుంది? అంత పెద్దమాట వద్దనుకొన్నాా తమిళనేల మట్టుకే ఎందుకవుతుంది? తెలుగూ తమిళమూ కలగలసిన 'తెన్నాడు” ఎందుకు కాకూడదు?

వేలయేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే తొండ, చోళ, కొంగు, పాందె అనే నాలుగు పెద్ద నాడులూ, నాంజిల్స్‌ కుడ, తగుడూరు, మొరసు అనే నాలుగు చిన్న ముక్కలూ... ఇదీ ఈ తావు. వీటన్నిటినీ తలగలిపి కుట్టేసి, 1969లో “తమిళ్‌నాడు” అని పేరు పెట్టేసినారు. ఎవర్ని అడిగి ఈ పేరును పెట్టినారు? ఎవర్ని అడిగుందాలి అంటారా? తమిళులతో సరిలెక్కలో, ఆమాటకొస్తే కాసంత ఎక్కువే ఉందే తెలుగువాళ్లను అడిగుందాలి. తక్కువంటే నూరుమంది తెలుగువాళ్లను చట్ట మేనరులు (శాసనసభ్యులు)గా ఎన్నికచేసి, వాళ్లనడిగి పేరును మార్చి ఉందాలి. అడ్డదిద్సపు ఎమక దిడ్దెమక దొరతనాలు, పోటీ చేయదానికయినా తెలుగువాళ్లకు తావు ఇస్తే కదా!

ఏ ఎవుక తట్టువం(పార్టీ) అయినా తలవరగా మట్టుకు తెలుగువాడు ఉంటాడు. ఆ తలవరకు అప్పటికే తమిళ తగులం (వ్యామోహం) బాగా తలకెళ్మేసి ఉంటుంది. మిగిలిన మేనరులంతా తమిళులే ఉంటారు. వాళ్ల మెరమెచ్చుల కోసం, గద్దెనెళ్కడం కోసం తెలుగుకు పాతర వేసేనినారు ఆ తలవరులు. చక్రవర్తుల రాజగోపాలాచారి (తెలుగు అయ్యంగారు) పెద్దాయన రామసామి నాయుడు (గాజుల బలిజ్క కంజీవరం అన్నాదొర (జోగం బలిజు, మువ్వ కరుణానిది (బోగం బలిజ), వైగో అనబడే వులిపాటి గోపాలసామి నాయుడు (కమ్మ), విజయకాంత్‌ (బలిజ)... ఈ తలవరులందరూ తెలుగును తొళ్కేసిన తెలుగువాళ్తే.

తమిళం తమిళం అంటూ తమిళుల్ని రెచ్చగొట్టి గద్దెనెక్కిన తెలుగు పెద్దల మురిపెం కూడా మూడునాళ్ల ముచ్చటే అయింది.