పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశ్చర్యమేమిటంటే, ఫొలాల నీందా టన్నుల కొద్దీ ఇనవు చిట్టెపు రాళ్లు. ఇనుపయుగంలో ఈ ముడిరాళ్లను పొడిగొట్టి, కరిగించి, మలినాల్ని తొలగించి, ఆ కరిగిన ద్రవంతో తమకు కావలసిన పనీముట్లు, పరికరాలు, ఆయుధాలను తయారు చేసుకొన్న సాక్ష్యాలు ఎన్నో కనిపించాయి. ఆనవాళ్ల నేపథ్యంలో నాకు నేను, ఆదిమ మానవునిగా ఊహించుకొని, ఆనాటి వాతావరణంలో కొంత సేపు గడిపి, ఒకరైతు అందించిన కందికాయలు అందుకొంటూ, మళ్లీ ఈ లోకంలోకొచ్చాను.

పెద్దగట్టు నుంచి ఉన్న బళ్లబాటను బాగుజేసి, వీటీరోడ్డు వేస్తే దేవరచలకు ఆహ్ల్హావకర పర్యావరణహిత పర్యాటక స్థావరమౌతుంది. సాగర్‌ సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుంది. నడవటం కొంచెం కష్టమేగానీ, పరిసరాల అందచందాల నడుమ జాలు వాదే జలపాతం చిరుజల్లుల్లో తడిచినపుడు కలిగే అనుభూతిని ఎవరికి వారు సొంతం చేసుకోవాల్సిందే.

ఈ గాలింపు ఇంతటితో ఆగలేదు. తెలంగాణ పర్యాటకాఖివృద్ధి సంస్థ నాగార్జునసాగర్‌ వద్ద అభివృద్ది చేసిన బుద్దవనం చుట్టూ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఒక నడక దారినీ ఏర్పాటు చేశారు. ఆదారిలో వేసే ప్రతి అడుగూ, ఆనందాశ్చర్యాల్ని కలిగిస్తుంది. కనుచూపు మేరలో ఆకట్టుకొని కనీకట్టుచేసే ప్రకృతి అందచందాలు,

(ఎ


బుద్దవనంలో ఆదిమానవునీి ఆనవాళ్లు

సువిశాల జలాశయపు అంచుల కవ్వింపులూ, నీటి మథ్యలో నున్న దీవులు, నదక ముందుకు సాగే కొద్దీ విసిఫ్సితటే పక్షుల కిలకిల | తెలుగుజాతి పత్రిక జువ్వునుడె ఈ బనవరి-2022 |

రావాలు, మష్టైమరపించే ఆహ్లాదకర పరిమళాలు, తెల్లటి పాల నురగల్లాంటి మేఘాలపైన నీలి ఆకాశం, ఇలా మరో లోకంలో విహరిన్వ్తున్నామా అన్న అనుభఖూతికిలోనాతావమునటంలో అతిశయోక్తిలేదు. మా అడుగులు ముందుకు సాగుతున్నాయి. కీచురాళ్ల రణగొణ ధ్వనుల మధ్య రాళ్లపైన ఒక్కో అడుగేసుకొంటూ, నేను, సుధన్‌రెడ్డిగారు, శ్యాంసుందర్‌, నరసింహారావు గంభీరంగా శ్వాస తీసుకొంటూ పోతున్నాం మమ్మల్ని ఒక రాతి బండపైన కొత్త రాతియుగవు గుంటలు ఆపేశాయి.

అవి రాతిగొడ్డళ్లను పదును తేలేలా మొనల్ని అరగదీయగా, అరగదీయగా, ఏర్పడిన గుంటలు. జంతువుల్ని తరిమి కొట్టడానికి విసిరేసే ఒడిసెల తయారీలో భాగంగా, రాళ్లను గుండ్రంగా కొట్టు కొంటూ అరగదీసిన గుంటలు, పక్కనే దొరికిన నల్లశాసనపు రాతిలో తీర్చిదిద్దిన పదును దేలిన కొత్త రాతియుగపు గొడ్డలి మమ్మల్ని కదలకుండా కట్టిపదేశాయి. ముందుకెళ్లిన కొద్దీ మరిన్ని

ఆనవాళ్లు. ఊహించని ఈ ఆనవాళ్లు, మల్లేపల్లి లక్ష్మయ్య గారి కళ్లల్లో కాంతుల్ని మెరిపించాయి. మమ్మల్ని కూడా మురిపించాయి. ఎవుడో ఎనిమిదేళ్ల క్రితం రిటైరైన నాకు మళ్లీ పురావస్తుశాఖలో - య



చాకలిగట్టుపై కొత్తరాతియుగపు ఆనవాళ్లు

ఉద్యోగం చేస్తున్నానా అన్న (భ్రాంతి కలిగింది.

ఆ ఆనందాలు మమ్మల్ని కృష్ణానది మధ్యలో నాగార్జునకొండ పక్కనే ఒక కిలోమీటరు దూరంలో ఉన్న చాకలిగట్టు వైపు మళ్లించాయి. మాతోపాటు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్‌, బుద్దవనం అధికారులు మల్లేపల్లి లక్ష్మయ్య, సుధన్‌రెడ్డి, శ్రాంతిబాబు, శ్య్వాంసుందర్‌ల బృందం ఓ గంటపాటు నీటి అలల స్వాగతాల మధ్య గూటి పడవ ప్రయాణం. పడవ దిగిన తరువాత ముళ్లపాదల మధ్య నుంచి సాగిన మా నడక ఒక పెద్ద బండపై ఆగింది. అక్కడ మళ్లీ మా ఆనందం వెల్లివిరిసింది.

కొత్త రాతియుగపు ఆనవాళ్లు మమ్మల్ని కేరింతలు కొట్టించాయి. పావురాలగుట్టలో మొదలై, దేవరచలలో సాగిన సందడి, చాకలిగట్టు విప్పిన ఆదిమ మానవుని గుట్టుతో మా ప్రయాణం ముగిసింది. ఒకనాటి చరిత్ర కాలనాళికై కళ్లముందు కదలాడింది. ఒక మెరుపు మెరిసిపోయింది.