పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అడుగును తెలంగాణలో వేనినట్లు తెలిపే ఆనవాళ్ల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ఎడమవైపున ఎగువ తీరంలో నేను జరిపిన విస్తృత గాలింపులో ఆదిమ మానవుని అడుగు జాడలు అనేకం వెలుగు చూశాయి.

బుద్ధవనం ఓఎస్టీ నుధనరెడ్డి, నరసింహారావు, నేను, పెద అడిశర్లపల్లి మండలంలోని పుట్టంగండి ఎత్తిపోతల పథకం చేరుకున్నాం. దాదాపు 200 అడుగుల లోతు నుంచి మరో 300 అడుగుల ఎత్తుకు నీటినీ తోడి పోస్తున్న మోటార్లను మొక్కాలనీ పించింది. వళ్మనున్న పావురాళ్లగుట్ట దగ్గర పాత రాతియుగవు మానవుడు నీవసించిన కొండ చరియ ఆవాసాలు, అక్కదున్న క్వార్డెటు రాతి బండలపైన, నదీ తీరంలోనూ, చుట్టు పక్కల పొలాలు, అదవుల్లో కోకొల్లలుగా పడివున్న రాతి గొడ్డళ్లు, కాత్తరాతియుగంలో పనిముట్లను అరగదీసిన గుంటలు, ఈనాటికీ చెళ్ళు చెదరకుంద ఉండటం ఆశ్చర్వాన్నీ కలిగించాయి. క్వార్డైటు మ్రైనీంగ్‌ కార్యకలాపాలు ప్రారంభం కాకమునుపే ఈ ఆనవాళ్లను శాస్ర్తీయ పద్దతుల్లో నమోదు చేసుకొని భద్రపరచుకోకపోతే చరిత్ర చెరిగి ఫోతుందనిపించింది. పచ్చటి ప్రకృతి, జంతువుల వేటకు అనువు, నీటివసతి, పరికరాల తయారీకి ముడినరుకు పుష్కలంగా ఉండి ఆది మానవునికి న్వర్ణతుల్యంగా ఉన్న పావురాళ్లగుట్ట సందర్శన తరువాత మా ప్రయాణం పెద్దగట్టు వైపు సాగింది. పావురాళ్ల గుట్టలో క్వార్దెటు రాతి గుట్టల్ని మాకు చూవించిన గోనంగి సైదులు ఆదరణ, ఆప్వాయతలు మరువలేనివి.


పెదఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టు ఆదిమానవుని మరో ఆవాసం. పొలాల నిండా, పాతరాతియుగపు ఆనవాళ్లే. కృష్ణానది తీరాన గల దేవరచల అనే లోయ, నాటి నాగరికతకు ఆనవాలు. దేవరచల అన్న ప్రదేశంలో భూమి ఉపరితలంనుంచి దాదాపు 200 అడుగుల లోతున్న లోయ, ప్రాకృతిక సౌందర్యానికి నెలవు. పైనుంచి 100 అడుగుల దిగువన గల ఆదిమ మానవునీ గుహ పైనుంచి నీరంతరం తెరలు తెరలుగా జాలువారే వానజల్లు లాంటి జలపాతం ఆలోయ అందాన్నీ మరింత ఇనుమడింప చేస్తుంది.

తెలుగుజాతీ పత్రిక జవ్సునుతి ఉ జనవరి-2022 |


'

దేవరచల ఆదిమ మానవుని గుహ


అంచెలంచెలుగా ఉన్న ఈ గుహలు, పాత, మధ్య, కొత్త రాతియుగాల్లో నాటి మానవుల ఆవాసాలుగా ఉందేవని, కాండ చరియలపైన రాళ్లలో చెక్కుకొన్న గుర్తులు, పైన దొరికిన రాతి పనీముట్లు రుజువు చేస్తున్నాయి. ఇక్కదే ఒక వంక, వాగుగా మారి, కృష్ణానదిని చేదే తీరు వర్ణనాతీతం.

స్థానిక రైతుల సాయంతో దేవరచల పరిసర ఫొలాలు, జలపాతం కుదుట్లో జరిపిన పరిశోధనల్లో, పాతరాతి గొడ్డళ్లు మధ్యరాతియుగపు

ల్లేద్లు

సన్నటి బ్లేర్సు కాత్తరాతియుగపు గొడ్డళ్లు లెక్కనేనన్ని కనిపించాయి.