పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురించి అరగంటసేపు చెప్పారు. ఈ విషయాలు పిల్లలకు అర్థంకాలేదు. విసుగుపుట్టింది. కొందరికి ఆవలింతలు వచ్చాయి. కొంతమంది తూగారు. పులి సింహం పిల్లలైతే గుర్రుపెట్టి నిద్రపోయారు.

మొదటిరోజు పాఠం “నరిగమలుూ చెప్పారు. పిల్లల చేత సరిగమలు పలికించారు. పిల్లలంతా సరిగమ అంటూ గొంతెత్తి అరిచారు. ఆ (ప్రాంతమంతా ఒక విచితమ్రైన శబ్బంతో (ప్రతిధ్వనించింది. గుర్రుపెట్టి నీద్రపోతున్న సింహం పులిపిల్లలు దడునుకొని నిద్రవేలుకొనీ పరుగుదీసాయి. ఎదైనా ప్రమాదం జరిగిందేమోనని తల్లితండ్రులు పరుగెత్తుకాంటూ బడి దగ్గరకాచ్చారు. అది సంగీతమని తెలిసి నవ్వకాంటూ వెళ్లారు.

మరో నాలుగురోజుల్లో ఉపాధ్యాయులంతా తమ పాఠాలు మొదలుపెట్టారు. పిల్లలకు ఒక్కటీ అర్ధంగావడంలేదు. పాఠాలు వినలేక కంఠత పెట్టలేక అర్ధంగాక పిచ్చిపట్టినట్టెంది. ఆటల్లేవు. మాటల్లేవు. తల్గులంతా బలవంతంగా పిల్లల్ని ఈడ్చుకొని వచ్చి బడిలో వదిలివెళుతున్నారు. పిల్లల ఒంటిమీద దెబ్బలు పులిచారల్లా వాతలు పడుతున్నాయి.

పిల్లల పరిస్థితులు ఇలా ఉంటే తల్లుల పరిస్థితి మరో రకంగా ఉంది. బోలెడంత తీరిక దొరికింది కదా! మనుషుల దగ్గర పెరిగిన "పెంపుడు జంతువులు, పెంపుడు పక్షులు మనుషుల గురించి వింతలు విదర్దారాలు చెబుతూ ఉంటే వింటూ కాలన్నేపం చేయడం అలవాటయింది.

కబుర్లు ఎక్కువై ఇక్కడ సంగతుల అక్కడ, అక్కడి సంగతులు ఇక్కడ చెప్పి తగువులు పెట్టి తమాషాలు చూసే అమ్మలక్కలు తయారయ్యారు. ఒక రోజు కాకికీ కోకిలకూ తగువుపడింది.

కాకి గొంతు కర్ణకతోరంగా ఉంటుందనీ కాకి గోల భరించడం కష్టమనీ కోకిల అన్నట్లు కాకి చెవిన పడింది. కాకి కోపంతో ఊగిపోయింది. “ఒసే కోకిలా! నీది కూదా ఒక (బతుకేనా? నీకు ఒక ఇల్లంటూ ఉందా? ఎప్పుడైనా వీడ్డల్ని పెంచావా? నీదంతా దొంగ బతుకు. పసిబిడ్డల్ని పెంచడం చేతగాక పరాయి గూట్లో గుడ్డు పెట్టి అల్లాయి పాటలు పాడుకుంటూ తిరుగుతావు. అలాంటి నువ్వు నన్ను వేలెత్తి చూపిస్తున్నావ్‌. నీకెన్ని గుండెలు. నీ వీడ్డలు ఎంత దుర్మార్డులో చెప్పాలా, నీ పిల్ల గుద్దులోంచి బయటకు రాగానే మా గుడ్లను పిల్లల్ని గూట్నోనుంచి బయటకు తోసేస్తుంది మేము తెచ్చిన తిండి ఒక్కటే మింగుతుంది. మేము మా బిడ్డలేగాదా అనే భ్రమలో ఉంటాం. పెద్దదై ఈకలు వచ్చి ఎగిరిపోయేదాకా అర్హంగాదు. మీలాంటి సోమరిపోతులు ఇతరుల కష్టంమీద అధారపడి బ్రతికేవాళ్లు మనుషుల్లో ఉంటారు. మాలో ఎవరికి కష్టమొచ్చినా అంతా ఒకటై అరుస్తాం. గోలచేస్తాం. మమ్మల్ని మేము కాపాడుకొంటాం. ఇదికూడా తప్పేనా అంటూ” కాకి బాధపడింది.

మరీ అంత నోరు పారేసుకోకు. చనీఫోయిన మనుషులకు పెట్టే పిందాకూడు తిని బతికే మీదీ ఒక బ్రతుకేనా? మీరు నోరు తెరిస్తే మనుషులు చెవులు మూసుకొంటారు. మేము గొంతెత్తి పాదగానే మనుషులు మాతో గొంతు కలిపిపాదతారు. మా పాటలకు చెట్లు చిగురిస్తాయి. అని గొప్పలు పోయింది కోకిల.

కూతలు కూసే మీకు ఏమి తెలుసే ప్రాణుల్లో ఉందే పరమార్థం. మనుషులు చనీపోయిన తమ తాతలతంద్రుల ఆత్మలు తృప్తి

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

పరచడానికి వారికి ఇష్టమైన రుచికరమైన పదార్థాలు వండి పెడతారు. మమ్మల్ని పిలిచి తినమంటారు. వారు పెట్టినవి తిని వారిని తృప్తి వరుస్తాం. మేము తినకపోతే వారు పదే బాధ వర్ణనాతీతం. ఎదుటివారి గొవృతనం తెలునుకోలేని మీ అజ్ఞానానికి జాలిపడుతున్నాను” అనీ కాకి బాధగా అన్నది. కాకి మాటలు విన్న అమ్మలక్కలంతా నీజమే నిజవేనంటూ అరిచారు. కోకిలను మందలించారు. కోకిల తలదించుకొని తప్పయిపోయిందక్కా అంటూ గుర్లనీందడా నీరు నీంపుకొంది. “ఇంకచాలు పదండి” అంటూ అడవి కోడి అరిచింది. అందరూ ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు.

మరోరోజు గబ్బిలానికి గుద్దగూబకి తగువు పడింది. మాటల సందర్భంలో గుద్లగూబ గవ్బీలం గురించి నక్కను అడిగిన ప్రశ్న తగువుకు కారణమయింది. “గబ్బిలం జంతువులా విల్లల్ని కనీ పాలిస్తుంది. పక్షిలా రెక్కలతో ఎగురుతుంది. ఇంతకూ గట్బిలానిది ఏ జాతి? అనీ ప్రశ్నించింది.

ఈ మాటలు విన్న గప్స్బీలానికి కోపం వచ్చింది. ఇంతకూ తమది ఏజాతి? పక్షులన్నీ పగలు తిరుగుతాయి. తమరు విషప్పురుగుల్లా 'క్రూరమృగాల్లా రాత్రులు చీకట్లో తిరుగుతారు అని దెప్పిపొడిచింది గవ్బీలం.

నువ్వుకూడా రాత్రుళ్లేగదా తిరుగుతావు. నన్ను తప్పుపట్టడం ఎందుకు? నా కంద్లకు రాత్రులు చూడగలిగే శక్తి ఉంది. చీకటిని సైతం చీల్చుకొంటూ వెళ్లగలను. నీన్ను గురించి అందరికీ సందేహమే. అసలు నీకు కళ్లు కూదా లేవటగదా! అందుకనే కళ్లు లేని కటోది అని లోకంలో ఒక నానుడి ఉంది అన్నది గడ్లగూబ.

గబ్బిలానికి కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలీ నాజాతి గురించి. నేను జంతువుని. అసలు నీకో విషయం తెలుసా? పక్షులన్నీ ఒకప్పుడు జంతువులేనని తెలుసుకో. అందరం మొదట పుట్టింది నీటిలోనే. నువ్వు కూడా ఒకప్పుడు జంతువివే. మనుషుల్ని గురించి కళ్లులేనీ కటోది అనేమాట కూదా నీజమే. నీమాదిరి నాకళ్లు చూడలేవు. చూడలేకపోయినా ఎక్కడ ఏ వస్తువు ఎంత దూరంలో ఉందో అన్నీ నా మనోనేత్రం ద్వారా చూస్తుంటాను.

ఎలాగా? అంటూ ఆశ్చర్యంగా అడిగింది గుళ్లగూబ “నా నోరు చెవులు ఇందుకు ఉపయోగిస్తాను. నోటితో శబ్దం చేస్తాను. ఆ శబ్దతరంగాలు నాచుట్టు వక్కలున్న ప్రదేశాలకు వెళ్లి తిరిగివస్తాయి. ఆ తిరిగివచ్చిన తరంగాల వలన ఏ వస్తువు ఎంత దూరంలో ఉందో నాచెవులకు తెలిసిపోతుంది. నా ఈ శక్తినీ చూసే మనుషులు రాదాద్‌ అనే యంత్రాన్ని కనుగొన్నారు. అందుకనే నిశబ్దంగా ఉండే రాత్రుళ్లు తిరుగుతాను. ఆ సమయంలో వేరే శబ్టాలు ప్రతిధ్వనులు లేకుండా ఉంటాయి. నా పనీ సులువు అవుతుంది అని వివరంగా చెప్పింది గబ్బీలం. సరేసరే ఈ రోజుకు కబుర్లు కట్టిపెట్టి ఇండ్లకు పదండి. తీరిక నమయాల్లో తగువులాటలు వెొదలయ్యాయి. రేష్పు కొట్టుకొంటారేమో అంటూ పెంపుడు కుక్క వెటకారంగా అన్నది. హాయిగా పిల్లల్ని వెంటబెట్టుకానీ అడవంతా తిరుగుతూ ఆనందంగా ఉందేవాళ్లం. బడిలో పిల్లలూ బయట మనమందరమూ బాధితులమే. ఇదంతా బడి మహత్యమేనంటూ నిట్టూర్పు విడిచింది కొమ్ముల జింక.


వచ్చే నంచికలో : తల్లిదండ్రులకు తలనొప్పులు