పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే

బలవంతంగా బడిలో వదిలారు. ఉపాధ్యాయులు రోజంతా రకరకాల

శిక్షలు వేని బడి అంటే మరింతగా భయపదేట్లు చేసారు. సాయంకాలం మాగీ ఒక్కటే ఇంటికి వచ్చింది. విక్కీ తప్పించుకుని దూరంగా పారిపొయ్యాడు.

ఎట్టకేలకు బడిలో చదువులు ప్రారంభమయ్యాయి.

పెంవుడు కోతి వచ్చి *ఈ రోజు నుంచి పాఠాలు మొదలవుతాయి. పిల్లలంతా శ్రద్ధగా నేర్చుకోవాలి. ఆనందోబ్రహ్మ అన్నారు. జీవితానికి పరమార్థం ఆనందంగా ఉండడమే. అందుకనీ ఆరోగ్యాన్నీ ఆనందాన్ని ఇచ్చే నాట్యం సంగీతాలతో మన చదువులు వెుదలవుతాయి. మీకు ఇష్టమేనా అని అడిగింది. విల్లలంతా ఉత్సాహంగా ఇష్టమే ఇష్టమే అంటూ ముకుమ్మడిగా అరిచారు.

నెమలి వచ్చి పురివిప్పింది. రంగురంగుల తన ఈకలను రకరకాలుగా కదిలించింది. ముందుకు వెనక్కు అడుగులువేస్తూనాట్యం చేసింది. నాట్యం చూసి పిల్లలంతా కేరింతలు కొట్టారు.

నెవులి నాట్యంలటెఎక్క గొప్పతనం గురించి అరగంట వివరించింది. పిల్లలకు ఏమీ అర్థంగాలేదు. విసుగు పుట్టింది ఆవులింతలు మొదలయ్యాయి. లేచి పారిపోతే ఉపాధ్యాయులు కొడతారనీ అలగే కూర్చునీ పరధ్యానంలోకి వెళ్లిఫొయ్యారు. నెమలి పాఠం ఆపి మంచినీళ్లు తాగింది. మాట్లడుతున్నప్పుడు పరధ్యానంలోకి వెళ్లిన పిల్లలంతా శబ్దం ఆగిపోగానే ఉలిక్కిపడి మనలోళంలోకి వచ్చారు.

నెమలి పురివిప్పి గుండ్రంగా తిరిగింది. నా మాదిరి మీరు కూడా చేయండి అని చెప్పింది.

మాగీలేచి నిలబడింది. మీకు అందమైన ఈకలు ఉన్నాయి.

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఈ జనవరి-2022 |

పురివిప్పి నాట్యం చేయగలరు. మాకు ఈకలు లేవు గదా! మేమెలా నాట్యం చేయగలం అనీ అడిగింది.

ఈకలు లేకపోతేనేమి కాళ్లు కదిలించండి అని గట్టిగా అరిచింది నెమలి. పిల్లపక్షులు పిల్లజంతువులు ఎంత ప్రయత్నించినా నెమలిలా కాళ్లు కదలించలేకపోయాయి. చివరకు నెమలిపిల్లకు కూదా సాధ్యం కాలేదు. సింహంపిల్ల నాకు నాట్యం రాదు అంది. అవును మాకు నాట్యం రాదు అంటూ పక్షిపిల్లలు పిల్లజంతువులు అరిచాయి. ఆ అరువులు విని 'హెద్మాష్టరు ఏనుగుగారు పరుగెత్తుకొంటూ వచ్చారు. “అలా అరవకూడదు. ఏదీ వెంటనే రాదు. ఒక విద్య నేర్చుకోడానికి సంవత్సరాలు పదుతుంది. భయపడకూడదు అంటూ ఖైర్యం చెప్పింది.

ఇంతలో ఒంటెపిల్ల లేచింది “మాస్టారు గారిలా నా కాళ్లు కూడా పొడవు. నేను నాట్యం చేస్తాను అంటూ కాళ్లు అటూ ఇటూ వేగంగా కదిలించింది. మిగిలిన పిల్లలంతా చప్పట్లు కొడుతూ పెద్దగా అరిచారు. విల్లఒంటెకు ఉత్సాహం ఎక్కువైంది. కాలు వేగంగా కదిలించింది. ఆ వేగానికి తూలి నేలమీవ పడిఫోయింది. కాలు బెణికింది. లేవలేకపోయింది. పిల్లలంతా భయపడ్డారు. హెద్మాష్టరు గారు తొండంతో ఎత్తి నిలబెట్టింది. పిల్లఒంటె నిలబడలేక పడిఫోయింది.

“ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భయపడకూడదు. అని చెప్పి ఒంటెపిల్లను కదలకుండా ఒక పక్కన కూర్చుండపెట్టింది.

నాట్యం కొంచెం కష్టం. పాటలు ఎంతో మధురంగా ఉంటాయి. ఇప్పుడు సంగీతం నేర్చుకోండి అంటూ సంగీతం మాష్టారు గండు కోకిల గారిని పిల్చారు హెద్మాష్టరుగారు.

సంగీతం మాస్టారు వచ్చి “ముందుగా సంగీతం గొప్పతనం