పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎవరు తెలివి గలవారు?! అ

జరిగిన కథ:

రాజుగారైన సింహం ఎవరు తెలివి గలవారో తెలుసుకొని రమ్మనీ అడవి జనాలకు చెప్పింది. ప్రపంచమంతా తిరిగి చూసి జంతు పక్షిజనాలు వునుషులు తెలివి గలవాశేగానీ అతని తెలివితేటలకంటే బుద్దిీహీనత దుర్మార్దాలు ఎక్కువని దీనికి కారణం మనుషులు ఏర్పాటు చేసుకొన్న బడి ఆ బడిలో చదువులేననీ తేల్చిచెప్పారు. అలాంటి బడిమీవ ఆశకల్లింది జంతుజనాలకు పక్షిజనాలకు. మనుషుల నుండి పారిపోయి వచ్చిన చదువుకున్న కోతి సహాయంతో ఆడవిలో బడిపెట్టుకాన్నారు. తర్వాత కథ

- ఖగ కష్టాలు

స్వేచ్చగా ఇంతకాలం తిరిగిన పిల్లలు బడిలో కదలకుండా కూర్చోలేక పోతున్నారు. పిల్లల్ని నిశ్శబ్దంగా కదలకుండా కూర్చుండబెట్టలేక ఉపాధ్యాయులు, 'హడ్యాష్టరు పిల్లల్ని భయపెట్టి వీవులు పగలగొట్టి తవు అదుపులోకి తెచ్చుకోడానికి (ప్రయత్నిస్తున్నారు. సాయింకాలం ఇంటికి వచ్చిన పిల్లల

ఒంటిమీద వాతలు చూసి తల్లిపక్షులు తల్లి జంతువులు కన్నీళ్లు

పెట్టుకొని బాధపడుతున్నారు.

నాలుగు రోజుల తరువాత తల్లులంతా పిల్లల్ని తీసుకానీ బడికి బయలుదేరారు. పిల్లలు మేమురామంటూ గోలచేసారు. తల్లులు ట్రతిమలాడి తినదానీకి పండ్లూ కాయలు ఇచ్చి పిల్లల్ని ఎలాగో కష్టపడి బడికి తీసుకొనీ వచ్చారు. కాని విక్కీ మాగీలు ఎవ్వరికీ తెలియకుందా ఒక పెద్ద చెట్టుకొర్రలో దాక్కున్నారు.

బడిలో ఉపాధ్యాయులంతా పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు. పెంపుడు కోతికూడా బడిలోనే ఉంది. తల్గులంతా కట్టగట్టుకొని

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

లి న

సి.వి. క్రిష్ణయ్య

93965 4554 రావడంతో ఉపాధ్యాయులు భయపడ్డారు.

“పిల్లలవంటి మీద వాతలు చూడండి పైన తోలుకూడా చిట్లిపోంబంది. ఇలానేనా కొట్టేది. విల్లలు బడి అంటే భయపడిపోతున్నారు. నాలుగురోజులకే ఇలా ఉంటే బడి ఎలా కొనసాగుతుంది అని నక్కతల్లి కోప్పడింది.

కోతి తల్లుల్ని నవబదాయించదానికి (వ్రయుత్నించింది. “తెలివితేటలు సంపాదించడం సామాన్నమ్రైన విషయంగాదు. మొదట ఇలాగే ఉంటుంది. స్వేచ్చగా ఆటలాడుకొనే విల్లలు గదా? కదలకుండా కూర్చోబెట్టడం పెట్దపని. బడిపెట్టిన మొదటిరోజుల్లో మనుషుల పిల్లలు కూడా ఇలాగే ఉండేవారట. చింతబెత్తాలు, పేము బెత్తాలతో వీపులు పగలగొట్టేవారట. పైన వేలాడదీసి కింద మంట బెట్టేవారు. గోడకుర్చీలు వేయించేవారు. వందల కొద్దీ గుంజీలు తీయించేవారు. కాళ్లు చేతులు కట్టివేసి ఎండలో నిలబెట్టేవారు. ఇలా భయపెట్టి కొట్టి ఎట్టకేలకు లొంగతీస సుకొనేవారు. అలా క్రమంగా స్వంతంగా ఆలోచించడంమాని మనం చెప్పినట్టువింటారు. ఇలాగే మనుషులు గొప్పవాళ్లు అయ్యారు” అనీ వివరంగా చెప్పింది పెంపుడుకోతి.

ఈ మాటలకు తల్లులు భయపడ్డారు. “మనుషుల పిల్లలు ఇంత హింస ఎలా భరిస్తున్నారు? తల్లితండ్రులు ఎలా ఒప్పుకొంటున్నారు. పసితనంలో ఇంత హింస అనుభవించినవారు పెరిగి పెద్దవారైనపుడు అంతకు అంత తీర్చుకోరా. ఊరుకుంటారా? ఇందుకేనేమో మనుషులు ఇంత చెడ్డవాళ్లుగా మారింది” అంటూ వాపోయింది తల్లికుందేలు.

జింకతల్లి తన వీడను ముద్దుపెట్టుకొన్నది “ఇంత హింసించి ఈ చదువులు చెప్పించకపోతే ఏమవుతుంది” అన్నది జింకతల్లి.

నీజమే. నిజమేనంటూ మిగిలిన వారంతా వంతపాదారు. కాని తల్లి సింహం గట్టిగా అరిచింది. “మీ పిరికి మాటలు కట్టి పెట్టండి” పిల్లల్ని ఎలాగో దారిలో పెట్టి చదువు నేర్చండి, వీళ్ల మాటలు పట్టించుకోవద్దు అంటూ ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చింది తల్లి సింహం.

ఇంటికి వస్తూ జింకతల్లి కుందేలుఅమ్మతో అన్నది చెల్లీ! ఈ బడి ఏమిటి? చదువలేమిటి? నాకు అంతుబట్టకుందా ఉంది. ఈ టీచర్లకు మనకంటే ఎక్కువ ఏమి తెలిసి ఉంటుంది. మెదడుతో చేసే పనీకి శరీరాన్నీ దండిస్తే ఏమి లాభం! సంతోషంగా ఉల్లాసంగా ఉంటేనే కదా పిల్లలు బాగా నేర్చుకొంటారు? కొట్టి భయపెడితే ఎలా నేర్చుకొంటారు? మనుషులకు ఈమాత్రం కూడా తెలియదంటావా? అనీ అడిగింది జింకతల్లి.

“* ఆ చదువేదో మనమే నేర్చుకానీ హాయిగా పిల్లలకు మనమే నేర్చించుకుంటే బాగుంటుందికదా! హాయిగా ఆడుతూ పాడుతూ పనిచేసుకాంటూ నేర్పించవచ్చు” అని అన్నది కుందేలు.

ఆరోజు చిలకమ్మ చెప్పిన మాటలు వినీ ఉంటే సరిపోయేది. చూద్దాం ఏమిజరుగుతుందో అనుకొంటూ ఇండ్లకు చేరుకున్నారు.

ఒకప్పుడు అడవి అంతా తామే అన్నట్లు ఎంతో ఉత్సాహంగా తిరిగిన విక్కీమాగీలు బడి పుణ్యమా అనీ కనబడటమే లేదు. తల్లిదండ్రులు ఇతర జనాలు వెదికి విక్కీ మాగీలను పట్టుకుని