పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆయా పదాలలో చెవృదలచుకొన్న అక్షరాలు విద్యార్సుల పదసంపదలో లేనప్పుడు మాత్రమే కొత్త పదాలను వారికి పరిచయం చెయ్యాలి. రాత నేర్చడానికి ముందు చదువు నేర్పడం వలన ఒక లాభం వుంది. రాత నేర్చుకొనే సమయానికి విద్యార్థికి ఇంచుమించు అన్నీ అక్షరాలూ తెలిసి వుంటాయి. పద సంపద కూడ పెరుగుతుంది. ఎటువంటివి చదివించాలి:

మాతృభాషలో రాసిన పదాలను, వాక్యాలను పిల్లలు చదువుకొనీ అర్థం చేసుకోవదానీకి అనువుగా వారికి ఆ భాషలోనీ అక్షరాలను చదవడం నేర్పాలి. పిల్లలు నిత్యం వాడుకొనే మాటలు చదివించాలి. వీలైనంత వరకు నీత్యం చూస్తున్న వస్తువుల పేర్లు చదివించాలి. బంధు వాచకాలు, తోటి విద్యార్దుల పేర్లు ఊరిపేర్లు, సినిమాల మేర్లు ఇలా ఏవైనా ఎంచుకోవచ్చు. తెలియని పదాలను ఉపయోగించడం కంటె తెలినిన పదాలతోనే అక్షరాఖ్యాసం చేయించడం మంచిది.

పిల్లలకు ఏం నేర్పాలనుకాంటున్నారు. లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్దేశించండి. అక్షరాలను నేర్చాలనుకొంటున్నారా? లేక కొత్తపదాలను నేర్పాలనుకొంటున్నారా? వదాలే నేర్చాలనుకొంటే అక్షరాలద్వారా నేర్పవలసిన పనిలేదు. *“రుషము” అని చెప్పడానికి బొమ్మను చూపించి మూడుసార్లు చెప్తే చాలు నాలుగోసారి బొమ్మను చూడగానే పిల్లవాడు. 'రముషమూ అంటాడు పిల్లలు రు” నీ గానీ 'షూ నీ గానీ “ము” నీ గానీ గుర్తించకుందానే చదివేస్తారు.

నేడు విద్వాబోధనపై వ్యాసాలు రాస్తున్న వారుగూడ “జ “ఇల ఉచ్చారణ విషయంలో తప్పుగా రాస్తున్నారు. “ఇ” నీ అల్మబ్రగ అంటున్నారు. “బు, బూ” లను “అబు, అబూ అనీ అంటున్నారు. “జ్ఞానము, జ్ఞాపకం” వంటి మాటలలో మాత్రమే “ఇ” అక్షరం కనిపిస్తుంది. 'బు” అన్న అక్షరం కొన్నీ పదాలలో మాత్రమే రాస్తున్నారు. ఈ అక్షరాన్నీ గూడ సరిగ్గా ఉచ్చరించడం రానీవాళ్ళు వున్నారు. ఉపాధ్యాయుడు తన ఉచ్చారణ సరిగా లేదనుకొంటే ఆ అక్షరాలు చెవృ్పడం మానుకోవాలి. వాటిని విద్యార్థి పైతరగతులలో అవసరమైనచోట్ల నేర్చుకొంటాడు. ఇటువంటిదే మరొక అక్షరం. బంది అ. ఈ అక్షరం ద్విత్వం గానే మనకు కనిపిస్తుంది. దీనిని ప్రాచీన రచనలు చదువుకోవడం కోసం నేర్చుకోవాలి. ఒకటవ తరగతిలో నేర్చవలసిన పనిలేదు. మాటనుండి రాతకు:

రచయితలు మాట్లాదే భాషకు అక్షరరూపం యిస్తారు. మాట్లాడే భాషకీ రాసే భాషకీ ఖేదం వుంటుంది. ఆ ఖేదం ఎంత తక్కువగా వుంటే అంత మంచిది. శిష్ట వ్యావవారికాన్ని గూడ రాయడం అన్నిచోట్లా జరిగేపనీకాదు. లిపికి కొన్నీ పరిమితులున్నాయి. మాట్లాదేటట్లు రాయలేం. వాగ్య్యవహారంలోనున్న భాషను లిపి బద్దం చేసేటప్పుడు చాలా సమస్యలు ఎదురౌతాయి. భాషలో వివిధ రక్సాలైన మాండలికాలు వుంటాయి. కుల మాండలికాలున్నా చదువుకున్న వారిలో ఆ ఖేదం అంతగా కనిపించదు. కొందరు విద్యావేత్తలు జోధథనా మాధ్యమం గురించి మాట్లాడుతూ ఇంటిభాషలో విద్యాబోధన జరగాలంటున్నారు. అందరి ఇళ్ళల్లో భాష ఒక్కలాగ వుందదు.

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

ఇంటిభాష గూడ ఎల్లప్పుడూ ఒక్కలాగే వుండదు. మా ఇళ్ళల్లో “వదవడం లేదు, రాయడం లేదు” అంటాం. పుస్తకాలలో గూడ ఇలాగే రాయడం వుంది. మా మనవరాలు విశాఖపట్నంలో 8వ తరగతి చదువుతుంది. ఆవె ఖాష చాలాకాలం క్రితవే మారిపోయింది. “చదవ ట్లేదు, రాయట్లేదు” అంటుంది. ఆమె తమ్ముడు, రెందేళ్ళవాడు గూడ అలాగే అంటున్నాడు. వాళ్ళ చిన్నాన్న పిల్లలు గూడ అలాగే అంటున్నారు. అమ్మల్ని అనుకరించడం లేదు. ఇంటి భాష వేరు. బడి భాష వేరు. విద్యార్థి చదువుకోవడం ద్వారా ఇంటిభాషనుండి బడిభాషకు అంటే ప్రామాణిక భాషకు మారతాడు. మాండలిక పదాలు గూడ ప్రామాణికమే. ప్రాంతాలనుబట్టి పదాల వాడుక వుంటుంది. వాడుక పదాలను ఠరాయగలం. చవవగలం. కానీ యాసలో రాయలేం. భాష వేరు, యాస వేరు.

విద్యార్థులు భాషను తరగతి గదిలోనే కాదు బయటగూడ నేర్చుకొంటారు. భాషపై నినీమా, టి.వి., (ప్రింట్‌ మీడియా వ్రభావంగూడ అధికంగా వుంటుంది. చిన్న పిల్లలు టి.వి., సినిమాలలోని నంభాషణలను, ముఖ్యంగా విలన్‌ భాషను అనుకరించడం మీరు గమనించే వుంటారు. కొందరు నటులు నత్తి నత్తిగా మాట్లాడుతుంటారు. పిల్లలు వీరిని అనుకరించకుండా చూడవలసిన బాధ్యత అందరిపైనా వుంది. ప్రింటు మీడియా గూడ తనవంతు కర్తవ్యంగా రకరకాల స్పెలింగులు ప్రవేశపెడుతూనేవుంది. న్వూన ప్రమాణం ఇబ్బందికరంగా ఉంటుంది.

అక్షరాలను రాసేటట్లు గానే చదవాలి. “ఎలక, ఎలుక, ఎలిక ఉడుత, ఉదత” అనే మాటలు వాడుకలో వున్నాయి. ఎలాగ రాస్తే అలాగే చదవాలి. కొందరు 'నొప్పి” అని రాస్తే మరి కొందరు 'ెప్పి? అని రాస్తారు. కొందరు “తరువాత” అని రాస్తే మరి కొందరు “తరవాత” అని రాస్తారు. రాసినట్లే చదవాలి. తప్పులు రాస్తే తప్పులే చదవాలి. ఉచ్చారణలో ఉన్న ఈ స్వల్ప భేదాలను ఉపాధ్యాయుడు బోధించాలి.

ఇంగ్లీషు చదువుల మూలంగా తెలుగు ఉచ్చారణలో మార్పు వచ్చింది. “నాన్నమ్మ ను 'నానమా” అనీ పిలుస్తున్నారు. మరి వారి రాత ఎలాగుంటుందో ఊహించండి. కొందరి “చి కారోచ్చారణ గూడ తెలుగు ఉచ్చారణకాదు. ఐనా దీనీ ప్రభావం రాత మీద ఉండదు. ఒకటవ తరగతిలోనే పిల్లల ఉచ్చారణ సరిచేయవలసి వుంటుంది. ఈ విషయంలో అశ్రద్ధ వహించకూడదు.

ఒకటి రెండు తరగతులలోని విద్యార్థులు, మాట్లాదే భాష నుండి క్రమంగా రాత భాషకు అలవాటు పడతారు. అంతేకాదు పిల్లవాడు తన పద సంపదను పెంచుకాంటాడు. ఇది ఒక ప్రాంతానికి చెందిన భాష గురించి చెప్పడం కాదు. వ్యావహారికంలో రాస్తున్నాం అంటున్నా రాసే భాషకూ మాట్లాదే భాషకూ తేదా వుంటుంది. కొందరు బాగా చదువుకున్నవారు గూడ, “వచ్చేసినారు” అన్న మాటను “వచ్చేసిన” అంటుంటారు. కానీ “వచ్చేసినారు” అనే రాస్తారు.

రాతలో వున్న భాష (శద్దగా మాట్లాదేభాష. తొందరగా మాట్లాడే ఖాష కాదు. ఏ (ప్రాంతం వారికైనా ఈ సూత్రం వర్తిస్తుంది.