పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంభాషణలో వున్న వేగం రాతలో కనిపించదు. కాబట్టి సందిగ్ధతకు తావులేకుండ వుండదంకోసం విసంధీ రూపాలు రాయడమే మంచిది. తి ఒకటవ తరగతిలో అక్షరాఖ్యాసం కొత్త ప్రవేశిక

ఒకటవ తరగతి ఉపాధ్యాయులు ఈ కొత్త పద్దతిలో అక్షరాలు నేర్పితే పిల్లలు అనతి కాలంలోనే చిన్న చిన్న పుస్తకాలు చదవగలరు. ప్రభుత్వం విధించిన ప్రణాలికను అమలు చేస్తూనే కొత్త పద్ధతిలో అక్షరాలు నేర్చవచ్చు.

బడిలో ఉపాధ్యాయునికంటె ఇంటివద్ద పిల్లల తల్లిదండ్రులు సులువుగా అమలు చేయగలరు. పాఠశాలలో వనిచేస్తున్న ఉపాధ్యాయునికి ఉన్న సమస్య వీరికుండదు. ఈ పద్దతిని ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు, ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు సులభంగా వినియోగించుకోగలరు. ఈనాడు చదువు రాని తల్లిదండ్రులు లేరు. పిల్లల తల్లిదండ్రులు విద్యావంతులు కాబట్టి పిల్లల చదువుకోసం ఉదయం ఒక పది నీమషాలు, రాత్రి ఒక పది నీమషాలు కేటాయించండి. విల్లలకు తల్లిదండ్రులే తాలి ఉపాధ్యాయులు. ఐదు సంవత్సరములు పైబడిన పిల్లలకు రాయడం నేర్చవచ్చు. ఉపకరణాలతో సంసిద్దులు కండి బోధన ఉపకరణాలు

1) బ్లాక్‌ బోర్డు: పిల్లలకు అక్షరాలు రాయడం నేర్చుతున్నాం కాబట్టి ఈ బోర్టుపై సమాన దూరంలొ 4 లేక 5 గీతలు వుండాలి. అక్షరాలు వీటి మధ్యనే రాయాలి.

2) వ్లాష్‌ కార్డులు: ఉపాధ్యాయుడు కార్చు సైజు అట్టలపై

పద్ద యు

అందంగా అక్షరాలు రాసుకోవాలి. రంగుల స్మేచ్‌ పెన్నులు ఉపయోగించడం మంచిది. అచ్చువి లఖించేటట్లయితే వాటినీ ఉపయోగించుకోవచ్చు. ఇవి కనీసం 4 సెట్లు వుందాలి. ఏరోజు ఏ అక్షరాలు పరిచయం చేయ్యాలనుకొంటున్నామో అవీ, ముందు రోజులలో నేర్చుకున్న అక్షరాలు ఉపయోగించుకోవాలి. వీటిని విద్యార్థులకు గూడ ఇవ్వవచ్చు. వీటితో పదాలు కూర్చవచ్చు. వీటినీ చదవదానికి మాత్రమే ఉపయోగించాలి. వీటిద్వారా అక్షరాలు రాయడం నేర్చకూడదు. ప్లాష్‌ కార్డులద్వారా తల్లిదం[డ్రులు పిల్లలకు తేలికగా చదవడం నేర్చవచ్చు.

3) వార్తా పత్రికలు, కరపత్రాలు, పుస్తకాలు ఇంకా ఏవైనా పెద్ద అక్షరాలతో వ్రాసినవి వాడుకోవచ్చు. చదివే అలవాటు పిల్లలకు నేర్చండి. 3.మాటల కూర్పు అట:

ఒక సేక వస్తా తయారు చేసుకోవాలి. దీనీనీ ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాలి. సుమారు 4౫4 సెంమీ॥ తెల్లనీ కార్డులపై అచ్చులు, తలకట్టుగల హల్లులు రంగురంగు స్కెచ్‌ 'పెన్నులతో అందంగా రాసుకోవాలి. మరియు సున్న(0) , విసర్ద() గూడ వున్న అట్టముక్కలు గూడ రాసుకోవాలి. ఇటువంటివి 4 సెట్లు (దస్తాలు) తయారు చేసుకోవాలి. గుణింతాలు లేనీ అక్షరాలతోనే అట్ట ముక్కలు

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

తయారు చేసుకోవాలి. గుణింతాలు లేని పదాలు చాలా వున్నాయి. గుణింతాలతో కూడిన హల్లులతో సెట్‌లు తయారు చేసుకోవడం ఆచరణసాథ్యం కాదు. ఉపాధ్యాయుడు తాను చెప్పిన అక్షరాలను మాత్రమే ఉపయోగించాలి. ఒకరోజు 4 అక్షరాలు చెప్తే ఆ అక్షరాల సెట్లు మాత్రమే పిల్లకు యిచ్చి ఆడించాలి. మరునాడు మరి 4 అక్షరాలు చెప్తే మొత్తం 8 అక్షరాలు సెట్లు యివ్వాలి. ఒక్కొక్క సెట్‌లో ఒకే రకమైన 4 అక్షరాలు వుంటాయి. ఆడదేవారి సంఖ్య పెరిగితే సెట్లులోని అక్షరాల సంఖ్య గూడ పెరుగుతుంది. ఈ పేక దస్తాలను ఉపయోగించి పిల్లల చేత మాటల కూర్పు ఆట ఆడించవచ్చు. ఆడిరచి చూడండి పిల్లల పద సంపదను చూసి ఆశ్చర్యపోతారు. పెద్దవారు కూడ పిల్లలతో ఆడవచ్చు. ఎవరు గెలుస్తారో చేప్పలేం. అడేవిధానం:

ఈ ఆట ఆడదానికి చదవడం వస్తే చాలు. 8 అక్షరాలు వచ్చిన తరువాత ఇద్దరు విల్లలు ఆడుతున్నారనుకొందాం. 8౫4 =32 ముక్కలుబాగా కలిపి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మధ్యలో ఒకటి చొప్పున 4 పంచాలి. 12 పోగా దస్తాలో 20 మిగులుతాయి. దస్తాతిరగేసి వుంటుంది. ఆటగాళ్ళు తమ ముక్కలను మూసి వుంచవలసి పనిలేదు. దస్తానుండి ఒక ముక్కతీసి తమ వద్దనున్న ముక్కతో పదం తయారుచేయ్యాలి. తమ దగ్గర ముక్క తగ్గితే మళ్ళీ దస్తానుండి ముక్క తీసుకోవచ్చు. ఆటగాని వద్ద ఎప్పుడూ 4 ముక్కలు వుండాలి. ఈ ఆటను ఇంకొక విధంగా గూడ ఆడవచ్చు. నలుగురు ఆడుతుంటే మధ్యలో 12 ముక్కలు వేయాలి. దస్తానుండి ఒక ముక్క తీసుకొని దానితో మథ్యలో ఉన్న ముక్కలతో కలిపి ఒక పదం తయారు చెయ్యాలి. మధ్యలోనుండి ఎన్ని ముక్కలైనా తీసుకోవచ్చు. పదం చెయ్యలేకపోతే ముక్క వదిలేయాలి. ఈ ఆటను యిలాగే ఆడాలని లేదు. మీరు మార్చుకోవచ్చు. ఆట పూర్తయిన తరువాత ఒక్కొక్షరు ఎన్ని మాటలు కూర్చారో లెక్కవేయడదమేకాదు, ఆమాటలను ఉపాధ్యాయుడు రికార్డు చేసుకోవాలి. ఉపాధ్యాయుడు విద్యార్ధిపేరుతో ఒక ఖాతా తెరిచి అందులో ఆ పిల్లవాని పదసంపద జమచెయ్యాలి. దీనివలన ఎవరివద్ద ఎంత పెద్ద మాటలమూట వుందో, ఎవరుగొప్ప పదవంతులో తెలుస్తుంది.

త్తే

(ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు చదువు నేర్పడానికి గూడ ఈ పాఠాలు వినియోగించుకోవచ్చు. ఉపాధ్యాయుడే బోర్జుమీద రాయాలి. ఇంట్లో పెద్దవారు పిల్లలకు చదువు చెప్పాలనుకుంటే పలక బలపం వాడవచ్చు. వ్లాష్‌ కార్జులు గూడ ఉపయోగించుకోవచ్చు. )

ఒకటవ తరగతిలో రాత నేర్పుతారు కాబట్టి రాతకు సులువుగా ఉందే అక్షరాలు ముందుగా పరిచయం చేస్తాను. మాదిరి పాఠం = 1

1. ఇంతవరకు నేర్చుకొన్న అక్షరాలు - 0

2. ఇంతవరకు చదువుకొన్న మాటలు - 0

8. ఈ పాఠంలో నేర్చుకోవలసిన కొత్త గుర్తులు -2 (వీటిని ఉపాధ్యాయుడే బోర్టుపై రాసి వివరించాలి) 2. తలకట్టు (“ )

1.సున్న :0 ( ఇవి అక్షరాలు కావు.