పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని రెండక్షరాలు. ఒకే ధ్వనికి రెండక్షరాలు. అందుచేత బొమ్మని చూపించి పదాన్ని పలికిన తరవాత స్పెలింగ్‌ చెబుతారు. ఇంగ్లీషులో పదాన్ని బట్టి అక్షరం యొక్క ధ్వనీ మారుతుంది. ఈ విధానం మనకు సరిపోదు.

ఇంగ్లీషు అక్షరాలు నేర్చదానికి 4006లో 4 నీ 86! లో 8 నీ వర్ర రంగులో ముద్రిస్తారు. ఇదే పద్దతిని తెలుగువారు కూడ అనుకరించారు. పిల్ల నెత్తుకొన్న స్త్రీ “అమ్మ. ఆవు బొమ్మ కింద "అవు: పీట బొమ్మ కింద “ఓడి డబ్బా బొమ్మ కింద “దబ్బా. ఈ పదాలలోని మొదటి అక్షరాలన్నీ కొట్టొచ్చినట్లు కనిపించేటట్లు వేరే రంగుల్లో పెద్దవిగా ముద్రిస్తారు. ఎల్‌ కె. జి. చదువుతున్న మూడున్నర సంవత్సరాల అమృత “ఓ” అన్న అక్షరాన్ని చూసినప్పుడల్లా “ఓడ” అంటుంది. ఓ “ది ఈ రెండు అక్షరాలు విడి విడి అక్షరాలు అనీ బోధించినా గూడ మళ్ళీ అదేమాట. “ఓడ” “మా టీచర్‌ అలాగే చెప్పారు” అంటుంది. *ఓద” అనీ చదువుతారు “డబ్బా” అనీ చదవ లేరు. విడివిడిగా అక్షరాలు చదవలేరు. “అమ్మ” చదివినవాళ్లు “అయ్య” చదవలేరు.

పిల్లలు గుర్తుపట్టినవి అక్షరాలు కావు. వారు గుర్తుపట్టినవి బొమ్మలు. అక్షరాలు బొమ్మలు కావు, అవి ధ్వని సంకేతాలు. వాటిని చదవాలి. మన లక్ష్యం అక్షరాలు చవవడం. బొమ్మలను గుర్తుపట్టడం కాదు. పిల్లలకు బొమ్మలు చూపించి కథలు చెప్పంది. పాటలు నేర్పండి. కాని అక్షరాలకీ బొమ్మలకీ ముడిపెట్టవద్దు. ఇప్పటి పద్దతిలో లోపాలున్నాయి కాబట్టే కొత్త పద్ధతి అవసరమైంది.

పెల్లలు పదాలు పలుకుతారు. ఆ మాటలకు అర్థం గూడ వారికి తెలుసు. పిల్లలకు తెలిసిన పదాలతోనే అక్షరాభ్యాసం చేయించాలి. మనం పదాన్ని విడగొట్టి అక్షరాలు నేర్పుతున్నాం. మాటలు ధ్వనుల సమూహం అని పిల్లవాడు అర్ధం చేసుకోవాలి. కాబట్టి పదాలు చదవడం ద్వారా అక్షరాలు నేర్పడం సరైన పధ్దతే. ధ్వనులను అక్షరాలుగా రాస్తున్నాం అనీ గూడ పిల్లలకు తెలియాలి. పదాలలోనీ అక్షరాలనన్నిటినీ ఒకేసారి నేర్చలేం కాబట్టి నేర్చుకొన్న అక్షరాలతోనే పదాలు కూర్చాలి.

ల అక్షరాభ్యాసం - కొత్త పద్ధతి భూమిక

రాత ఎప్పుడు నేర్పాలి:

ఐదు సంవత్సరములు పైబడినవారిని ఒకటవ తరగతిలో చేర్చుకొంటున్నారు. ఒకటవ తరగతిలో అక్షరాలు దిద్దుతారు. రాయడం, చవవదం నేర్చుకొంటారు. ఆ వయస్సువారికి అందంగా బొమ్మలు గీయడం వస్తుంది. దస్తూరీ బాగా కుదురుతుంది. గాంధీగారు తన దస్తూరి గురిచి మాట్లాడుతూ “వంకర టింకర అక్షరాలు అసంపూర్ణ విద్యకు చిహ్నంగా భావించాలి. నా అక్షరాలను అందంగా రాద్దామని ఎంతో ప్రయత్నించాను. కాని వ్యవహారం చెయ్యిదాటిపోయింది. దస్తూరీ మార్చుకోలేకపోయాను. నన్ను చూసి ప్రతి బాలుడు, ప్రతి బాలిక జూగ్రత్త పదాలని కోరుకొంటున్నాను. అక్షరాలు దిద్దించుటకు ముందు బాలురకు చిత్రలేఖనం నేర్పడం

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

అవసరమనీ నా అనిపించింది. పూవులు, పిట్టలు మొవలగు వాటినీ పరిశీలించి చిత్రించినట్లే అక్షరాన్ని గూడ పరిశీలించి రాయడం అవసరం. వస్తువులను చూసి గీయడం నేర్చుకొన్న తరవాతే రాత నేర్పడం మంచిది. అప్పుడు అక్షరాలు అందంగా వుంటాయి.” అన్నారు. ఐదు సంవత్సరములు పైబడిన పిల్లకు రాయడం నేర్చవచ్చు.

ఒకటవ తరగతిలో చదవడంతో పాటు రాయడం నేర్చుకొంటారు. రెండవ తరగతిలో ప్రవేశించే నాటికి తెలుగు అక్షరాలన్నీ రావాలి. తెలుగు చదవగలగాలి, రాయగలగాలి. ఒకటవ తరగతిలోపు విద్యార్థులకు రాత నేర్చకండి. నేడు తల్లిదండ్రులు తమ పిల్లలను యల్‌.కె.జి.” యు.కె.జి. తరగతులలో చేర్పిస్తున్నారు. వారు అ, ఆ కంటే ముందగానే ఎ, బి, సి, డిలు దిద్దుతున్నారు. ఖదు సంవత్సరాలకు ముందుగానే నోటు బుక్కు పెన్సిలు, ఇరేజరు పట్టేస్తున్నారు. తప్పులు రాసి ఇనేజర్‌తో చెరపడం కన్న తప్పు రాయకుండా వుండడం మిన్న తెలుగు పిల్లలకు మాతృభాషలో కంటే పరభాషలోనే ముందుగా అక్షరాభ్యాసం జరిగిపోతుంది. అందుచేత మనం గూడ ఒకడుగు ముందుకేయాలి. ఐదు సంవచ్సరముల లోపు పిల్లకు చదవడం నేర్చవచ్చు

చదవడం, రాయడం ఇవి రెండూ వేరువేరు విషయాలుగా గుర్తించాలి. మాతృభాషలో చక్కగా భావ వ్యక్తీకరణ చేయగలిగే పిల్లలకు, నిత్యజీవితంలో వాడుకొనే మాటలు తెలిసిన పిల్లలకు అంటే క్షుణ్ణంగా మాట్లాడ గలిగే పిల్లలకు చదవడం నేర్చవచ్చు. వయస్సు, పరిసరాలు, గ్రహణ శక్తి వెఎవదలైన వాటిపై పిల్లల పదసంపద ఆధారపడి వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకొని ఉపాధ్యాయుడు జోధనా విషయాన్ని తూపొందించుకోవాలి. మూడు సంవత్సరములు పైబడినవారినీ ఎల్‌.కె. జి.లోను, నాలుగు సంవత్సరములు 'పైబడినవారిని యు.కె. జి.లోను, ఐదు సంవత్సరములు పైబడినవారినీ ఒకటవ తరగతిలోను చేర్చుకొంటున్నారు. ఒకటవ తరగతిలో అక్షరాలు రాయిస్తున్నారు. కాబట్టి నాలుగు సంవత్సరములు పైబదిన పిల్లలకు చదవడం నేర్చవచ్చు. రాయడం నేర్చకూడదు. రాతకు ముందు చదవడం వస్తే మంచిదే కదా.

మన లక్ష్యం పిల్లలచేత వారి మాతృభాషలోని మాటలను చదివించడం. వారిచేత రాయించడం కాదు. చదవడం అంటే ఇతరులు రాసిన వాటిని, అంటే వారు ఉపయోగించిన పదజాలాన్ని చదవడం. అంతేకాదు అర్థం చేసుకోవడం గూడ అవసరమే. అర్థం తెలీని చదువు వ్యర్థం. రాసేవాడు ఉపయోగించిన పదజాలం అంతా చదివేవాడికి తెలియకపోవచ్చు. కాబట్టి పిల్లలకు తెలీని పదాలకు అర్థాలు, వాటినీ వుపయోగించడ౦ మెొదలైనవి ఉపాధ్యాయుడు చక్కగా బోధించవలసివుంటుంది. ఇది పిల్లలపై అధిక భారం మోపడం. లక్ష్య పరిమితులు దాటిపోవడం. విద్యార్థులకోసం రాసిన పాఠ్య గ్రంథాలలో కొత్త పదాల సంఖ్య చాలా తక్కువగా వుండాలి. వీలైనంత వరకూ వారు వుపయోగిస్తున్న పదాలను వాడి అక్షరాలను నేర్చడం మంచిది. ఇది చాలా శ్రమతో కూడిన పని. పిల్లలు నీత్యం వాడుకున్న పదాలు ఎన్ని? ఏవి? అని ముందుగా తెలుసుకోవాలి.