పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'ెలుగునుడి- లల

అక్షరాభ్యాసం

భాషాబోధన వేరు. భాషలో బోధించడం వేరు. తెలుగు మాతృభాష కానివారికి తెలుగు జోధించడం భాషాబోధన. విషయాన్ని భాషామాధ్యమం ద్వారా బోధించడాన్ని భాషలో బోధించడం అంటాం. ఒక విషయాన్ని ఇంగ్లీషు మీడియంలో చెప్పొచ్చు లేదా తెలుగు మీడియంలో చెప్పొచ్చు. మాతృభాషలో విద్యాబోధన జరగాలని ప్రపంచంలోని అన్ని దేశాల మేధావులూ కోరుకొంటున్నారు. విద్య వేరు. చదువు వేరు. ఉదాహరణకు విలువిద్య. భారతం చదువు అంటే భారతం అనే పుస్తకంలో రాసిన దానినీ చదువు అనే కదా అర్థం. అంటే రాత, చదువు పరస్పర సంబంధం కలవి అని తెలుస్తుంది.

“నూతన విద్యా విధానంలో ఫౌండేషన్‌ లెర్నింగ్‌ (అభ్యసన పునాది) ఆదర్శం. “ఫొందేషన్‌ లెర్నింగ్‌ అంటే కనీస వైపుణ్యాలను నేర్పించడం. ఖాష నేర్చుకోవడానికి వినదం, మాట్లాదటం, చదవడం, రాయడం వంటివి పునాదులు. కాబట్టి ఈ నైపుణ్యాలను నేర్చించడానికి సరళమైన సులువైన వద్దతులను ఉపయోగించి విద్యార్థులకు నేర్పించడం, కనీసం కావలసిన భాషనీ నేర్పించడం. జీవన మనుగడకు, విద్యార్థి ఉత్తర ప్రత్యుత్తరాలకు, దైనందిన సమస్యలను ఎదుర్కోవడానికి ఈ కనీసభాష అవసరం. అందుకే “జుతీయ విద్యావిధానం-19 అభ్యసన పునాదిని తీసుకు వచ్చింది.” అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా సంస్థ వారు అంటున్నారు.

బడిలో పిల్లలకు తెలుగు భాషను నేర్పుతున్నాము అంటుంటారు. బడిలో పిల్లలకు ఏ భాషను నేర్చుతున్నావు? మాతృభాషను నేర్చుతున్నామా? వరభాషను నేర్చుతున్నామా? పిల్లలు బడిలో చేరకముందు నేర్చుకొన్న భాష ఎంత? బడిలో భాషను ఎంతవరుకు నేర్పుతున్నాము? వారు ఎంత నేర్చుకున్నారు? అన్నది మౌలికమైన ప్రశ్న

ఒకటవ తరగతి తెలుగు విద్యార్ధికి మాతృభాషలో ఏమిటి నేర్పిస్తారు. బేసిక్‌ వకాబ్యులరీ నేర్చిస్తారా? ఐదు సంవత్సరాలు నీండిన పిల్లలకు ఆ మాత్రం పదసంపద (వకాబ్యులరీ) ఉండదా? వినండి మాట్లాడండి అనీ ఒకటవ తరగతి తెలుగు వాచకంలో ఒక కృత్యం రాశారు. మాతృభాషలో ఏమిటి వినీపిస్తారు. విద్యార్ధి ఏమిటి వింటాడు. మాతృభాషలో ఆ మాత్రం మాటలాడలేదా?

పూర్వం సోవియట్‌ రషా వారు “రష్యన్‌ ఫర్‌ ఎవిర్‌ బడి" అని ఒక మాసపత్రిక నడిపిస్తుందేవారు. పత్రికతో పాటు ఒక గ్రామఫోన్‌ రికార్డు పంపించేవారు. దానిలో 'లిసన్‌ అండ్‌ రిపీట్‌ ” అని ఒక ఉచ్చారణ అభ్యాసం ఉంటుంది. పరభాష నేర్చుకొనేవారికి ఈ అభ్యాసం అవసశతమే. తెలుగుభాషను వరభాషగా నేర్చుకొనేవారికి ఈ (డ్రిలింగ్‌ అవసరమే. తెలుగు పిల్లలకు తెలుగు పరభాష కాదుకదా? అది వారి మాతృభాష. మహాప్రాణ అక్షరాలైతే

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

డా; అల్లంసెట్టి చంద్రశేఖరరావు 0949605141

- కొత్త పద్గతి ఊం

కొంతమందికి ఉచ్చారణలో శిక్షణ అవసరం. కాని 'అ” అన్న అక్షరం, “క అన్న అక్షరం. “గ” అన్న అక్షరం పలకలేనీ బడిపిల్లలు వుంటారా? ప్రత్యేకంగా ఉచ్చారణ నేర్చవలసిన ధ్వనులున్నాయి. వాటిని వేరేగా పేర్మానాలి.

తెలుగువారికి ఇంగ్లీషు మాతృబాష కాదు. ఇంగ్లీషు బోధించేటప్పుడు ఒక పాఠంలో ఒకటి రెండు వ్యాకరణాంశాలు, కొన్ని కొత్త పదాలూ కొత్త వాళ్యనిర్మాణ పద్దతి నేర్చుతాం. ఒకే ఖావాన్నీ రెండు వాళక్యనీర్మాణ పద్ధతుల్లో ఎలా చెప్పవచ్చో నేర్పుతాం. ఇవి విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడు అని పరీక్షించే విధానం గూడ వుంది. ఇంగ్ర్లీషుభాష నేర్చుకోవడానీకి ముందు విద్యార్ధికి భఖామాపరిజ్ఞానం సున్న భాష నేర్చుతున్నాం. భాష నేర్చుకొన్న తరవాత మూల్యాంకనం చేస్తున్నాం. మార్కులు వేస్తున్నాం. మాతృభాషా జోధదనలో అటువంటి విధానం ఏష్టానా వుందా అనీ 'ప్రశ్నించుకోవలసిన అవసరం వుంది.

బడి ఈడు విల్లలకు ఇదివరకే ఖావ తెలుసు. పిల్లలు తల్లిదండ్రుల నుండి తమ కంటె పెద్దవారి నుండి, ఇరుగు పొరుగు వారినుండి భాష నేర్చుకొంటారు. అవసరమైనంత మేరకు తమ ఖావాలను మాతృభాషలో వ్యక్తం చేయగల సామర్థ్యం వారికి వుంటుంది. అలాగే వ్యావహారిక అంటే చుట్టు పక్కబవాళ్ళు మాట్లాడే భాషను అర్ధం చేసుకునే సామర్థ్యం గూడ వుంటుంది. ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధి అక్షరాలు నేర్చుకున్న తరవాత పుస్తకాలు చదువుకొని విషయాన్ని గ్రహించగలడు. నాలుగు, ఐదు తరగతులు చదువుతున్న పిల్లలు చందమామ, బాల, బాలమిత్ర వంటి మాసపత్రికలు చదివేవారు కదా? కొందరు ప్రముఖ రచయితల విద్యాస్థాయి నాలుగు, ఐదు తరగతులే. పిల్లలకు అర్ధంకాని భాషలో రాస్తే అప్పుడు ఉపాధ్యాయుని అవసరం కలుగుతుంది. పిల్లలకు అర్థంకాని భాషలో రాసిన విషయాన్ని వారికి అర్ధం అయే భాషలో ఉపాధ్యాయుడు వివరించవలనిన అవసరం వుంటుంది. ఈ విషయాన్నే యేట్సుదొర గమనించాడు. వ్యావహారిక భాషోద్యమానికి ఇదే నాంది. పిల్లలు తమంతట తాము చదువుకొనే స్థాయికి తీసుకువెళ్ళడమే ఉపాధ్యాయుని విధి. ఉన్నత విద్యలో మనం బోధించేది భాషకాదు. సాహిత్యం. మన లక్ష్యం భాష తెలిసిన వారికి చదువు చెప్పడం. భాష నేర్పడం కాదు. భాషకు లేఖనానికి సంబంధం లేదు. ఇప్పటికీ లిపిలేని భాషలు చాలా వున్నాయి. ఒకే భాషను వేరు వేరు లివృులలో రాసే విధానం వుంది. ఉదాహరణకు సంస్కృతం.

చదువు, రాత ఎందుకు నేర్చుకోవాలి.

రాతలేకపూర్వం మానవుడు తాను నంపాదించిన జ్ఞానాన్ని

మౌఖికంగానే తరవాత తరాలవారికి అందించేవాడు. ఇప్పుడు దూర