పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒక భాషకు రెండు మూడు ప్రమాణ భాషలు ఉండటం, లేదా ఒకే భాష రెందు మూడు పేళ్లతో చలామణి కావటం కొత్త ఏమీ కాదు. భౌగోళిక దూరస్థితి, రాజకీయ కారణాలు, విస్తృత వ్యాప్తి - వైవిధ్య బాహుళ్యం : ఈ మూడు కారణాల వల్ల ఒక భాష అనేక ప్రాంతాలలో వేరువేరు పేర్లను కలిగి ఉండవచ్చు; లేదా ఒకే పేరుతో వేరువేరు ప్రామాణిక రూపాలను కలిగి ఉండవచ్చు.

భౌగోళిక దూరస్థితి వల్ల వేరువేరు ప్రామాణిక రూపాలు కలిగిన భాషకు ఇంగ్లీషును ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బ్రిటిష్‌ ఇంగ్లీషు, అమెరికన్‌ ఇంగ్లీషు, కెనడియన్‌ ఇంగ్లీషు, ఆస్హ్రేలియన్‌ ఇంగ్లీషు అని ఇంగ్రీషు భాష పలు ప్రామాణిక రూపాలను కలిగి ఉండటం మనం ఎరిగినదే. ఇండియన్‌ ఇంగ్లీషు కూడా ప్రామాణిక హోదాకు పోటీ పడుతున్నది. భౌగోళిక దూరస్టితి వల్ల ఒకే భాషకు రెండు పేర్లు ఉండటం కూడదా చూడవచ్చు. అవి ఉరుడు, దక్థిని. ఈ రెండూ కొన్ని మాండలిక భేదాలతో ఒకే భాష కానీ ఉత్తరాదిలో ఉరుదు అన్మీ దక్షిణాదిలో వక్థిని అనే రెండు పేర్లతో చలామణి అవుతున్నది.

రాజకీయ కారణాల వల్ల ఒకే భాషకు రెండు పేర్లు ఉండటం కూడా మన దేశంలోనే చూడవచ్చు. లక్షణపరంగానూ, వ్యాకరణ పరంగానూ ఉరుదు, హిందీ అనేవి రెండూ ఒకే భాష. కేవలం సంస్కృతసమాలు ఎక్కువ ఉండటం, దేవనాగరి లివిని వాడటం హిందీ ప్రత్యేకతలు అయితే, అరబిక్‌ లిపిని వాడటం, పర్షియో అరబిక్‌ పదాలు ఎక్కువగా వాడటం ఉరుదు ప్రత్యేకతలు. నిజానికి లక్నో వంటి ఉత్తరభారత నగరాలలోని బజార్లలో మాట్లాడే హిందీ- ఉరుదు భాషలలో సంస్కృత పద బాహుళ్యం, పర్షియో అరబిక్‌ పద బాహుళ్యం అనే ఖేదం కూడా కనిపించదు. ఈ ఖేదం తటస్థం (౧9౪౬121126) అయిపోయి రెండూ ఒకే విధంగా కనీపిస్తై. ఒక మతం వారు మాట్లాడితే ఉరుదు; మరొక మతంవారు మాట్లాడితే హిందీ.

విస్తృత వ్యాప్తి - వైవిధ్య బాహుళ్ళం అనే లక్షణం వల్ల వేరువేరు భాషలుగా వేరువేరు పేర్లతో వ్యవహరించ బదటానికి ప్రాచీన కాలంలోని ప్రాకృత భాషలను పేర్కొనవచ్చు. ప్రాకృతం ఆయా ప్రాంతాలలో మాగధి, శౌరశేని, ఇత్యాది పేర్లతో వ్యవహరించబదేది. ఈ భాషలలో వైవిధ్య బాహుళ్యం అధికంగా ఉందటం కాంత వరకు వీటి నామ వైవిధ్యాన్ని సమర్ధిస్తున్నప్పటికీ, వీటి మధ్య పరస్పర అవగాహన క్షమత్వం మరీ తక్కువ ఏమీ కాదు.

తెలుగును కూడా ఈ లక్షణం (విస్తృత వ్యాప్తి - వైవిధ్య బాహుళ్యం) కలిగిన భాషగా గుర్తించవచ్చు. తెలంగాణా రాష్ట్రం, సాగరాంధ్ర రాయలనీవమలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం అంతటా విస్తరించిన వలు పాంతాలు, కర్ణాటకలోని పలు (ప్రాంతాలు, ఒరిస్సా, చత్తిస్‌ఘర్‌, మహార్మాష్ట్రల లోనీ సరిహద్దు ప్రాంతాలు వ్యవహార సీమలుగా కలిగిన తెలుగు ఖాష సింగపూర్‌, శ్రీలంక, మలేశియా, మారిషన్‌ వంటి విదేశాలలోనూ తరతరాలుగా నీవసిస్తున్న వ్యవహర్తలను కలిగి ఉంది. రెండు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక వైవిధ్యం కలిగిన మాండలిక భేదాలను కలిగి ఉంది. ఇతర ర్యష్టాలలో కూడా మాండలిక భేదాలను కలిగి ఉంది. ఈ విధంగా తెలుగు భాష

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

విస్తృత వ్యాప్తి, వ్యవహార వైవిధ్యం కల భాషగా పరిగణించ వలసి ఉంది. కనుక ముందు చెప్పుకున్నట్లుగా తెలుగులో అనేక ప్రాదేశిక ప్రమాణ భాషలు అభివృద్ధి చెందటాన్ని స్వాగతించ వచ్చు; 'పోత్సహించవచ్చు.

అందులో ఒకటి తెలంగాణా తెలుగు కావచ్చు. రెండవది తమిళనారు, కర్ణాటకలలోని తెలుగు వ్యవహారాలను కలుపుకుంటూ రాయలసీమ తెలుగు కావచ్చు. లేదా రాయలసీమ తెలుగు ఒకటిగా ఉండి, తమిళనాడు కర్నాటక రా్రలలోని తెలుగు మరొక ప్రమాణ భాష కావచ్చు. అయితే, ఈ రాష్ర్రాలలోని తెలుగువారిలో తెలుగులో రాస్తున్నవారు ఇంకా తగిన సంఖ్యలో కనిపించటం లేదు. కనుక ఈ రాష్ర్రాలలోనీ తెలుగును రాయలసీమ తెలుగుతో అనుసంధానం చేసి 'పోత్సహించవచ్చు. ఇప్పుడున్న ప్రమాణ భాషను సాగరాంధభ్ర ('ప్రాంతానీకి ప్రమాణ భాషగా కొనసాగించవచ్చు.

ఇట్లా చెయ్యటం వల్ల మాతృభాషగా తెలుగు చదివే విద్యార్థుల తెలుగు భాషాపాటవంలో గుణాత్మకమైన మార్పువస్తుంది. దీనికి కారణం వారు చదివే తెలుగు తమ ప్రాదేశిక ప్రమాణ భాష కనుక అది వారి మాతృమాందలికానికి దగ్గరగా ఉండటమే... తెలుగు ఇంత విస్తృత వ్యాప్తి, ఇంత వైవిధ్య బాహుళ్యం కల భాష కనుకనే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిలో ఇప్పటి ప్రమాణ భాషకూ చాలా ప్రాంతాల విద్యార్దుల మాతృమాందడలికాలకూ దగ్గరి పోలికలు లేకపోవటం వల్ల మాతృభాషగా తెలుగు చదువు సంతృప్తి కరమైన ఫలితాలను ఇవ్వలేక పోతున్నది. ఇది విద్యావిషయికంగా చాలా ముఖ్యమైన అంశం.

ఈ విధంగా ఏర్పడ్డ అనేక (మూడు లేదా నాలుగు) ప్రామాణిక రూపాల మధ్య అవగాహన క్షమత్వం ఏవిధంగా ఉంటుంది? ఈ 'ప్రశ్చకు సమాధానం సులభమే. వ్యవహార విస్తృతి వలన, ఆధునిక యుగంలో విస్తృతంగా వచ్చిన ప్రచార మాధ్యమాలలోనీ వాడుక వలన ఈ ప్రాదేశిక ప్రమాణ భాషలను అన్ని ప్రాంతాలలోని మాండలిక వ్యవహర్తలు అర్థం చేసుకోటం కష్టం కాదు. రాయటానికి, మాట్లాడటానికీ కష్టం అయినా వినీ చదివి అర్దం చేసుకోటం కష్టం కాదు. కానీ అన్ని ప్రాదేశిక ప్రామాణిక రూపాల లోని, అన్ని మాండలికాలలోని పద సంపద మొత్తాన్ని కలుపుకొని అఖండ తెలుగు భాషకు సమగ్రమైన నిఘంటువు మాత్రం తప్పనిసరి. దానితో పాటుగా ప్రాదేశిక ప్రమాణ భాషానిఘంటువులు కూడా నిర్మించుకో వచ్చు. ఉన్నత విద్యాస్థాంయిలో అన్ని (ప్రాదేశిక వ్రమాణ ఖాషాప్రాంజాలలోనూ తక్కిన ప్రాదేశిక ప్రమాణ భాషలలో రాసిన కొన్ని పాఠ్యాంశాలు, ప్రాచీన సాహిత్యం నుంచి కొన్ని పాఠ్యాంశాలు చేర్చటం కూదా చాలాముఖ్యం.

న స్థాయిలో ఏ భాషణ రూపం వాడాలి? ప్రారంభ స్థాయి: ఇది పాఠశాలకు ముందు రెండు సంవత్సరాలు. తరగతులు పిల్లల ఇంటి పరిసరాలలో నెలకొల్పిన బడులలో జరగాలి. ఈ స్థాయిలోని కలాపాలు (2011169) బోధన రూపంలో కంటె పిల్లలను బడికి తయారు చేసే విధంగా ఉండాలి. ఆటలు, పాటలు,