పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మానవతా విలువలను పెంపొందించటంతో బాటుగా, సామాజిక పురోగతికి మార్గదర్శనంగా కూడా ఉంటుంది కనుక సామాజిక శాస్త్రాల అధ్యయనం, సాహిత్య శాస్త్ర శైలీ శాస్త్రాల అధ్యయనం కూదా అవసరం అవుతుంది.

వీటన్నిటినీ అర్ధవంతంగా నిర్వహించాలంటే భాషలోని అన్ని వైవిధ్యాలనూ సమగ్రంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. భాషలోని వైవిధ్యాలు = ఏక రూపత ప్రాధాన్యం

ఖాష నిత్య పరిణామ శీలి అనే విషయం ఇప్పుడు కొత్తగా చెప్ప నక్కర లేదు. ఈ లక్షణం వల్లనే భాషలో వైవిధ్యం బహుముఖీనంగా ఉంటుంది. అయితే భాషకు గల సహజ వినియోగానికి ఈ వైవిధ్యం ఎటువంటి ఇబ్బందులనూ కలిగించదు. మానవ నమాజాలు సాధించిన సంస్కృతి కారణంగా భాషకు అనహజ వినియోగం ఏర్పడుతుంది. జంతు వశ నుండి మానవుడు పరిణామం చెందిన క్రమంలో వాక్సంకేతాలతో భావ వ్యక్తీకరణ చేసే సాధనంగా భాష ఏర్పడింది. నంథుజీవిగా అవతరించిన మానవుడు తోటి మానవులతో సహకరించుకోటానీకి అవసరం అయిన నంవాద సాధనంగా భాష పనిచేయటం మొదలుపెట్టింది. ఒక గుంపులోని సభ్యులు పరస్పరం సహకరించుకోటానీకి ఒకరి అఖిప్రాయాలనూ ఖావాలనూ మరొకరికి తెలపటం, ఇతరుల అభిప్రాయాలకు స్పందించటం అవసరం. ఇది మాత్రమే ఖాషకు గల సహజ వినియోగం. మానవుడు ప్రకృతి జీవనం నుండి విడిపడి సంస్కృతిని అలవరచుకున్నాడు. సంస్కృతి అంటే మార్చు. అంటే సహజంగా ఉన్నదాన్ని మార్చుకోటం. ఉదాహరణకు, ఆహారం తీసుకోటం సహజమే దాన్ని తయారు చేసుకొని తినటం మార్పు. అదే సంస్కృతి. ఆహారం తయారు చేసుకోటం, వ్యవసాయం, వస్త్రధారణ, వస్తూత్పత్తి, ప్రభుత్వం - పరిపాలన, సాహిత్యం, సంగీతం, కళలు, ఉపన్వాసాలు, రచనలు, శాస్త్ర సాంకేతిక విద్యల అభివృద్ది, వాటిని బోధించటం, మొదలైవవి. వీటన్నీటిలోనూ భాష తప్పనిసరి. ఈ క్రమంలో భాషకు గల స్థల-కాల పరిమితులను అధిగమించటానికి లిపి కనిపెట్టటం జరిగింది. తద్ద్వారా భాషను మాటల రూపంలోనే కాకుందా రాత రూపంలో వాడుక చేయటం మొదటైంది. ఇది అంతా భాషకు అసహజ వినియోగమే. ఇక్కడ అసహజం అనే మాటను అదొక “దోషం”గానో కూడదనిది గానో పరిగణించ వలసిన పని లేదు. ఇది మానవ పరిణామ క్రమంలో భాగమే. సహజం కానిది అని చెప్పటమే ఇక్కడ ఉద్దేశం. ఈ విధంగా ఏర్పడిన అసహజ వినియోగం కారణంగా ప్రత్యేక సందర్భాలలో భాషించటమే కాకుంచా 'ప్రత్వేక పద్దతులలో రాయటం ఎక్కువ అయింది. రాసే విషయాన్ని - అది సాహిత్యం కానీవ్వండది, శాస్త్ర విషయం కానీవ్వంది, పాలనాంశం (26%01015- 206 గగ కానీవ్వండి పలు (ప్రాంతాలకు, పలు కాలాలకు అందే విధంగా రాయ వలసిన అవసరం ఏర్పడింది. భాషలోని స్థానిక, వైయక్తిక వైవిధ్యాలను అధిగమించి ఒక (ప్రామాణిక రూపాన్ని భాషకు సమకూర్చు వలసిన అవసరం ఏర్పడింది. రాత వల్లనే ప్రామాణిక భాష యొక్క అవసరం ఏర్పడుతున్నది. భాషను కేవలం వా[గూపంలోనే వాడుతుంటే ప్రామాణిక భాష అవసరం ఉందేది

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

కాదు. ఇక్కడ ప్రామాణిక” అనే పదాన్ని “అదేదోగొప్పది” అనే అనవసరపు విలువను జోడించి అర్ధం చేసుకోకూడదు. కేవలం “అందరికీ వర్తించే ఒకే రూపం కలిగినది” అని మాత్రమే గ్రహించాలి. అణాలు పైసలు, తులాలు వీసెలూ, సోలలూ మానికలూ, మైళ్ళు ఫర్లాంగులు, అడుగులు గజాలు వదిలేని మెట్రిక్‌ మానాలను ప్రవేశపెట్టినట్లుగా అన్నమాట.

ప్రాభీన కాలంలో ఇటువంటి పరిస్థితులలోనే ఏర్పడిన ఖాష సంస్కృతం. మధ్య యుగాలలో తెలుగులో ఏర్పడిన భాషావిశేషమే కావ్యభాష లేదా గ్రాంధికభాషు ఆధునీక యుగంలో భాషాశాస్త్రవేత్తలు ప్రతిపాదించే రూపమే ప్రామాణిక భాష. దాని లక్షణం అన్ని మాండలికాల నుంచి నైఘంటిక రూపాలను (= నామ ప్రాతీపదికలను, క్రియా ధాతువులను, విశేషణ -క్రియావిశేషణ రూపాలను) [గ్రహించి సంయోజన-నీష్పన్న ప్రక్రియల వల్ల ఏర్పడే (= ప్రకృతి-ప్రత్యయాల కలయిక వల్ల ఏర్చదే) సాధ్య రూపాలలో ఏక రూపత. ప్రామాణిక భాషా లక్షణాన్నీ మరొక విథంగా చెప్పాలంటే సిద్ధ రూపాలలో వైవిధ్యం, సాధ్య రూపాలలో ఏక రూపత. సెద్ధరూపాలను అన్ని మాండలికాల నుంచి గ్రహించాలి; సాధ్య రూపాలను విద్యావంతులలో బహుళవ్వావ్లి (ప్రమాణంగానూ, (ప్రామాణిక సాహిత్యంలో పాతుకుఫోంయిన రూపాలకు దగ్గరగా ఉండే విధంగానూ రూపొందించుకోవాలి. అది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది అనే భావన కలిగించకుండా ఉండటం మిక్కిలి అభిలషణీయం. అట్లా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది అనే భావన కలిగేవిధంగా ఉంటే తక్కిన 'ప్రాంతాలవారిలో తాలి దశలో తమ భాష సరి అయినది కాదేమో ననే ఆత్మన్యూనతా భావం ఏర్పడటం, మలి దశలో అట్టి ప్రామాణిక భాష మీద మన్నన తగ్గిపోవటం అనే వ్యతిరేక పరిస్థితులు తలెత్తుతై. ప్రస్తుతం ప్రామాణిక తెలుగు విషయంలో అదే జరిగింది.

ప్రాచీన భాషావిషయంలో అన్ని మాండలికాలనూ కావ్యభాషలోకి గ్రహించవచ్చు. అని వ్యాకరణాలు నిర్దేశించినై - మాదలికాలు అనే ప్రస్తావన లేకుండానే. “త్రిలింగ దేశ వ్యవహార సిద్దంబగు భాష దేశ్యంబు అని చెప్పి దేశ్వానికి - అంటే మాండలిక వ్యవహారానికి ఆ కావ్య ఖాషా గౌరవాన్నీ సమకూర్చినై. కేవలం లక్షణం చెప్పవలసిన “సాధ్యరూపాలను” మాత్రమే వ్యాకరణంలో చెప్పినట్లుగా వాడాలి అనే ఉద్దేశంతో “లక్షణ విరుద్ధంబగు భాష (గ్రామ్యంబు” అని, దాన్నీ కావ్యాలలో వాడకూడదు అని చెప్పి, లక్షణ విరుద్దమైన రూపాలను కూదా పెద్దవాళ్ళు (ఆర్యులు, గొప్ప కవులు) వాడినవాటిని “అనింద్య గ్రామ్వాలుగా పరిగణించ వచ్చు; వాటిని గ్రహించవచ్చు అని కూడా వెసులుబాటును కల్పింఛినై. కనుక భాషలోని వైవిధ్యాల అధ్యయనం ఏక రూపకమైన ఒక ప్రామాణిక భాషను పరిపుష్టం చేయటానికే.

ప్రాదేశిక ప్రమాణ భాషలు

తెలుగు వంటి పలు ప్రాంతాలకు, పలు రాష్ర్రాలకు వ్యాపించి ఉన్న భాష అందునా వ్యవహర్తల విద్యాస్థాయి. తక్కువకావటం వల్ల మాండలిక వైవిధ్యం అధికంగా ఉన్నభాష ఒకే ఒక ప్రామాణిక రూపంతో మనుగడ సాగించలేదు. కనుక మూడు గానీ నాలుగు గాని ప్రాదేశిక ప్రమాణ భాషలకు అవకాశం కల్పించవచ్చు.