పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎదుర్కొని నిలవాలంటే ఇతోధికంగా పరిపుష్టిని సాధించి అభివృద్ది చెందవలసిన అవసరం ఉంది. పరిపుష్టి సాధన కారకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వనరులను బేరీజు వేసుకోవలసి ఉంటుంది. ఒక భాషలోని వైవిధ్యాన్ని బేరీజు వేయటం ద్వారా ఆ భాషలోని వనరులను అంచనా వేయటం సాధ్యం అవుతుంది.

ఒక భాషలో ఎంతమంది వ్యవహర్తలుంటారో అంత వైవిధ్యం ఉంటుంది అనీ ఇంతకు ముందు చెప్పుకున్న మాట సిద్ధాంత వరంగా సరి అయినదే. కాని ఆ వైవిధ్యం - ప్రాంతాలను బట్టి ఉండే వైవిధ్యం లాగా - సాధారణ పరిశీలనకు అందేది కాదు. కనుక భాషలోని వైవిధ్యాన్ని ప్రాంతాలను బట్టి, వృత్తి-సమాజాలను బట్టి పరిశీలించవలని ఉంటుంది. సాధారణంగా ఒక భాష ఏర్పడ్డ ఆదికాలంలో వైవిధ్యం ఉండటానికి వీలులేదు. గుర్తించదగిన వైవిధ్యం లేని ఏకరూపతే ఆదిమ కాలపు భాషాలక్షణంగా చెప్పుకోవచ్చు. ఆ భాషాసామాజికులు ఇతర ప్రాంతాలకు విస్తరించిన తర్వాతనే భాషలలో వైవిథ్యం చోటు చేసుకాని క్రమక్రమంగా పెరగటం జరుగుతుంది. అట్లా పెరిగిన వైవిధ్యం రెండు ప్రాంతాలవారి మధ్య పరస్పర అవగాహన క్షమత్వానికి భంగకరం కానంతవరకు అది ఆ భాషకు లోబదే ఉంటుంది. క్షమత్వానీకి భంగం కలిగినప్పుడు ఆ రెందు ప్రాంతాల వారి భాషణపు అలవాట్లు రెండు వేరువేరు భాషలుగా గుర్తించబడతై. కాన, సంవాద (600000600102100) సౌకర్యాల అభివృద్ది కారణంగా నేటి ఆధునిక యుగంలో ఒక భాష రెండు భాషలుగా విడివడిఫోవటానికి అవకాశాలు లేవనే చెప్పాలి. భాషలోని వైవిధ్యం ఎన్ని రకాలుగా ఉండవచ్చు?

ఒక భాషలోని వైవిధ్యానికి గల కారణాలను బట్టి ఆ వైవిధ్యం అన్నీ రకాలుగా ఉంటుంది అనీ చెప్పవచ్చు. వ్యక్తి వృత్తి ప్రాంతం, విషయం, సాహిత్యం కారణాలుగా భాషలలో వైవిధ్యాలు ఏర్పడతై. ఇందులో వ్యక్తి కారణంగా ఏర్పడే వైవిధ్యాలను భాషాశాస్త్రంలో వైయక్తికాలు (1010168019) అంటారు. వృత్తి వల్ల, ప్రాంతం వల్ల ఏర్పడే వైవిధ్యాలను వమాందలికాలు 6012180156) అంటారు. మాండలికాలలో వృత్తి కారణంగా ఏర్పడేవి వృత్తి మాండలికాలు, ప్రాంతం కారణంగా ఏర్పడేవి ప్రాంత మాండలికాలు. విషయం కారణంగా గుర్తించదగిన భాషాలక్షణ వైవిధ్యాలు వైషయికాలు (19819169). సాహిత్యపరమైన వైవిధ్యాలు శైలీఖేదాలు.

ఒక్కొక్క వ్యక్తి యొక్క భాషణపు అలవాట్లలోని ఖేదాలవల్ల కలిగే వైవిధ్యాలు అనదగిన వైయక్తికాలను గుర్తించటం కష్టమే. అవి అతి సూక్ష్మమైనవి కావటంవల్ల వాటిని మాండలికాల అధ్యయనంలో ఖాగంగా గ్రహించటం చాలా వరకు అంగీకార యోగ్యం అవుతున్నది. వ్యక్తుల అనుభవాలు కూడా భాషావైవధ్వాలకు కారణం అవుతై. పిల్లలకు ఉందే జీవితానుభవం వేరు, పెద్దలకు ఉందే జీవితానుభవం వేరు; అదే విధంగా ప్రీల జీవితానుభవం, పురుషుల జీవితానుభవం వేరువేరుగా ఉంటుంది. ఆ విధంగా ఒక భాష పిల్లలలోను, పెద్దలలోను, ప్రీలలోను, పురుషులలోను కొన్ని వేరువేరు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ అంశం మీద ఎక్కువగా కృషి జరగలేదు.

అట్లాకాక, పరస్పర అవగాహన

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి ఆ ఖజనవరి-2022 |

అది జరగవలసిన అవసరం ఉంది. ఆర్థిక స్థితిగతులు కూడా భాషలోని వైవిధ్యానీకి కారణం కావచ్చు. వాటినీ సాధారణంగా వృత్తి మాండలికాలలో భాగంగా వరిశీలించటం జరుగుతున్నది. వీటన్నిటినీ ౪౭౧1021 ౪౬గ౧4%0౧08 అనీ, ప్రాంత మాండలికాలను ౧011200121] ౪21008 అనీ వ్యవహరించటం కూడా ఉంది. తెలుగులో ఇటువంటి సూక్ష్మ పరిశీలనలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఇంతకు ముందు సాహిత్య అకాడెమీ, తెలుగు అకాడెమీలు వృత్తి మాండలికాల మీద, ప్రాంత మాండలికాల మీద విలువైన అధ్యయనాలను వెలువరించినై. అయినప్పటికీ ఆ అధ్యయనాలు జరిగి చాలా కాలం గతించింది కనుక వాటి అధ్యయనం మరింత సూక్ష్మ స్థాయిలో మళ్ళీ చేపట్ట వలసిన అవసరం ఉంది.

ఇంతవరకు చెప్పుకున్న భాషా వైవిధ్య కారకాలు సామాజిక మ్రైనవి. తక్కిన రెండింటిలోను 'వైషయికాలు” (1881581809) విద్వారంగానికి చెందినవి. ఆయా విషయాల (84060619) బోధనలో వాటిని గుర్తించి వినియోగించటం వల్ల ప్రయోజన కరంగా ఉంటుంది. ఇక శైలీ భేదాలు సాహిత్యంలో కనిపిస్తై. శైలీఖేదాల అధ్యయనం వల్ల అవగాహన, ఆస్వాదన, సాహిత్య జోధన సులభతరం అవుతుంది. ఆయా భావాల అఖివ్వక్తిలో భాష యొక్క సామర్థ్యం, ఆ కవి లేదా రచయిత యొక్క సృజన శక్తి మూల్యాంకనం చేయటానికి వీలు అవుతుంది.

తెలుగు ఇప్పుడు రెండు రాష్ర్రాలలో ముఖ్యభాషగా ఉన్నప్పటికీ, దక్షిణాది లోని ఇతర రాష్ట్రాలలో కూదా తెలుగువారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఉత్తరపు సరిహద్బ రాష్ర్రాలలోకూడా చెప్పుకో దగిన సంఖ్యలో తెలుగువారు ఉన్నారు. వారందరూ తరతరాలుగా అక్కడ నీవస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఆధునికపు నాగరక యుగంలో విద్య-పాలన-సమూహ సంవాదం (8046021100 - 2000101920 - ౧68 60గ౧౧౫౪౮౧|౦౭|0౧) అనే రంగాలలో భాషావినీియోగం ఆధునీకతకు, అభివృద్దికి చిహ్నం. ఈ రంగాలలో భాషను సమర్ధంగా వినియోగించాలంటే ఆ భాష అభివృద్ధి చెంది ఉండాలి. అందుకు ఖాషలోనీ వద వనరులను అన్నిటిని సేకరించి ఒక బృహన్నీఘంటువును, ఆయా రంగాలకు చెందిన వైషయిక పద కోశాలను నిర్మించవలసిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన ఇతర భాషల లోనించి ఆయా విషయాలకు సంబంధించిన (గ్రంథాలను అనువాదం చేసుకోవలసిన అవసరం ఉంది. అందుకు అనువావ నిఘంటువులను కూడా నిర్మించుకోవలసిన అవసరం ఉంది. కేవలం శాస్త్రసాంకేతిక రంగాలలో సాధించే అఖివృద్ది సమాజపు సమ్మగ అభివృద్ధి సాధనకు సరిపోదు. మానవీయ శాస్త్ర రంగాలలోనూ, ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ అభివృద్ది సాధించి సమాజంలోని వ్యక్తులలో మానవీయ విలువలను పెంపొందించ వలసిన అవసరం ఉంది. అందుకు మానవీయ శాస్త్ర గ్రంథాలను, ముఖ్యంగా సాహిత్య గ్రంథాలను మన భాషలోకి, మన భాషలోనించి ఇతర భాషలలోకి అనువదించుకో వలనిన అవసరం ఉంది. అందుకు సాహిత్య అధ్యయనాన్ని మరింతగా ప్రోత్సహించవలసి ఉంటుంది. సాహిత్య అధ్యయనం సులభతరం, అర్థ వంతం చేయటానికి - సాహిత్యం