పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రజలలో కొంతమందిలో హిందీ వ్యతిరేకతను, కొంతమందిలో తమ మాతృభాషా సంస్కృతుల పట్ల ఉదాసీనతను లేదా తక్కువ భావనను కలిగించేందుకే తోద్చడినై.

ఇక భాషాప్రయుక్త రాష్ట్రాల విషయానికి వస్తే ఈ ప్రక్రియ కాన్ని ప్రధాన భాషలకు, ఎన్నో చిన్నచిన్న భాషలకూ నష్టాన్ని కలిగించింది. కేంద్ర 'ప్రభుత్వాలలోని విధాన స్టోతలకు హిందీ మీదనే తద్ధ ఉండటం, తక్కిన భారతీయ భాషల మీద ఉందవలసినంత శద్ద లేకపోవటం దీనీకి కారణం.

భాషాప్రయుక్త రామ్ష్రైాల వల్ల అధికంగా నష్టపోయిన ఖాష తెలుగు. అప్పట్లో తెలుగు దక్షిణాది అంతటా వ్యాపించిన భాష - తమిళనాడులో తెలుగు మాట్లాడే కుటుంబం ఒక్కటైనా లేని గ్రామం ఒక్కటి కూడా లేని పరిన్టితి నుంచి ఇవ్చుడు తెలుగు వినిపించని పరిన్టితికి దిగజారింది. త్యాగరాజు పుణ్యమా అని కర్నాటక సంగీత సభలలో తప్ప. ఆంగ్లేయులు కూడా అప్పటి నాణేలమీద తెలుగు, బెంగాలీ, ఉరుదు, నాగరి లిపులలో వాటి విలువను ముద్రించారు. ఇంతటి ప్రాచుర్యం కల తెలుగు భాష తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, మహార్యాష్టలలో తన ఉనీకిని కోల్పోయింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీలకు సమాన గౌరవం ఉందేది. ఎవరి భాషను వారు తలెత్తుకొని దర్జాగా మాట్లాడేవారు; నేడు ఆ పరిస్థితి లేదు. దీనికి కారణం: మాది తమిళనాడు; మా ర్యాష్ట్రం తమిళ రాష్ట్రం అనే భావన. ఆంధ్ర రాష్ట్రం విడిపోగా అప్పటి మిగిలిన మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు 40 శాతం. కర్నాటకలో తెలుగువారు 380 శాతం. అప్పుడు తెలుగు పరిస్థితి గౌరవప్రదంగానే ఉండేది; క్రమంగా అది క్షీణించింది. అంత శాతం ప్రజలు ఉండి కూడా పాఠశాలలలో ప్రభుత్వాల కుయుక్తుల వల్ల తెలుగు తరగతులు మూత పథ. పదవ తరగతిలో తెలుగు ఉంటుంది; కింది తరగతులలో ఉండదు; ఉన్నా ఉపాధ్యాయులు ఉండలు. ఇటువంటి వరిన్సితులు ఏర్పడటానికి కారణం భాషాప్రయుక్త రామ్ష్రాలు.

భారతదేశంలో మాచ్చభాషల దుస్థితికి మూడవ కారణం అంగ్ల మాధ్యమంలో విద్యాబోధన. ఇక్కడ ప్రధానంగా గుర్తించ వలసిన అంశం ఏమిటంటే ఆంగ్ల మాధ్యమమే మాతృభాషల దుస్థితికి కారణం కాని ఆంగ్లభాష కాదు. ఆంగ్లం భారతీయ భాషల ఎదుగుదలకు అడ్డంకి; దాన్నీ వదిలెయ్యాలి అని హిందీ జెత్సాహికులు వాదిస్తారు. ఎందుకంటే అంగ్లం పోతే ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించటం సులభం అని. ఒక సబ్జెక్టుగా ఆంగ్లం అందరూ నేర్చుకోవాలి; బాగా నేర్చుకోవాలి. బాహ్య ప్రపంచంతో అనుసంధానం కావటానీకి ఆంగ్లం ఎంత అవసరమో ఎంతో మంది ఎంతో చెప్పారు. దాన్నీ ఇక్కడ నేను మళ్ళీమళ్ళీ చెప్పదలచుకోటం లేదు.

ఆంగ్గమాధ్యమం వల్ల మాతృభాష ఒక నబ్జెళ్ళు స్థాయికి దిగజారుతుంది. విద్యార్థులు మాతృభాషలో ఒక విషయం మీద సాధికారంగా మాట్లాదే శక్తి సంపాదించుకో లేరు. ఒక తరం గడిచే సరికి ప్రజలలో ఏ సామాన్య విషయం మీద కూడా మాతృభాషలో అభివ్యక్తి చేసే శక్తి శూన్యం అవుతుంది. ఒక సబ్జెక్టుగా చదివే

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

మాతృభాషలోని సాపొత్యపు పాలు కూడా అంతంత మాత్రం కావటంతో మాతృభాషలో సృజన శక్తి బలహీన పడి ఒకటి రెందు తరాల తర్వాత పూర్తిగా లోపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక సందర్భంలో ఆచార్య భ్మద్రిరాజు కృష్ణమూర్తి గారు అన్నట్లుగా మాతృభాషలో కవిత్వం గాని, ఒక కథ గాని, ఒక నవల గాని రాయ గలవారు కనీపించరు. ఆయనే అన్నట్లుగా అది ఆ భాషకు అంతిమ కాలాన్ని దగ్గరపరుస్తుంది. భాషను కోల్పోయిన జాతి తన సంస్కృతీ మూలాల నుండి విదిపడిపోతుంది. చివరికి తన అస్తిత్వాన్నీ కోల్పోతుంది. కనుక ఈ అంశాలన్నీ మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన యొక్క ఆవశ్యకతను బలపరుస్తున్నై మాధ్యమం ఏదైతే నేం సాహిత్యాన్ని ఒక విషయంగా చదివే విద్యార్థులు కొందరు ఉంటారు కదా! వారి వల్ల ఆ భాషలో సాహిత్య సృష్టి జరగదా? అని మనం ప్రశ్నించవచ్చు. కాని తక్కిన విషయాలలో పరిజ్ఞానం చాలినంత లేకుండా కేవలం సాహిత్య అధ్యయనంతో సృజనాత్మకత పెంపొందదు. టశ్రీశీ వంటి మహాకవులు తమ విద్యాకాలంలో సాహిత్య విద్యార్థులు కారు. అనలు, సృజన అనేది కేవలం సాహిత్యానికే కాదు సైన్సుకు కూడా అవసరమే. సృజన వల్లనే సైన్సు నుండి టెక్నాలజీ పుడుతుంది. ఇక్కడ ఆంగ్ల మాధ్యమం మాత్చభాషలకు హానికరం అంటున్నది కేవలం హైస్కూలు స్థాయిలో మాత్రమే కాదు, యూనివర్సిటీ స్థాయిలో కూడా. అన్ని స్థాయిలలోనూ మాతృభాషా నమూధ్యమంలో చదివినవారే సృజన శిఖరాలను అధిరోహించ గలుగుడారు. క మాచ్చభాషల పరిరక్షణకు ఏం చెయ్యాలి?

దీనికి ఒకటే సమాధానం: అన్ని విషయాలనూ మాతృభాషలోనే అభ్యయనం చెయ్యాలి. అట్లా ఒకటి రెండు తరాలు గడిచే సరికి మాతృభాష స్థిరంగా నిలిచిపోతుంది; అఖివ్బద్ధి చెందుతుంది. కానీ ఈ దేశంలో అది అంత సులభం కాదు. అందులో పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు మన మాతృభాష అధ్యయనం అంతా తెలుగులోనే జరగాలి అంటే అది ఏ తెలుగు? ఇంటి భాషా? ఊరి భాషా? ఒక సామాజిక వర్గపు భాషా? ఒక ప్రాంతపు భాషా? ఇవి అన్నీనా? వీటికి సమాధానం చెప్పటానికి కొన్ని విషయాల వివరణ అవసరం. అవి: భాష్య భాషలో వైవిధ్యం; ప్రమాణ భాష్య ఏ స్థాయిలో ఏ రకమైన భాష వాడాలి? అనేవి. వీటిని స్థూలంగా తెలుగుకు అన్వయించి చెప్పుకుందాం.

భాష - భాషలోని వైవిధ్యం

అసామాన్యుల నుంచి సామాన్యుల వరకు అందరికీ అతి పరిచయమైన, అందుబాటులో ఉన్న భావ ప్రకటనా వ్యవస్థ భాష ఆ విధంగా అది అందరి నోళ్ళల్లో నానుతూ ఉంటుంది. దాన్ని ఎంతమంది మాట్లాడ్దారో అన్ని రకాల వైవిధ్యాన్నీ కలిగి ఉంటుంది. కనుక ఒక భాషలోని వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది. అట్లా ఎందుకు అంటున్నానంటే భాషా సమాజాలలో ఒక పక్క తమతమ భాషల పట్ల స్పృహ పెరుగుతున్నప్పటికీ, మరొక పక్క ప్రపంచీకరణ ప్రభావం వల్ల మాతృభాషలు నిర్లక్ష్యానికి గురికావటం చూస్తున్నాం. తెలుగు వంటి భాషలు ఈ పరిస్థితిని