పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

౯ ెలుగునుడి -ె

మాతృభాషలు

కొద్ది గొప్ప తేడాలతో మన దేశంలో మాతృభాషల స్థితి ఒకేవిధంగా ఉంది. దీని గురించి వివరించటానికి రెండు అంశాలను పరిశీలించవలసి ఉంది. అవి: 1. భారతదేశంలో మాతృభాషల దుస్థితి లేదా క్షీణతకు కారణాలేమిటి? 2. మాతృభాషల పరిరక్షణకు ఏం చెయ్యాలి? 1. భారతదేశంలో మాతృభాషల దున్శితి లేదా క్షీణతకు కారణాలేమిటి?

మన దేశంలోని మాతృభాషల దుస్థితి లేదా క్షీణతకు మూడు కారణాలు చూవవచ్చు. అవి: అధికార భాషగా హిందీ; భాషాప్రయుక్త రాష్ట్రాలు; అంగ్ల మాధ్యమంలో విద్యాబోధన.

హిందీభాషా బెత్సాహికులు చెప్పినంత కాకపోయినా హిందీని ఖడీబోలీగా గాని, కొంతవరకు ఉరుదుగా గాని ఈ దేశంలో (మెజారిటీ ప్రజలు కాదనుకోండది) చాలా మందే మాట్లాడతారు. అట్లా చాలామంది మాట్లాదే భాషను అధికార భాష చెయ్యటం వల్ల ఆ చాలామందికి ఆధిపత్య భావన, వారిలో కొందరికి ఇతర భాషల పట్ల చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉంది. హిందీవారు ఆయా భాషాప్రాంతాలలో నీవసిస్తూ కూదా ఆ భాషలను నేర్చుకోకపోవటం మొదటి నుంచీ ఈ దేశంలో చూస్తున్నాం. అదే విధంగా తక్కిన భాషలవారిలో కొందరికి హిందీ పట్ల వ్యతిరేకత, కొందరికి ఉదాసీనత, కొందరికి ఆత్మన్యూనతా భావం కాదనలేనీ నిజాలు. ఈ విధంగా ఈ దేశంలో హిందీ విషయంలో భాషాపరమ్టైన సుహృద్భావం లోపించింది అని చెప్పవచ్చు. హిందీ వారు కూడా ఇతర భాషలను గౌరవించి వారి హృదయాలను గెలుచుకో లేకపోయారు. ప్రభుత్వం హిందీ సినిమాలను ఎక్కువగా ప్రోత్సహించి, వాటి ద్వారా హిందీని ఇతర భాషీయులలో కాంత వరకు పాపులర్‌ చేయగలిగింది, కానీ ఆ అనుకూలతని హిందీ ఖాషీయుల అత్యుత్సాహ ధోరణులు, ఆధివత్య దోరణులు సొవ్ము చేసుకోనీవ్వలేదు. హిందీ సినిమాలు కూడా సెన్సార్‌ బోర్డ్‌ వారి పక్షపాత ధోరణుల వల్లే దేశంలో పాపులర్‌ అయినై కానీ, ప్రజలలో వాటి మీద ఇష్టం ఉండి కాదు. దీనికి రుజువు కావాలంటే 1950- 60ల నాటి సినీమాలు గుర్తు చేసుకోవాలి. సెన్సార్‌ వారు హిందీ సినిమాలలో 9ఆ% 2౧6 ౪1016008 ను ఎక్కువగా అనుమతించి, తెలుగు మొదలైన ఇతర భాషల సినిమాలలో అనుమతించకపోవటం వల్ల ఈ భాషలలో (ప్రజలను ఆకర్షించటానికి నీర్మాతలు పౌరాణిక జానపద ఇతివృత్తాలతో ఎక్కువ సినిమాలు తీయవలసి వచ్చింది. ఆనాడు హిందీ సినిమాలకు మార్కెట్టు కూడా హిందీతర ప్రాంతాలలోనే. 1960లలోని తాలి సగంలో ఉత్తరప్రదేశ్‌ మొత్తంలో ఉన్న సినిమా వోళ్ళ కంటె ఒక్క విజయవాడలోని సినిమా వోళ్ళ సంఖ్య ఎక్కువ. యువతను ఆకర్షించే 86% 2౧౮ ౪1016006 కారణంగా ఆ కాలంలో

| తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఆ జనవరి-2022 |

పదిమి రామనరసింహం 9849316730

- విద్యాబోధన

యువత హిందీ సినిమాలు చూడకుండా ఉండలేకపోయారు అని చెప్పాలి.

హిందీ ఏ విధంగా మాతృభాషల క్షీణతకు కారణం అయింది? అధికార భాషగా హిందీ ఎంపికను సమర్థించటానికి దానికి లేని మెజారిటీని అంటగట్ట వలసి వచ్చింది. అందుకు నేడు హిందీ రామ్రాలుగా చెప్పబడుతున్న ర్యాష్ట్రాలలోని స్థానిక భాషలైన అవధి, (బ్రజ, హర్వాన్వీ, బుందేల్‌ ఖండీ, గద్వాలీ, మొదలైన అనేక భాషలను హిందీ ఖాతాలో జమకళట్టి, వాటికి పాఠశాలలో చోటు లేకుందా చేశారు. క్రమంగా ఆ భాషలు అంతరించి పోయే పరిస్దితి కల్పించారు. సుమారు 220కి పైగా భారతీయ భాషలు కనుమరుగైనై అని ఐక్యరాజ్య సమితి చెప్పింది అని జాతీయ విద్వావిధాన పత్రంలో చెప్పుకున్నారు. వాటిలోని చాలా భాషలు హిందీ ఆధిపత్య సాధన ప్రక్రియలో ఆత్మార్పణం చేసుకున్నవైే. హిందీకి మెజారిటీ చూపటానికి ఆ నాడు హిందీలో జమకట్టిన ఎన్నో ఖాషలకు తర్వాతి కాలంలో కేంద్ర సాహిత్య అకాడెమీ గుర్తింపు ఇచ్చింది. ప్రభుత్వం రాజ్యాంగం ఎనిమిదవ 'షేడ్యూల్‌ లోళూడా చేర్చింది; మరికాన్ని ఇప్పుడు చేరబోతున్నై (రాజస్టాని ... ) ఇతర ర్యాష్టాలలో పనిచేస్తున్న కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువులో వారి మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా వారిని హిందీ భాషీయులుగా మార్చివేయటం జరుగుతున్నది. లోగడ కొన్ని చోట్ల బి.కామ్‌.లో రెండవ భాషగా హిందీని నీర్చంథం చేసి ఆ విద్యార్థులకు తమ మాతృభాషలో తగినంత ప్రావీణ్యాన్ని పొందలేని పరిస్థితి కల్పించటం జరిగింది. దూరదర్శన్‌ వచ్చిన తొలి దశలో చాలా సంవత్సరాల పాటు హిందీ కార్యక్రమాలకు పెద్దపీట వేసి, తెలుగు వంటి భాషలకు చాలా తక్కువ సమయం శేటాయించారు. ఆ సమయంలో కూడా చవకబారు కార్వకమాలతో మన తెలుగు కార్యక్రమాలు బాగుండవ్వు హిందీ కార్యక్రమాలే బాగుంటై అని తెలుగువారే అనుకునేట్లు చేశారు. ఉదాహరణకు, ఢిల్లీ నించి దూరదర్శన్‌లో రామానంద సాగర్‌ రామాయణాన్ని ప్రసారం చేస్తూ అదే సమయంలో హైదరాబాదు టివిలో పిల్లలతో తీసిన ఒక చవకబారు రామాయణం కార్యక్రమాన్ని సీరియల్‌గా ప్రసారం చేశారు. అధికార భాష మాత్రమే అయిన హిందీని జాతీయ భాషగాను, “120౧862885 01 18 ఆ౧10౧ 902 06” అని చెప్పబడిన తెలుగు వంటి భాషలను ప్రాంతీయ భాషలుగానూ ప్రజలకు తలకు అంటే విధంగా ప్రచారం చేశారు. ఈ విధంగా హిందీ సినిమానూ, టివిని, మీడియాను, సంస్కృతిని “జాతీయ అనే విశేషణం తోనూ, తక్కినవాటిని ప్రాంతీయ అనే విశేషణంతోనూ స్థిరపరచారు. పొందీని పాపులర్‌ చెయ్యమనే సూచన రాజ్యాంగంలో ఉన్న మాట నిజమే. కాని అందుకు ప్రభుత్వాలలోని హిందీ బెత్సాహికులు అనుసరించిన పద్దతులు హిందీయేతర