పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సమీక్ష

వేణుగాన పరవశము

వేణూనాదం

రచన : డా.నాగసూరి వేణుగోపాల్‌ ఫోన్‌:94407 32392 పుటలు: 240, వెల :200/- ప్రతులకు : నవోదయ బుక్‌ హౌస్‌, హైదరాబాదు-27 ఫోన్‌ : 040 - 24652387

కలలో వేణువు విని విరహ మధుర వేదన విని, విరహ మధుర వేదనలో ప్రణయతత్వ వేదము వినివించిన వారు డా. భుజంగరాయ శర్మ. అలాకాక యిప్పుడు వేణుగాన ధ్వని ముద్రికల్ని భవ్రపరిచి మనకు మైత్రీ మధురంగా, ఉద్యోగ విరమణ కానుకగా అందిస్తున్నవారు ఆరుపదుల వయసులో, అరవై పుస్తకాల సృజనకర్తగా డా. నాగసూరి వేణుగోపాల్‌.

ఉద్యోగపు హడావిళ్ళలోంచి ప్రశాంతతను వెతుక్కుంటూ తీర్చిదిద్దిన ముద్రలు చిత్రాచిత్రంగా వేణునాద సుధలయ్యాయి. సంస్కృతిని వారసత్వంగా పొందేందుకు వర్తమానానికీ భవిష్యత్తుకూ ఈ వేణుగానం వారధి కాగలదు. తిండికి తిప్పలు పడే పరిస్ధితిని దాటుకొని విలువల విషయంలో ఉన్నతంగా నిలచిన ఒక కళాత్మక హృదయజీవి జీవనరాగం మనకు ఒక ఆలాపనగా విన్పీస్తుంది.

స్థాన చలనం వల్ల కొత్త పరిచయాలు, కొంగ్రాత్త అనుభవాలు అక్షరాల్లో ఒదిగి సొగసులీనుతాయని పత్రికల వారు ఊహించారు కాని అది వేణుగానమై అలరారుతుందని అప్పటికి వారికి ఊహకందని విషయమే. పైగా అది స్వేచ్భాగానం. ఆ వేణుగానం హంసధ్వని రాగంతో గడుసుదనం నేర్పిందట! బదిలీ-మజిలీలలోని మజాను జుర్రుకుంటూ, మైత్రీ సుగంధాలను వెదజల్లుతూ, “ఎందరో మహానుభావులు... అందరికీ వందనములు” అంటూ పలవరించిన వాడు ఈ వేణుగాన లోలుడు.

“కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం, దాపరికం లేకుండా ప్రవర్తించటం, గొప్ప కామన్‌సెన్స్‌ నుంచి ప్రెజెన్స్‌ ఆఫ్‌ మైండ్‌, కష్టపడి పని చేయడం, పరుల సొమ్ముకు ఆశించకపోవటం వంటివన్నీ వంశానుగతంగా సంక్రమించిన గుణాలు. గుడిలేకపోయినా బడి వున్న ఊళ్ళో పుట్టిన పుటక ఆయనది. ఆయనలోని భావాలు, ఆయనపై ప్రభావాలు అన్నీ కలగలిసి రకరకాల ముద్రలుగ మురిపించాయి. ఎక్కడ కానతట్టుపల్లి... ఎక్కడి గోవా...”

ఈ భావుకునికి సుంకేసరి పూలు చూస్తే స్కూలు గుర్తుకొస్తుంది; కొండను చూస్తే ఫిజిక్స్‌ గుర్తుకొస్తుంది; గుర్తుకురావూ మరి.... చిన్న నాటనే కరెంట్‌ ఎఫైర్స్‌ పద్యాల్లో చదువుకొన్నవాడు కదా అయినా తరువాత వచనం మెరుగనుకొన్న మొనగాడు కదా! జానకి రామారావు సారు ఈయనకు దారిదీపమైతే... ఈయన ఎందరెందరికి దారిదీపమయ్యాడో...

నాగసూరి నార్ల లోకంపోవడను బాగా తలకెక్కించుకున్నాడు. పై బెర్తు నుంచి ప్రబోధాలు విన్నాడు. హొసూరు నరసింహయ్యలోని సమరశీలతను పుణికి పుచ్చుకున్నాడు. ప్రవహించే పాటల్లో నుండి గుర్తొచ్చే జ్ఞాపకాలను మధురాతి మధురంగా గానం చేశాడు. అందులో నవ్వుల వెల్లువలున్నాయి. ఎడతెగని జ్ఞాపకాలున్నాయి; సైన్సు దాహం తీర్చుకున్న దాఖలాలున్నాయి; పరిశోధనలవైపు పరుగులున్నాయి. అక్కడ వర్ణ సమ్మేళనాలు గళం విప్పటం చూస్తాం; రాగాన్ని కళ్ళకు కట్టించటం, చెవులకు పట్టించటం ఉంటుంది; వచనోల్లాసాలుంటాయ్యి వయస్సు మీదపడినా తెలుసుకోవాలనే తపన తరగని వారు కన్పిస్తారు; తొలి చూపులోనే మదరాసు తొంగి చూచిన విధం కన్పిస్తుంది; సంగీతోత్సవాలుంటాయి; కోతికొమ్మచ్చి మిఠాయిపొట్లాలుంటాయి. జర్నలిజం చిక్కుముడులు విప్పుకోవటాలు ఉంటాయి; జర్నలిజం చిక్కుముడులు విప్పుకోవటాలు ఉంటాయి; అందుకోగల్లిన వారికి అందుకోగల్లినంత ముడిసరుకు అఖిస్తుంది.

పుస్తకం అంతటా నీరక్షీర న్యాయమే; హంన గమనమే; బహుజన హితమే మన్ననలే. చివరకు “మళ్ళీ కలుద్దాం” అనే మంచిమాటతో ఈ గానానికి దంపతుల యింపైన ముక్తాయింపు!

-రావెల సాంబశివరావు సెల్‌ : 99590 898630

భావ విప్లవం

తెలుగెంతో తీయనిదని దేనికండి ప్రగల్భం మాతృభాష మనుగడకై తప్పదు ఇక విప్లవం ||తెలుగెంతో॥

కమ్మనైన అమ్మనైన మమ్మీ అని పిలవాలను తల్లిని నిలదీయు శక్తి పిల్లలలో కలగాలని ఆంగ్లంలో చదువొకటే అపురూపం అని చెప్పే తండ్రిని ఎదురించు యుక్తి బిడ్డలలో రావాలని

జరుగుతున్న సభలన్నీ సంకరమవుతూవుంటే అడ్జు పెట్టి ఆపు బలం సఖికులలో పెరగాలని ప్రతినోట ప్రతిచోట ప్రతిమాట తెలుగైతే అదే భావ విప్లవం...అదే భాష పల్లవం

-మేడా మస్తాన్‌రెడ్డి 9441968930


పాఠశాల విద్యలో మాతృభాషే మాద్యమంగా ఉండాలి.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

49