పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రదేశంలో పాటిమట్టి తప్ప అక్కదేమీ లేదు. లేకపోయినా ఒక చారిత్రక స్థలంలో కాలుమోపానన్న ఆనందం మిగిలింది. ఇక్కడ దొరికిన తొలి నరసింహశిల్పం చారిత్రక ప్రాధాన్యత గలది. పల్నాటి సున్నప్రురాతి శిలపై మొత్తం ఆరు అర్ధ శిల్పాలున్నాయి. మధ్యలో రెండు మానవ చేతులున్న ఆసీన నరసింహుడు, వాటిలో గద, దిండిమలున్నాయి. ముఖం, శరీరం జంతురూపంలో ఉంది. వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నముంది. నరసింహానికి అటూఇటూ వృష్టివీరులు లేక వంచవీరులని పిలిచే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవ కృష్ణ, బలరాములు ఆయుధాలను ధరించి నిలబడి ఉన్నారు. బౌద్దం బాగా విలసిల్లుతున్న ఇక్ష్వాకుల చివరి కాలానికి చెందిన ఈ శిల్పం, వైష్ణవ మత ఉనికిని చాటటమేకాక, వృష్టి లక పంచవీర ఆరాధనను తెలిపే ఏకైక శిల్చంకూదా. క్రీశ. 4వ శతాబ్దికి చెందిన ఈ శిల్పం, తెలుగువారి వైష్ణవ మత చరిత్ర, శిల్పకళా పరిణామాన్ని తెలుసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి అరుదైన, అపురూపమైన ఈ నరసింహ-పంచవీర శిల్పం, ప్రస్తుతం గుంటూరులోని బౌద్ధశ్రీ ఆర్కియోలజికల్‌ మ్యూజియంలో ఉంది. పిడుగురాళ్లలో చెన్నకేశవ, రామలింగేశ్వరాలయాలు మధ్యయుగం నాటివేకాని పునరుద్ధరణ 'పేరిట చారిత్రకత కోల్పోయినందున ఆ దేవాలయాల్ని చూడాలనిపించలేదు.

కొంచెం సేపట్లోనే పిల్లుట్ల చేరుకున్నాం. అదాక వ్యవసాయపుటూరు. పిల్లుట్లకు ఆ పేరు ఎలా వచ్చిందోనని ఒకరిద్దరిని అడిగినా సరైన సమాధానం లేదు. వేణుగోపాల స్వామి గుళ్లో పూజారిని అడిగినా తెలవదనే సమాధానం. పిల్లి, ఉట్టి, అల = ఉట్టిమీద పిల్లి ఉన్న ఊరు అని అర్జాన్ని స్ఫురింపడేసుకొని చారిత్రక అవశేషాల అన్వేషణలో పడ్డాను. గ్రామంలో శాసనాలేమి లేవు. కాశీ విశ్వేశ్వర, వేణుగోపాలస్వామి దేవాలయాలున్నాయి. అవి కూడా గతకాలపు ఆనవాళ్లేమీ మిగలకుండా పూర్తిగా ఆధునీకరింపబడినాయి. కాశీ విశ్వేశ్వరాలయం చుట్టుపక్కల పరిశీలించగా 16వ శతాబ్దపు నంది స్తంభం నిలబెట్టి ఉంది. ఇక్కడే బహుశా పురాతన ఆలయం ఉండి ఉంటుంది. ఈ స్తంభాన్ని చూస్తే తక్షశిలకు చెందిన గ్రీకు రాయబారి హెలియోడరస్‌ క్రీ.పూ. 110 ప్రాంతంలోని విదిశాలోని బేస్‌నగర్‌లో నిలబెట్టిన గరుడ స్థంభం గుర్తుకొచ్చింది. 'సైజులేదు, ఆ కాలమూ కాదు కాన్మీ సాంప్రదాయం కొనసాగింది. అతడు భాగవతుడు. ఇక్కడ ఎవరో ఒక మహేశ్వరుడు, శైవ మత ప్రచారంలో భాగంగా ఎత్తించి ఉంటాడు. అయితే పది అడుగుల ఎత్తున్న (ఇంకా భూమిలో 5 అడుగులుంటుంది). ఈ స్థంభం కోసం క్రింద, చదరంగా, పైన ఎనిమిది పలకలగాను, ఆపైన చిన్న ఫలకం, దాని మీద చక్కటి నంది. కళాచరిత్రకారుల దృష్టి నాకర్షించాల్సిన ఈ నంది కమ్ముకొచ్చిన ఇళ్ల మధ్య పట్టించుకునే వాళ్లు లేక, బిక్కు బిక్కు మంటుంది. దాన్ని చూచి జాలేసింది. రాయిని క్వారీ నుంచి తెచ్చి, చదునుచేసి క్రీ.శ 16వ శతాబ్దికి చెందిన విజయనగర శిల్పకళకు మచ్చుతునకగా తీర్చిదిద్దిన నాటి శిల్పుల పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. ఆశ్చర్యమేమిటంటే, అక్షరాస్యత అంతగా లేని, శృంగార సాహిత్యాన్ని బొత్తిగా తడమని (గ్రామీణులకు నిశ్చబ్ద శృంగార (ప్రేరణ కలిగించే బూతు బొమ్మలు విద్యాత్మకంగా ఉన్నాయి. ఒకామె తెల్లవారురూమున మజ్జిగ చిలుకుతుంట్నే పొలం పోయే. పైలాపళ్చీసు మొగుడు వెనుకగా వచ్చి ఆనందాన్ని అంటిస్తున్నాడు. మరో జంట, ఒకరికొకరు 'పైనకింద, ఆశీనులై ప్రపంచాన్ని పట్టించుకోకుండా శృంగారకేళీ కలాపంలో మునిగి తేలిపోతున్నారు. బాగా పరిశీలిస్తేగాని ఈ మైధున శిల్పాలు కల్పించవు. ఇది ఆనాటి సమాచార ప్రసరణలో భాగమే గానీ, బూతూ కాదు, రోతా కాదు.

ఆలయం బయట నిరాదరణకు గురైన వీరభద్రుని విగ్రహం నన్ను కాలు కదలకుండా చేసింది. క్రిభంగిమలో నిలబడి అన్ని అలంకారాలను ధరించి కత్తి, దాలు పట్టుకొని ఉన్న వీరభద్రుడు, 'ప్రభామండలం క్రింద అంజలి ముద్రలో ఉన్న దక్షుడు, శిల్పాన్ని చెక్కిన తీరు, తంగెడలోని రెడ్డి రాజుల కాలవు వీరభద్రుని శిల్పాన్ని తలపించింది. క్రీ.శ. 1415 శతాబ్దాలకు చెందింది. సత్తువలేని ముసలి తాతను ఇంటి బయట కొట్టంలోకి నెట్టినట్లు, ఆలనా పాలన లేక కొంచెం భిన్నమైన ఈ విగ్రహాన్ని నిర్దాక్షణ్యంగా, ఆలయం ప్రాకారం వెలుపల పదేశారు. పూనుకొని ఆలయంలోపల పెట్టే నాధుదేలేడా అనిపించింది. ఒక్క నిట్టూర్పుతో ఊరుదాటాను. కారులో పోతున్న కొద్దీ చూచిన నందిస్థంభం, వీరభద్ర విగ్రహం మదిలో పదే పదే మెదులుతూనే ఉన్నాయి. శృంగార శిల్పాలైతే అంగారక గ్రహంమీద కాలుమోపిన అనుభూతిని కలిగించాయి.

ఇక నా చూపు, మోర్దంపాడువైపు. ఎప్పుడో, పిడుగురాళ్లలోని ఒక నగల వ్యాపారి, నాకు ఫోనుచేసి మావూళ్లో ఆలయం శిధిలమైంది. ఒకసారి చూచ్చి | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. అక్టోబరు-2020 |