పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పునరుద్ధరణకు సలహాలిస్తారా అని అడిగిన విషయం జ్ఞాపకమొచ్చింది. ఊరి చివరున్న అయిదడుగుల లోతు దిగుడుబావి, పక్కనే తూర్పు చాళుక్యుల కాలంలో కట్టిన సాదాసీదా బుగ్గరామలింగేశ్వరాలయాన్నీ చూశాను. ఇక్కణ్ణుంచి కృష్ణానది మూడుకిలోమీటర్లు ఉంటుంది. నదిలోతుగాఉన్నా ఇక్కడి నీటిఊోట 5 అడుగుల్లోనే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిది. (గ్రామస్థులైతే, అది ఆవూరి మహిమ అని చెప్పుకొన్నా నిజానికి సున్నపు రాతిపారల్లోంచి, నీటి జాలు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇది సహజ పరిణామమేగానీ, మహిమకు సంబంధంలేదని స్థానికులకూ, పూజారికీ చెప్పాను. 'అయ్యా మీకు దేవుని మీద నమ్మకం లేదా” అని అడిగారు. చర్చపెరక్కుండా, ఊళ్లో ఉన్న నీలకంకేశ్వరస్వామి గుడికి బయలుదేరాం.

ఊళ్లోకి చేరుకొని ఆలయం ముందు నుంచి చూస్తే, పాత ఆలయాన్ని ఊడదీసి, కేవలం రాతిద్వారాలను మాత్రం వాడుకొన్నారు. మిగతా చెక్కదాల్ని రోడ్డు పక్మన పదేశారు. నిలువెల్లా నిరుత్సాహం. ఆ ఆలయంముందున్న ఒక చారిత్రక బావి, మళ్లీ ఉత్సాహాన్నిచ్చింది. పది అడుగుల దారి, అటూఇటూ ఏనుగుల శిల్చాలు, మెట్లుదిగిన తరువాత, ఎడమవైపుకు నడవ, అక్కణ్ణుంచి మెట్ల వరుస, నీరు ఎంత వకద్బందీగా ఉందీ దిగుడుబావి అనుకొని చుట్టూ తేరిపారా చూస్తే, బావిలోపలి గోడలమీద విష్ణుమూర్తి దశావతారాలు, కృష్ణలీలలు, నిలబడిన సప్తమాతలు జంతువులు, శృంగార, మైధున శిల్పాలు, ఆబావి చరిత్రకు అద్దంపడుతున్నాయి. క్రీ.శ 16వ శతాబ్ది-విజయనగర శైలి. ఒకప్పుడు దప్పికతీర్చి, గంగతో సమానంగా వవిత్రంగాచూచి, పూజలు చేసిన ప్రజలు ఇంటింటికీ కుళాయి రావటం వల్ల, చెత్తాచెదారాన్ని ఇందులోనే వేస్తున్నారు. నాతో పాటొచ్చిన రత్నకుమార్‌, నేనూ కలసి, గ్రామస్తుల్ని పోగుచేసి,ఆబావి వాస్తు, శిల్పకళా విన్యాసం, చారిత్రక నేపధ్యాన్ని వివరించాం. అంతే ! అక్కడున్న ఐదారుగురు, ఆచెత్తాచెదారాన్ని ఏరి బయటేశారు. ఈ బావిని కాపాడుకొని, బయటి నుంచి వచ్చేవాళ్లకు దీని చరిత్ర, నిర్మాణరీతి, శిల్పకళగురించి, తెలియజెప్పమని నేను టూరిస్టు అవతారం ఎత్తాను. వాళ్లలో ఇద్దరు కుర్రాళ్లు నేను చెబుతున్నదంతా మొబైల్‌ ఫోనులో రికార్డు చేసుకొన్నారు. మోర్టంపాడుకు వచ్చే చుట్టాలకు, స్నేహితులకు వీటి గురించి చెబుతామన్నప్పుడు మనస్సు అనందంతో నిండిపోయింది. మోర్దంపాడు గ్రామంలో సంప్రదాయానికి ఆధునికతను జోడించి సీమ వాస్తు శైలితో ఎంతో అందంగా కట్టుకున్న ఒక ఇల్లు, ఆ ఊరి మొత్తానికే ఆకర్షణ. ప్రవేశ ద్వారం, దానిపైన 1936 సం॥ అర్ధచంద్రాకారపు ద్వారశాఖ పైన కోడిపుంజు నెత్తిమీద ఉండే అలంకారం, అటు ఇటూ ఎనిమిది కోణాల పడకగదులు, వాటి పైన బాల్మనీ, దాని క్రింద మళ్లీ కొయ్య అలంకారం, మొదటి అంతస్తు పైన చుట్టూ సుధాశిల్చ విన్యాసం, అన్నీ కలిపి ఉట్టిపడే రాజసం, ఆ ఇంటికే సొంతం. చక్కటి కొయ్య శిల్పంతో సింహద్వారం, అందమైన కిటికీలు, వాటిపైన పొడుచుకొచ్చిన చూరులూ, బర్మాకొయ్యతో నాటి నగిషీ పనుల్లో దిట్టలైన వడ్రంగులు రెచ్చిపోయి, పని తనంలో పోటీపడిన నేపధ్యాన్ని గోడకు బిగించిన కొయ్యఅల్మారాలు గుర్తు చేశాయి. ఇప్పుడు డబ్బుందీ, కొయ్యా ఉంది, వడ్రంగులూ ఉన్నారు. లేనిదల్లా అనాటి అలోచనలు, ఓపిక, కళాత్మక దృష్టి అక్కదే నిలబడి స్థాణువులా చూస్తున్న నన్ను ఇంటివాళ్లు లోపలకు పిలచ్చి ఇల్లంతా కలియజూపారు. సున్నపు తాపడపు గోడలు, కప్పులూ చలువరాతి గచ్చు, దీపాలు పెట్టుకునే గూళ్లు, కాలెత్తితే కాని దాటలేని గడపలు, యనభై ఏళ్ల నాటి మద్రాసు ఇనపభోషాణం, సింహాసనాన్ని తలపించిన పందిరి మంచం, చీమలు పట్టకుందా మంచం కోళ్లకింద నీళ్లు పోసుకోవటానికి గాడి చెక్కిన రాతి దిమ్మెలు, వాటిపైన ఏమాత్రం తేడాలేని తరిణిబట్టి భరిణెల్లా తీర్చిదిద్దిన మంచంకోళ్లు, మంచంపైన స్త్రింగ్‌ పరుపు, దోమతెరలు కట్టుకొవటానికి కట్టె చట్రం, నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నేను ఈ ఇంటి యజమాన్నైతే ఎంతబాగుణ్ణనే ఆలోచన పుట్టింది. లక్ష్మీదేవితో సమానంగా చూచుకొన్న రోలు, పన్న బిగించిన రోకళ్లు (అవి ఎన్ని పెళ్లిళ్లు చూశాయో), తరతరాల సంతానానికి పిండిని పండించిన తిరగళ్లు, పల్నాటి జీవనాన్ని కళ్లముందు కదిలించాయి. 'మోర్టంపాడు నుంచి, బయలుదేరి మళ్లీ పిడుగురాళ్ల వచ్చి తిరుగు ప్రయాణ మైనాం. గత కాలపు వైభవ, ప్రాభవాలు, కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. వారసత్వ సంపద పట్ల నిర్లక్ష్యం నీడలావెంటాడుతూనే ఉంది. మంచి కాలం రాకపోతుందా అని ఆలోచించేలోపు విజయవాడకు చేరుకొన్నాం.

(తరువాయి వచ్చే సంచికలో...) | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |