పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శిక్షణా లోపం

ఉపాధ్యాయుల విద్యలో లోపాల వలన సమస్యలు ఉధృతమవు తున్నాయి. ఉపాధ్యాయుల శిక్షణాసంస్థలైన “దైటొలు ప్రథమ భాష - ద్వితీయ భాషా బోధనల మధ్య భేదాలను గుర్తించలేకపోతున్నాయి. సమగ్రమైన విద్యపై అవగాహన లేకుందా, కేవలం వ్యాకరణం లాంటి అంశాలలో ఉత్తీర్ణులవుతున్నారన్న వాస్తవాన్ని ఈ విద్యాసంస్థలు గుర్తించడం లేదు. కాబట్టి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల బోధకులు, బయట పడలేనంతగా, ఒక విషవలయంలో కూరుకుపోయారు. ఈ విషయమై విద్యాశాఖ దృష్టి సారించడం లేదు. మాతృభాషలో విద్యా బోధన లాభదాయకమన్న వయోజన విద్యా పద్ధతులను పరిగణించ కుందా, ద్వితీయ భాషగా అంగ్ల బోధనలో ఉత్పన్నమవుతున్న వ్రశ్నలను ఉపేక్షిన్తున్నారు- అన్నారు. ఆమె నవోధ్యాయి అనిత తన మాటలలో “ఆంగ్లం సాంకేతికకు, సమాచార వెల్లడికి బాగున్నప్పటికీ, తమిళంలాగా వుండదు. మేము తమిళంలోనే ఆలోచిస్తాము. తమిళంలోనే మా భావాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయాలన్నదే మా నంకల్పం” అని పేర్కొన్నది. ప్రభుత్వ విధానం కాబట్టి, ఆంగ్లంలోనే బోధిస్తామని వారు చెప్పడం జరిగింది.

తమ ఉద్యోగాలను నిలుపుకోవడానికి, వారు ఆంగ్ల బోధన చేస్తారు. తమిళనాడులో ఉపాధ్యాయుల ఉద్యోగాలు విద్యార్థుల నమోదుతో ముడిపడివున్నవి. ఇది ఒక రకంగా ఓ విషపు ఒప్పందం. సామర్థ్యమో, మొగ్గు చూపడమో ఏదేమైనప్పటికీ, వారి ఉద్యోగాల పణంగా ఆంగ్ల బోధన చేస్తున్న విషపు ఒప్పందం ఇది. ఈ ఒప్పందాన్ని విద్యాశాఖ ఎలా సమర్థిస్తుంది? వాస్తవానికి భిన్నంగా, ఉపాధ్యాయులందరూ “ఉన్నతమైన శిక్షణా పొందారన్న విషయాన్ని విశ్వసించడం. రెండో విషయం, ఆంగ్లంలో విద్యాబోధనకు ప్రతి సంవత్సరం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇన్వడం జరుగుతుంది అని బలంగా విశ్వసించడం ఎలా సమర్ధనీయమవుతుంది?

నాలుగు రోజుల స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాల ద్వారా బ్రిటిష్‌ కౌన్సిల్‌ వారి బోధకుల శిక్షణ వలన, ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయుల సామర్శ్యం పెంవులో ఉన్న నమన్యలను అధిగమిస్తుందని విద్యాశాఖ ప్రగాఢ విశ్వాసం.

ఉపాధ్యాయులు మిడిమిడి ఆంగ్ల పరిజ్ఞానంతో, అరకొర ఆంగ్ల బోధనా నైపుణ్యాలతో ఎలా ఆంగ్ల బోధన చేస్తారన్న ప్రశ్నకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి బ్లాక్‌ అభివృద్ధి అధికారుల వరకు ఒకటే స్థిరమైన సమాధానం: “వారికి శిక్షణ ఇస్తున్నాము”. శిక్షణ ప్రభావం ఎంత? ఉన్నత పాఠశాలలో ఆంగ్ల బోధన చేసిన మేరి అనే బ్లాకు స్థాయి ఉపాధ్యాయుల బోధకురాలి మాటలలో “భాషాపరమైన శిక్షణ వలన ఆంగ్లంలో ఉపాధ్యాయులు 40%- 50% స్థాయిలో ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నారు” అని చెబుతూ, ఇది అచ్చెరువును కలిగించే గణాంకాలు అని ఒప్పుకుంటున్నది. ఉపాధ్యాయులు గడించిన పూర్వవిద్యకు ఇలాంటి వృత్తిపరమైన శిక్షణలు ప్రత్యాన్నూయం కానేరదు అని పేర్కొన్నది. తమిళనాడు విద్యావ్యవస్థలోని అధికారస్వామ్యం ఉపాధ్యాయులను ఒక సమస్యగా భావిస్తుంది. ఉపాధ్యాయులు సరైన శిక్షణ పొందరని, సోమరిపోతులుగా వుంటారని, జవాబుదారీతనం వుండదని, రాజకీయ ప్రయోజనాల వల్ల రక్షింవబదతారని ( ఉపాధ్యాయులు రాష్ట్ర రాజకీయాలలో బలమైన వారు) రాష్ట్ర విద్యాశాఖ విశ్వసిస్తుంది. ఏదిఏమైనా, ఉపాధ్యాయుల నియమాలను రూపొందించేది ఈ అదికారస్వామ్యమే. ఈ నియామకనియ మాలలో, ప్రధాన అంశమైన “బోధనా సామర్థ్యం"ను ఉపేక్షించడం జరిగిందని కొందరు ఆలోచనాపరులైన ఉపాధ్యాయులు ప్రస్తావించారు. వాస్తవంగా, స్వల్ప ఆంగ్ల పరిజ్ఞానంతోనే ఆంగ్ల బోధన చేయాలన్న అధికారుల బలవంతం వల్ల , అంగ్ల బోధనకు అవసరమైన కనీస నైపుణ్యాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.

జరిగిన నష్టం

చెన్నై కార్పొరేషన్‌ వారు వారి పాఠశాలలో ఒక వినూత్న పద్దతిని అవలంబించారు. *ట్రీచ్‌ ఫర్‌ ఇండియా” అనే సంస్థకు 32 పాఠశాలలు అప్పగించారు. ఈ సంస్థ సభ్యులు, లాభాపేక్షలేని, బోధనేతర ఉద్యోగం చేసిన, లేదా పట్టభద్రులైన యువకులు. బోధనా వద్దతుల గురించి రెండు వారాల పాటు, అదీ కూడా క్రియా ఆధారిత బోధనా పద్ధతి లేకుండా _ శిక్షణపొంది, రెండు నంవత్సరాల పాటు ఆంగ్ల శిక్షణ ఇవ్వడానికి ఒవ్పందం చేనుకుంటారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతారు, ఆంగ్లంలో బోధిస్తారు, కానీ స్థానిక భాషను నేర్చుకోవాలనుకోరు.

సెంట్రల్‌ చెన్నైలోని ఓ పాఠశాలలో రెండవ సంవత్సరం ఆంగ్ల బోధన చేస్తున్న మాలిని ఇలా బోధించడం అద్భుతమన్నారు. ఏదైనా సమస్య ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్చక్షు, 4 వ తరగతి విద్యార్థుల గురించి ఆమె ఇచ్చిన సమాధానం “* పిల్లలు నేర్చుకోవడంలో ఇప్పటికీ సమస్య ఉన్నది”. నార్త్‌ చెన్నై పాఠశాలలోని నాల్లవ తరగతి ఉపాధ్యాయుడు ఒక ఇండో అమెరికన్‌. ఆయన తన విద్యార్థుల చేత ఒక ప్రశ్నకు సమాధానం చెప్పించడానికి ప్రయత్నం చేశాడు. “సెర్రిబెల్లం (చిన్న మెదడు) ఎటువంటి విధులను నియంత్రిస్తుంది” అన్న ప్రశ్ళకు విద్యార్థులు తమ. తలల మీద చేయి పెట్టి సెరిబెల్లం ఎక్కడ వుందో చెప్పడానికి ప్రయత్నించారు.

సెంట్రల్‌ చెన్నైలోని ప్రధానోపాధ్యాయురాలైన ఎస్‌ థెరిసా, తమ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుల కారతవున్నందున “టీచ్‌ ఫర్‌ ఇండియా” సంస్థకు బుణపడివున్నానని తొందరపాటుతో చెప్పినప్పటికీ, “ఈ ఆంగ్ల బోధనా కార్యక్రమాలు ప్రభుత్వేతర సంస్థలకు 1-2 సంవత్సరాల పాటు ఇవ్వబడినవి. ఈ ఏర్పాటు సముచితం కానిది. దీనివలన అటు అరవం రాదు, ఇటు ఆంగ్లం రాదు. నాలుగవ తరగతి విద్యార్థులు ఆంగ్లంలో రాయడం చేతకాక, సాంఘికశాస్త్రంలో ఉత్తీర్ణులు కాలేకపోయారు. వారికి ఏ భాషా రాదు. రాయదానికి అంగ్లం రాదు. అంతేకాదు, ఇప్పుడు పిల్లలు “తమిళం వద్దు, అంగ్లమే ముద్దు అంటున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు తమిళాన్ని రెందవ భాషగా నేర్పుతున్నప్పటికీ, పిల్లలు చదివే, రాసే నైపుణ్యాలు కోల్పోతారని ఆమె భయపదుతున్నది. దీని ఫలితంగా, తమిళ ఉపాధ్యాయురాలు వారానికి రెండు గంటలు అదనంగా ఈ విద్యార్థులకు తమిళం బోధించడం జరుగుతున్నది.

తమిళనాడు విభిన్నతకు ప్రతీకయైన రాష్ట్రంగా గుర్తింపు

తరువాయి 14వ పుటలో.... | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |