పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విద్యావిధానం

రమేష్‌ పట్నాయక్‌

79012 86396

జాతీయ విద్యావిధానం 2020 మాతృభాషా మాధ్యమానికి అనుకూలంగా ఉందా?

అఖిల భారత విద్యాహక్కు వేదిక జూలై 29న కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం 2020 ప్రకటించిన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాతృభాషా మాధ్యమానికి మహర్దశ పట్టింది అనే భావం ్రచారంలో ఉంది. పప్రధానమంత్రిగారు కూడా మాతృభాషా మాధ్యమ ప్రాధాన్యత గురించి మాట్లాడే సరికి ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నూతన విద్యావిధానం మాతృభాషా మాధ్యమ ఆవశ్యకతను బహుళంగా చెప్పిన మాట వాస్తవమే కాని మాతృభాషా మాధ్యమానికి సంబంధించిన స్పష్టమైన నిస్టేశాలు ఏమి ఉన్నాయి అన్న విషయం వరిశీలించాలి. పదగుంభనం ఎంత సారవస్తువు ఎంత ఎంచి చూడాలి కదా! ఈ సందర్భంగా జుతీయ విద్యావిధానం 2020 ని ఇప్పుడు అధికారంలో ఉన్న “విద్యా హక్కు చట్టంతో అలాగే 1986 నాటి “విద్యలో జాతీయ విద్యావిధానం” తో పోల్చిచూడడం ఎంతైనా అవసరం.

2010 ఏప్రిల్‌ 1 నుండి 'బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009” అనే కేంద్ర చట్టం అమలులో ఉన్న విషయం తెలిసిందే. 6 - 14 వయోపరిమితిలో ఉన్న బాలల రాజ్యాంగ బద్ధమైన ప్రాథమిక హక్కు 21 ఎ ని వాస్తవీకరించడానికి ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం విద్యావ్యాపారాన్ని నిషేధించళ పోయినందున, ఉమ్మడి బడి విధానానికి మార్గం వేయనందున ఇంకా పాఠశాలలో వనరుల మరియు వసతుల విషయంలో తక్కున స్థాయి నిబంధనలు కలిగి ఉన్నందున విమర్శలకు గురవుతున్నది. అయితే, పాఠ్య ప్రణాళిక విషయంలో విద్యాహక్కు చట్టం పెద్దగా విమర్శలను ఎదుర్మోలేదు. ఈ చట్టం విభాగం 29(2)(యఫ్‌)లో వీలయినంత వరకు, మాతృభాషా మాధ్యమంలోనే విద్య అందించాలని నిశ్టేశిన్సుంది. ఈ నిబంధన (వ్రభుత్వ మరియు (పైవేటు పాఠశాలలన్నింటికి 1 నుండి 8వ తరగతి వరకు వర్తిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. ఉల్లంఘించబడని చట్టం మన దేశంలో ఏదీ లేదు. అది వేరే విషయం. ఈ చట్టం వచ్చిన తరువాత కూడా (ఫైవేటు పాఠశాలలు ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయమని (ఫైవేటు పాఠశాలలను నిర్బంధించడానికి బదులు (వభుత్వ పాఠశాలలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని వివిధ స్థాయిలలో ప్రవేశపెడుతున్నాయి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానంలో మాతృభాషామాధ్యమం విషయంలో ప్రభుత్వంపై వచ్చిన కేసు నందర్శంలో రావ (వభుత్వం విద్యావాక్కు చట్టంలో “వీలయినంతవరకు” అని ఉందని ఆ వెసులుబాటును 'ప్రజాఖీష్టం మేరకు” తాము ఉపయోగించుకుంటున్నామని చెప్పింది. ప్రభుత్వ వివరణను హైకోర్టు తిరస్కరించింది. 'వీలయినంతవరకు" అన్నది వెసులుబాటు మాత్రమే కావున చాలా ప్రత్యేక సందర్భాలలోనే అంటే మాతృభాషలో విద్య అందించలేని సందర్భాలలోనే ఉపయోగించుకోవాలని న్యాయస్థానం వివరించింది. అనేక చట్టాలలో “వీలయినంతవరకు” అనే పదబంధం ఉంటుందని దానిని ప్రత్యేక సందర్భాలలో ప్రభుత్వం తీనుకున్న చర్యలు లిటిగేషను దారితీయకుండా ముందు జాగ్రత్తగా చేరుస్తారని గత కొన్ని తీర్పులను ఉటంకిస్తూ కోర వివరించింది. బాలల విద్యాహక్కు చట్టం మాతృభాషా మాధ్యమం విషయంలో అధికార పార్టీ ఎన్నికల మేనిఫెస్ట్రోకు గాని, ఫైవేటు మేనేజ్‌మెంట్ల ప్రయోజనాలకు గాని, చివరకు తల్లిదండ్రుల అభీష్టానికి గాని ఎటువంటి అవకాశం కల్పించలేదు. విద్యాహక్కు చట్టం బాలల సమగ్ర మరియు సహజ అభివృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం తరపున మాతృభాషా మాధ్యమాన్ని నిర్దేశించింది. అదే చట్టంలో ఉన్న “బాలల కేంద్రగతంగా, వారికి స్నేహపూర్వకమైనదిగా విద్య అందించబడాలి” అన్న నిబంధన కూడా మాతృభాషా మాధ్యమాన్నే సూచిస్తుంది. ఇప్పటికీ అధికారం (ఫోర్సు)లో ఉన్న 'బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009” వ్రభుత్వ మరియ (మైవేటు యాజమాన్యాలన్నింటిలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే నిర్దేశిస్తుంది.

ఇప్పుడు మనం జుతీయ విద్యావిధానం 2020 ని పరిశీలిద్దాం. ఈ విధానం 4 11 విభాగంలో '“వీలయిన చోట (వీలయిన ప్రతిచోట అని ఇంకా వీలయిన ప్రతి సందర్భంలో అని కూడా అర్ధం చెప్పవచ్చు) కనీసం 5వ తరగతి వరకు, 8వ తరగతి మరియు ఆపై స్థాయిలో కూడా అయితే మంచిదే, ఇంటి బాష లేదా మాతృభాష లేదా స్టానిక భాష లేదా ప్రాంతీయ భాష బోధనామాధ్యమంగా ఉంటుంది" అని పేర్కొంది. పై ఉటంకింపును బట్టి ఈ విధానం ప్రకారం, 5వ తరగతి వరకు వారి వారి భాషలలోనే బాలలకు విద్య అందించాలి. ఇంకా ఈ విధానం ప్రకారం 8వ తరగతి వరకు మరియు ఆపై స్థాయిలలో విద్యార్థులకు వారి వారి భాషలలో విద్య అందించగలిగితే మంచిదే. విద్యాహక్కు చట్టం అయితే 8వ తరగతి వరకు బాలలకు మాతృభాషలోనే విద్య అందించాలని స్పష్టంగా పేర్కొంది. విద్యాహక్కు చట్టంలో ఉన్న 'వీలయినంతవరకు' మరియు ఈ విధానంలో ఉన్న “వీలయిన చోట” అన్న పదబంధాలను మనం ప్రక్కన పెడితే విద్యా హక్కు చట్టం 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్ని నిర్దేశిస్తే ఈ విధానం 5వ తరగతి వరకు మాత్రమే మాతృభాషా మాధ్యమాన్ని నిర్దేశిస్తున్నది. మరి ఈ నూతన విద్యావిధానం విద్యాహక్కు చట్టం నుంచి ఒక అడుగు వెనుకకు వేసినట్లే కదా. మరొక విషయం ఏమంటే జాతీయ విద్యావిధానం 2020 దానికదే అమలు జరగదు. సదరు

| తెలుగుజాతి పత్రిక జువ్మునుడి.. ఈ అక్టోబరు-2020 |