పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తరగతి లో కూడా ఆంగ్లమాధ్యమం నామమాత్రం. లేదా ఆమే చెప్పినట్లు, “ఆంగ్లం లేదా, తమిళం కాదూ తమిళం, ఆంగ్లం రెండింటిలోనూ బోధించడం మంచిది. విల్లలకు తెలిని, మాట్లాడగలిగిన భాషలోనూ, నేర్చుకుంటున్న భాషలలోనూ నేర్చగలిగి ఉభయ భాషా ప్రావీణ్యం వున్న ఉపాధ్యాయుల ద్విభాషా పాఠశాలల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ సందర్భంలో, ఉపాధ్యాయులు తమిళం, ఆంగ్లం రెండూ బోధిస్తూ, క్రమంగా ఆంగ్లం వైపు మళ్ళాలి. సుప్రియ లాంటివారికి ఆంగ్లంలో (ప్రావీణ్యం లేదు, ధారాళంగా మాట్లాడటం చేత కాదు.కాబట్టి, వారి తరగతులు ద్విభాషా తరగతులు కాదు, కలగాపులగమైన తరగతులు!

బోధనా వద్దతులలో వృరస్కార (గ్రహీతయైన మంగళ, ప్రాథమిక పాఠశాల మాధ్యమంగా ఆంగ్లంలో బోధించడం కష్టమేనని ఒప్పుకుంటుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ మాతృభాష లో చక్కగా నేర్చుకుంటారు. బోధనా పద్ధతిలో, తెలిసిన భాషలో బోధన పిల్లలకు ఎంత సులువో వివరించడానికి మంగళ తమిళాన్ని ఎంచుకున్నది. దీనివలన, పిల్లలు అర్ధం చేసుకోవ డానికి, నేర్చుకున్నది చేయడానికి, ఇతరులతో మాట్లాడడానికి ఎంతగానో దోహదపడుతోంది, ఎటువంటి గందరగోళం, విసుగు, అనాసక్తి లేకుండా చేస్తుంది. ఎంతో అనుభవం వున్నప్పటికీ, ఆంగ్గంలో మాట్లాడడానికి, మంగళకున్న వ్యవహారిక ఆంగ్ల వరిజ్ఞానం ఏమాత్రం నరిపోదు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులందరి మాదిరిగానే ఆమె కూడా, పదోన్నతులకోసం కావలసిన, మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుల విద్యార్హతలను సాధించింది. మాధ్యమిక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుల ఖాళీలున్నాయని ఆంగ్లాన్ని ఎంచుకున్నది.

విల్లల విద్యలో భాష పాత్ర గురించి ఆవె వివరణ పరిగణించదగినది. మాతృభాషలో నేర్చుకున్న విద్యార్థి, రెండవ భాష, మూడవ భాష సునాయసంగా నేర్చుకుంటాదని పరిశోధనలు పేర్కొంటున్నాయి; అదీ కూడా ప్రతి భాషా చక్కగా బోధిస్తేనే. నేర్పడానికే భావరానివారు ఆ భాషలో విల్లలకు బోధన చేయపూనుకోవడం (శ్రేయన్మరం కాదు. ఏ మాత్రం పెద్దగా మాట్లాడలేని భాషలో బోధన చేయడం విపత్మరం.

పాఠశాలకు వెళ్ళండి, పిల్లల అథమస్థాయి అభ్యాసనల గురించి ఉపాధ్యాయులను అడగండి. తక్కువ సదుపాయాల ఆంగ్ల భాషాబోధన, గణిత శాటస్తాన్ని నేర్చుకోవడంలో విల్లల వెనుకుబాటుతనం.... గమనించగలరు. “రాష్ట్ర స్థాయి సాధన సర్వే ప్రతి సంవత్సరం బోధనలో ప్రగతిని ప్రస్తావిస్తుండగా, అందుకు భిన్నంగా ఉపాధ్యాయులు ఆ ప్రగతి తరగతి గదులలో లేదు అంటున్నారు. దీన్ని అధిగమించడానికి, 1వ తరగతి నుంచి 4 వరకు క్రియా ఆధారిత బోధనావద్ధతి, 5వ తరగతి నుంచి (క్రియాశీలక అభ్యననా పద్ధతిని ప్రవేశ పెట్టడం జరిగింది. అయినప్పటికీ, బాగా నేర్చుకొని, అర్ధం చేనుకొని, విశ్లేషణ చేయగలిగిన విద్యార్థులు ఆంగ్లం మాత్రం రాయడానికి కష్ట పడుతున్నారు.

“తమిళనాడు ఆంగ్ల విద్యా విధానం, భాషా విద్యను తక్కువ చేసిన విధాన అవలక్షణం! అంటారు చరిత్రకారుడు ఎ.ఆర్‌ వెంకటాచలపతి. ప్రభుత్వ నిధులతో ఆంగ్లం, తమిళ భాషలలో నిర్వహిస్తున్న చెన్నైలోని పాఠశాలను ఆయన సందర్శించారు. పిల్లలకు ఆయన పాఠం చెప్పారు. పిల్లలు కనీసం ఒక దినపత్రికను చదినే స్థాయిలో లేరని ఆయన గ్రహించారు. విద్యావిధానం, భాషను కేవలం ఒక సాదనంగా, భావవ్రసారానికి కీలకంగా చూడడం వల్ల ఇలా జరిగింది. భాష అనేది అలోచించుకో వడానికి అవనరమైనది. కానీ ఏవరూకూదా దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఆంగ్లాన్ని రెండవ భాషగా సరిగా బోధించక పోవడంతో, చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఆంగ్లాన్ని సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. వారు ఉపాధ్యాయులైన తర్వాత ఈ సమస్య రెట్టింపు అవుతుంది. చెన్నై లోని డైట్‌ (జిల్లా విద్యా శిక్షణా సంస్థ) లో పని చేసే ఓ ఆంగ్ల అధ్యాపకురాలు .... చాలా మంది శిక్షణార్థులైన ఉపాధ్యాయులు, 12 ఏళ్ళపాటు ఆంగ్లాన్ని అభ్యసించినా, ఆంగ్లంలో మాట్లాడలేకపోతున్నారు. కేవలం భట్టీ పట్టి భాషాపరీక్షలలో ఉత్తీర్ణులవుతున్నారు తక్కువ సమయంలో పెద్దవారు ధారాళంగా మాట్లాడే రీతిలో భాషను నేర్వజాలరు. తన తరగతులలో ఆంగ్లం లో మాట్లాడితే ఏ మాత్రం స్పందన వుండదు. అదే తమిళంలో మాట్లాడడం (ప్రారంభిస్తే అందరూ ఉత్తేజితులవుతున్నారు. అని ఆంగ్ల అధ్యాపకురాలు వివరించారు. తెలుగుజాతి పభ్రిక జివ్మునుడి.. ఈ అక్టోబరు-2020 |