పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

నామాంకితమయి తనరారు చుండుటచేత, నాఁడు కృష్ణానదీ తీరమున వెలసిన సంఘారామాదు లన్నియు మహా చైత్యక పంథకు సంబంధించినవిగఁ గన్పట్టును. ఈ కారణమున చైత్యక నికాయమే పూర్వశైల, అపరశైల సంఘములుగ విడి పోయెనని కొంద ఱందురు : దీని నంగీకరింపక మఱి కొందఱు పూర్యాపర శైల సంఘముల వలెనే చైత్యక సంఘముకూడ ఆంధ్రదేశ మహా సాంఘికులందలి ప్రత్యేకమయున మూఁడవ విభాగమని చెప్పుదురు. ఆచార వ్యవహారముల యందును, శిక్షా నియమములయందును బరస్పరము వీరికి నెట్టి భేదములు కలవో తెలియదు కాని వీర లెల్లరు నొక్క. పంథకే చెందిన వారని శాసనములవలన స్పష్టమగుచున్నది.

అంధకులు

ఎట్లయిన నేమి, ఆంధ్రదేశమున కరుదెంచి చాల కాలము గడచిన మీఁదట మహా సాంఘికులలో పెక్కు తెగ లేర్పడినవి. పైని పేర్కొనినవి కాక శాసనాధారమున రాజ గిరికులు లేక రాజగిరి నివాసకులని, సిద్ధాంతికులని మఱి రెండు తెగల పేర్లు తెలియుచున్నవి. ఇవి యన్నియు బౌద్ధ గ్రంథములందును బేర్కొనఁ బడినవి. హిమవత, వాజిరియ, పువ్వసేలియ, అపరసేలియ, రాజగిరీయ, సిద్ధాంతిక సంఘ

జర ఎర తదు అకుడ బర య అదం ఎ దం ఆన గా నాం కొ అరు ఉద్‌ సదు జలు అదిల్‌ న ణా