పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దిశయందు 'విచిత్రమాలధ్వజ వ్యూహ' మను పేరఁ బ్రసిద్ధ మయిన యొక మహారణ్యము కలదని చెప్పఁబడినది. దీని ననుసరించి చూడ ధాన్యకటక సమీపమున పూర్వపశ్చిమ దిశలందు మహావనావృత శైలము లుండియుండు ననియు, దానం జేసియే యాశైలములందలి సంఘారామములకు పూర్వ, అపరమహావనశైలము లని పేర్లు కలిగె ననియుఁ గొంద ఱూహించు చున్నారు.

పూర్వ, అపరశైలము లేవి యను విషయమున పరి శోధక పండితులలో భేదాభిప్రాయములు కలవు. పూర్వ శైలము బెజవాడయని కొందఱ యభిప్రాయము : ధాన్యకట కమే యని మఱి కొందఱ మతము. ఇటీవల త్రవ్వఁగా నాగా ర్జునుని కొండయొద్ద బయలుపడిన స్తూప సంఘారామ, ప్రాకృత శాసనాదుల ననుసరించి చూడ ధాన్యకటకమునకుఁ దూర్పున నున్న సంఘారామము పూర్వశైలమను పేరను, పశ్చిమ మున నున్న సంఘారామము అపరశైలమను పేరను బ్రసిద్ధము లయ్యెనని యూహింపఁ దగియున్నది. ఇవికాక కృష్ణా నదీతీరమున కంటక శైలమని మఱియొక సంఘారామ ముండినట్లు శాసనములవలన విదిత మగుచున్నది. ఈ కంటక శైలమే యిప్పటి ఘంటశాల. నాగార్జునునికొండ, అమరా వతు లందలి స్తూపముల వలెనే ఇచ్చటిదికూడ మహాచైత్య