పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

11


నెఱి "శ్వపచో౽పి మునిశ్రేష్ఠ య స్తు లిం
                    గార్చనే రత" యన నట్లు నమ్మి
ప్రీతి “స రుద్రైవ భూతలే” యని “తత్ర
                    సన్నిహిత శ్శివ" యన్నయదియుఁ
దగ "స చ పూజ్యో యథాహ్యహ” మ్మనఁగను
                    నేత్రాంగకక్రియాపాత్ర మగుచు


ఆ.

జంగమంబుఁ గాంచి [1]చరలింగపరవశ
భాతి నుభయలింగభక్తియుక్తి
మహిమఁ దనరినట్టి మల్లికార్జున పండి
తయ్యగారిఁ దలఁతు ననుదినంబు.

8


సీ.

ఆది “రుద్రేణాత్త మశ్నంతి రుద్రేణ
                    పీతం పిబంతి” ప్రఖ్యాతిశ్రుతుల
నన్నిగమాంతర 'మతికిల్బిషం స్యా ద
                    నర్పితం' బనెడుసిద్ధాంతములను
నవికలసిద్ధాంతనివహోక్తి "లోభా న్న
                    ధారయే” త్తనుశివధర్మములను
శివధర్మశాస్త్రదృష్టిఁ "బ్రసాద మేవ భో
                    క్తవ్య" మనుపురాణకాండములను


ఆ.

సిద్ధ మనుచు వేదసిద్ధాంతశాస్త్రపు
రాణతతుల మలహరప్రసాద
మహిమఁ దెలిపినట్టి మల్లికార్జున పండి
తయ్యగారిఁ దలఁతు ననుదినంబు.

9
  1. చని; చను.