పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

అనుభవసారము


క.

గురులింగం బుత్పత్తికి
హరలింగము నిత్యసత్క్రియాస్థితికినిఁ ద
చ్చరలింగము మాయాసం
హరణమునకు నాదికర్త లని తలఁచి మదిన్.

5


క.

భంగిగఁ బూజాక్రియలకు
లింగత్రయ మనఁగఁ బరఁగు లెక్కింపఁగ నే
కాంగం బై చను శ్రీగురు
లింగం బని త్రివిధలింగలీనాత్ముఁడ నై.

6


సీ.

శ్రుతి “ఏక ఏవ రుద్రో న ద్వితీయాయ
                    తస్థే” యనుట యథార్థంబు దలఁప
నవల “నణోరణీయా న్మహతో మహీ
                    యా” నన నదియె యనూనపదము
[1]పంబి “యవాగ్గోచరం” బను "[2]నప్రాప్య
                    మనసా సహా” యనుమాట నిజము
ఏదియుఁ గా దనియెడిపరమేశుఁడే
                    యెంతయు నని యెర్గి యెఱుఁగ ననక


ఆ.

ఎట్టు లనుచు సంశయింపక శివతత్త్వ
సారగద్యపద్యసమితి శివుని
మహిమఁ దెల్పినట్టిమల్లికార్జునపండి
తయ్యగారిఁ దలఁతు ననుదినంబు.

7


సీ.

వేదముల్ ధర “సర్వవేదేష్వతో భవ"
                    తనఁగఁ బరఁగులింగ మతిశయిల్లు

  1. రహి "స ఏ వాగోచరం" బను
  2. అవ్యాప్త