పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

అనుభవసారము


క.

ప్రాక్తనభక్తానీకము
వ్యక్తిగ మత్ప్రాణలింగమంద నియుక్తా
సక్తమతిఁ దలఁచి నూతన
భక్తులఁ బ్రణుతించి తత్కృపాకలితుఁడ నై.

10


క.

నిరవధిగణ్యుఁడు ధన్యుం
డరిషడ్వర్గాపహారుఁ డఘదూరుఁడు సు
స్థిరచారిత్రుఁడు పాత్రుఁడు
పురహరువరమూర్తి చిత్ప్రపూర్తి [1]తలంపన్.

11


క.

త్రిభువనవంద్యుఁ డనింద్యుఁడు
నభవధ్యానప్రవీణుఁ డసమానుఁడు భ
క్తభయాపహరుఁడు ధీరుం
డభిమతశీలుండు వరదయాళుఁడు పేర్మిన్.

12


క.

మంగళభక్తిసమేతుఁడు
జంగమసన్మానదానచర్యోపేతుం
డంగవికారాతీతుఁడు
సంగతభక్తైకదేహజాతుఁడు పేర్మిన్.

13


క.

మనసిజహరవ్రతశీలుఁడు
ఘనతర[2] నాదప్రవీణగానవిలోలుం
డనుపమకీర్తివిశాలుఁడు
జననుతుఁడు గతప్రపంచజాలుం డరయన్.

14


క.

శివయోగానందసుధా
ర్ణవ[3]విహరణ నిరతిశయనిరంతరసౌఖ్యో

  1. ఁదలంతున్
  2. దాన
  3. కారణ